''ఎగ్జిట్''' మీద లెంపేసుకున్న ఎన్డీటీవీ
November 9th, 2015, 11:49 AM IST
ప్రముఖ మీడియా సంస్థల నుంచి వచ్చే వార్తలు జనసామ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అత్యుత్సాహమో.. మితిమీరిన ఆత్మవిశ్వాసమో.. లేక సాంకేతికంగా దొర్లిన తప్పులో కానీ బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పు కావటంపై ఆ ఛానల్ వ్యవస్థాపకుడు ప్రణవ్ రాయ్ చెంపలేసుకున్నారు.
బీహార్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే పలు మీడియా సంస్థలు బీహార్ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. వీటిల్లో ఒకట్రెండు తప్పించి.. మిగిలిన వారంతా నితీశ్ నేతృత్వంలోని లౌకిక మహా కూటమికే పట్టం కట్టారు.
ఇదంతా జరిగిన ఒక రోజు తర్వాత ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ తన ఎగ్జట్ పోల్స్ ను వెల్లడించింది. అత్యధికులు ఇచ్చిన అంచనాలకు భిన్నంగా.. బీహార్ లో ఎన్డీయే సర్కారు కొలువు తీరుతుందని.. దాదాపు 150కు పైగా సీట్లు వస్తాయని లెక్క వేసింది. మహా కూటమికి ఘోర పరాజయం తప్పదని లెక్కేసింది.
అందుకు భిన్నంగా ఫలితాలు ఉండటతో ఎన్డీటీవీ ఇరుకున పడింది. నిజానికి ఎన్డీటీవీ తన ఎగ్జిట్ ఫలితాలను.. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక్క రోజు ముందు విడుదల చేయటం.. అవన్నీ కూడా మెజార్టీ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా ఉండటంతో కొద్దిపాటి గందరగోళానికి గురి చేసింది. ఎన్డీటీవీ లాంటి సంస్థ ఎన్డీయేకు 150కు పైనే సీట్లు వస్తాయని చెప్పటంతో తుది ఫలితంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు.. ఎగ్జిట్ పోల్స్ లో ఇంతటి వైరుధ్యం లేకపోవటంతో.. ఎన్డీటీవీ మాటలకు విశేష ప్రచారం లభించింది.
తీరా.. ఫలితాలు వెల్లడైన తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. 150 స్థానాలు ఎన్డీయేకు వస్తాయన్న ఎన్డీటీవీ మాట ఎంత తప్పన్నది తేలటంతో ఎన్డీటీవీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే.. జరిగిన పొరపాటును హుందాగా ఒప్పుకోవటం ద్వారా ఎన్డీటీవీ మనసును దోచుకుంది. సాంకేతికంగా చోటు చేసుకున్న తప్పుల కారణంగా పెద్ద తప్పు జరిగిందని.. దీనికి తాము క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొంది. ప్రణవ్ రాయ్ క్షమాపణలు చెప్పటంతో పాటు.. అప్పట్లో ఎన్టీఆర్ విషయంలోనూ.. ఇప్పుడు నితీశ్ విషయంలో పొరపాటు పడినట్లుగా చెప్పి.. భవిష్యత్తులో ఇంత పెద్ద తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు.
- See more at: http://telugu.gulte.com/tnews/12045/NDTV-Pranay-Roy-Says-Sorry-On-Exit-Polls#sthash.4BTzG40G.dpufబీహార్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే పలు మీడియా సంస్థలు బీహార్ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. వీటిల్లో ఒకట్రెండు తప్పించి.. మిగిలిన వారంతా నితీశ్ నేతృత్వంలోని లౌకిక మహా కూటమికే పట్టం కట్టారు.
ఇదంతా జరిగిన ఒక రోజు తర్వాత ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ తన ఎగ్జట్ పోల్స్ ను వెల్లడించింది. అత్యధికులు ఇచ్చిన అంచనాలకు భిన్నంగా.. బీహార్ లో ఎన్డీయే సర్కారు కొలువు తీరుతుందని.. దాదాపు 150కు పైగా సీట్లు వస్తాయని లెక్క వేసింది. మహా కూటమికి ఘోర పరాజయం తప్పదని లెక్కేసింది.
అందుకు భిన్నంగా ఫలితాలు ఉండటతో ఎన్డీటీవీ ఇరుకున పడింది. నిజానికి ఎన్డీటీవీ తన ఎగ్జిట్ ఫలితాలను.. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక్క రోజు ముందు విడుదల చేయటం.. అవన్నీ కూడా మెజార్టీ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా ఉండటంతో కొద్దిపాటి గందరగోళానికి గురి చేసింది. ఎన్డీటీవీ లాంటి సంస్థ ఎన్డీయేకు 150కు పైనే సీట్లు వస్తాయని చెప్పటంతో తుది ఫలితంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు.. ఎగ్జిట్ పోల్స్ లో ఇంతటి వైరుధ్యం లేకపోవటంతో.. ఎన్డీటీవీ మాటలకు విశేష ప్రచారం లభించింది.
తీరా.. ఫలితాలు వెల్లడైన తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. 150 స్థానాలు ఎన్డీయేకు వస్తాయన్న ఎన్డీటీవీ మాట ఎంత తప్పన్నది తేలటంతో ఎన్డీటీవీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే.. జరిగిన పొరపాటును హుందాగా ఒప్పుకోవటం ద్వారా ఎన్డీటీవీ మనసును దోచుకుంది. సాంకేతికంగా చోటు చేసుకున్న తప్పుల కారణంగా పెద్ద తప్పు జరిగిందని.. దీనికి తాము క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొంది. ప్రణవ్ రాయ్ క్షమాపణలు చెప్పటంతో పాటు.. అప్పట్లో ఎన్టీఆర్ విషయంలోనూ.. ఇప్పుడు నితీశ్ విషయంలో పొరపాటు పడినట్లుగా చెప్పి.. భవిష్యత్తులో ఇంత పెద్ద తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు.
No comments:
Post a Comment