Monday, 9 November 2015

రాహుల్‌.. పార్టీ పగ్గాలు అందుకో

రాహుల్‌.. పార్టీ పగ్గాలు అందుకో 
Updated :10-11-2015 02:02:15
  • ఇదే సరైన సమయం: కాంగ్రెస్‌ నేతలు
  • బిహార్‌ విజయంలో రాహుల్‌దే కీలక పాత్ర
  • ఆయన వల్లే మహాకూటమి
న్యూఢిల్లీ, నవంబరు 9: బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో ఆ పార్టీ నేతల ఆనందానికి పగ్గాల్లేకుండా పోతోంది. తమ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని వారు ఆకాశానికెత్తేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన సమయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీపీ జోషీ అన్నారు. కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. బిహార్‌లో ఆయన పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంటనే రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టాలని, సోనియా మార్గదర్శకత్వంలో పనిచేయాలని సూచించారు. బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు సీట్లు గణననీయంగా పెరిగాయని.. ప్రజల్లో రాహుల్‌ రప్రతిష్ఠ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్నికల్లో మహా లౌకిక కూటమి విజయంలో నితీశ్‌ కీలక పాత్ర పోషించినా... వాస్తవానికి ఈ కూటమి ఏర్పడడానికి రాహుల్‌గాంధీయే సూత్రధారి అని, నితీశ్‌, లాలూను ఏకతాటిపైకి తెచ్చారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తద్వారా బిహార్‌లో కాంగ్రెస్‌ భారీగా లబ్ధి పొందిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించడం సబబు అని, ఈ నెలలో జరిగే ఏఐసీసీ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని చెప్తున్నారు.

No comments:

Post a Comment