అమెరికా మీడియా విశ్లేషణ
వాషింగ్టన్, నవంబరు 9: బిహార్ ఎన్నికల ఫలితాలు సహా ప్రధాని మోదీపై అమెరికా మీడియా ఆది, సోమవారాల్లో విశేష కథనాలను ప్రసారం చేసింది. బిహార్ ఫలితాలు మోదీకి రాజకీయ ఎదురుదెబ్బగా పత్రికలు, చానెళ్లు పేర్కొన్నాయి. దేశంలో బీజేపీ గత ఏడాది పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబించాయని, ఇది ప్రజా తీర్పు అని అమెరికా వార్తా విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. దేశంలో అమలవుతున్న ఆర్థిక, సామాజిక పథకాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయని మిచిగాన్ వర్సిటీ ప్రొఫెసర్ పునీత మన్‌చందా అన్నారు.
మోదీ టపాసులను బిహార్ దోచుకుంది! Updated :10-11-2015 02:05:07 | |
పాక్ పత్రికల పతాక కథనాలు ఇస్లామాబాద్, నవంబరు 9: బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై పాకిస్తానలోని లీడింగ్ దినపత్రికలు డాన, ది నేషన్, ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లు సోమవారం నాటి సంచికల్లో విశేష కథనాలను వండివార్చాయి. డాన్ పత్రిక పతాక కథనం.. ‘మోదీ టపాసులను బిహార్ దోచుకుంది’ శీర్షికన రాసింది. అదేవిధంగా మోదీ లక్ష్యంగా రాసిన సంపాదకీయంలోనూ పలు వ్యాఖ్యలు చేసింది. బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత షా చేసిన ‘ఇక్కడ ఓడిపోతే అక్కడ(పాకిస్తానలో) టపాసులు కాల్చుకుంటారు’ అన్న వ్యాఖ్యలపైనా పత్రిక ప్రత్యేకంగా కథనాలు వండింది. ఆయా కథనాల్లో.. ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ఆవు రాజకీయాలు.. వాటికి మేతగా మారాయని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. బిహార్ ఫలితాలపై పాకిస్తాన ప్రజలు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూసినట్టు డాన రాసింది. ఇక, ది నేషన్ పత్రిక కూడా బిహార్ ఎన్నికల ఫలితాన్నే పతాక కథనం వెలువరించింది. బిహార్ ఓటమి.. మోదీకి మింగుడు పడడం లేదని పేర్కొంది. ‘ఖచ్చితంగా గెలుస్తామని భావించిన మోదీకి తాజా ఫలితాలు పెద్ద ఎదురు దెబ్బ’ అని పతాక కథనంలో రాసింది.
|
No comments:
Post a Comment