ఓయూలో అజారుద్దీన్ జీవిత కథపై షూటింగ్ Updated :16-11-2015 07:18:31 |
అడ్డుకున్న విద్యార్థులు.. అర్ధాంతరంగా ప్యాకప్
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు పార్లమెంటు మాజీ సభ్యుడు అజా రుద్దీన్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న (డాక్యుమెంటరీ) సినిమా షూటింగ్ ఓయూలో నిర్వహి స్తుండగా, విద్యార్థులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికి వరకు షూ టింగ్ సెట్లు వేసుకున్న సినీ యూనిట్ సభ్యులు విద్యార్థులు అడ్డుకోవడంతో అంతా ప్యాకప్ చేసి వెనుదిరిగారు. వివరాలిలా ఉన్నాయి. అజారుద్దీన్ జీవిత కథపై రూపొందుతున్న సినిమా షూటింగ్ కోసం ఈ నెల 13న ఓయూ రిజిస్ర్టార్ అనుమతి తీసుకుని, అందుకు సంబంధించిన రుసుమును చె ల్లించాయి. ఆదివారం షూటింగ్ నిమిత్తం సినీ హీరో ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ లారా దత్తాతో పాటు వేయి మంది జూనియర్ ఆర్టిస్టులు, షూటింగ్ సామగ్రితో ఓయూ ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నా రు. అయితే, ఆర్ట్స్ కళాశాలలో హైకోర్టుకు సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించేందుకు గాను సెట్లు వేశారు. ఆర్ట్స్ కళాశాల ముందరి భాగంలో ఒక క్యాంటిన్‌ను కూడా ఏర్పాటు చేశారు. సెట్లు వేశాక హీరో హీరోయిన్లు ఇమ్రాన్ హష్మీ, లారాదత్తాలు వచ్చి షూటింగ్ ప్రారంభిస్తుండగా విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విద్యార్థులు తక్షణమే షూటింగ్ నిలిపివేయాలన్నారు. విద్యార్థులకు నచ్చజెప్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ విద్యార్థులు ససేమిరా అనడంతో షూటింగ్ నిలిపివేశారు. అనంతరం, నిర్వాహకులు మాట్లాడుతూ తాము అన్ని అనుమతులు తీసుకున్నామని అయినా, విద్యార్థులు తమకు అనుమతులు లేవంటూ అడ్డుకున్నారని చెప్పారు. ఇలా షూటింగ్‌లు అడ్డుకోవడం విద్యార్థులకు తగదని వారు అభిప్రాయపడ్డారు. షూటింగ్ నిలిచిపోవడంతో తమకు సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు నష్టం వాటిల్లిం దని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది విద్యార్థి నాయకులు వచ్చి తాము అడిగినంత సొమ్ము ముట్టజెప్పితే షూటింగ్ జరుపుకోనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని బెదిరించారని వారన్నారు. విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. విద్యార్థులు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్ స్థాయిలో ఓయూ పరువు పోయిందని వాపోయారు. షూటింగ్ నిర్వహించడం వల్ల వర్సిటీకి ఆర్థిక లాభం చేకూరుతుందని, అయితే తమ షూటింగ్ వల్ల ఎవరికి ఎలాంటి నష్టము, కష్టము కలుగదన్నారు.
|
No comments:
Post a Comment