Monday, 9 November 2015

కులమే ‘మహా’బలం

కులమే ‘మహా’బలం 
Updated :10-11-2015 02:11:20
అదే ఓడించింది.. దీనికి ఎవరూ బాధ్యులు కారు.. భగవత వ్యాఖ్యలు కూడా కారణం కాదు 
  • మన అంచనాలే తప్పాయి
  • బీజేపీ పీపీ బోర్డు సమావేశంలో అంతర్మథనం
న్యూఢిల్లీ, నవంబరు9(ఆంధ్రజ్యోతి): బిహార్‌ ఎన్నికల ఫలితాలపై బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ పార్లమెంటరీ పార్టీ(పీపీ) బోర్డు సమావేశంలో బిహార్‌ ఓటమికి గల కారణాలపై నేతలు లోతుగా సమీక్షించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బిహార్‌ ఓటమికి ఎవరినీ బాధ్యులను చేయకూడదని నేతలు నిర్ణయించారు. అదేవిధంగా బిహార్‌ ఎన్నికల వేళ.. రిజర్వేషన్లపై సమీక్ష జరగాలంటూ ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఓటమికి కారణం కాదని నేతలు అభిప్రాయపడ్డారు. మహాకూటమి బలాన్ని తక్కువగా అంచనా వేశామని, కుల సమీకరణలు ఆ కూటమి విజయానికి దోహదం చేశాయని నేతలు అభిప్రాయానికొచ్చారు. మహా కూటమిలోని జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రె్‌సలకు చెందిన సంప్రదాయ ఓటర్ల మద్య సయోధ్య కుదరదని వేసుకున్న అంచనాలు తప్పని తేలాయని నేతలు నిర్ణయానికి వచ్చారు.
 
సమష్టి బాధ్యతే: జైట్లీ
‘బిహార్‌లో ఓటమికి ఎవరినీ బాధ్యులను చేయాలనుకోవడం లేదు. గెలుపునకు, ఓటమికి సమష్టిగానే బాధ్యత వహిస్తాం’ అని పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాతో అన్నారు. ఢిల్లీ, బీహార్‌లలో వరుస ఓటమి కారణంగా అమిత్‌షాను పదవినుంచి తప్పిస్తారా? అన్న ప్రశ్నకు.. ‘ఆయన హయాంలోనే 4 రాష్ర్టాల ఎన్నికల్లో గెలిచాం, మరికొన్ని రాష్ర్టాల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది’ అని అన్నారు. గెలుప ఓటములు రాజకీయాల్లో సహజమని ఓటమికి ఉమ్మడి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఓటమికి ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యలు కారణమవుతాయని అనుకోవడం లేదు. ఓటమికి చాలా కారణాలున్నాయి. మొదటినుంచి రిజర్వేషన్లను కొనసాగించాలన్నదే మా అభిమతం. సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే మా అభిమతం. ఆర్‌ఎ్‌సఎస్‌ అభిప్రాయం కూడా అదే. ఇందులో శషభిషలకు తావులేదు’ అని చెప్పారు. బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే సీఎం అభ్యర్థిని ఉద్దేశపూర్వకంగానే ప్రకటించలేదన్నారు. ‘మేము అనుకున్నట్లుగా మా మిత్రపక్షాల ఓట్లు మాకు బదిలీ కాలేదు. మహాకూటమి పార్టీలోని సామాజిక సమీకరణాలు విజయాన్ని సాధించాయి. పక్కాగా కూటమి పార్టీల ఓట్లు బదిలీ అయ్యాయి. అందుకే గెలిచారు’ అని జెట్లీ వివరించారు. అయితే, ఎన్నికల సమయంలో కొందరు చేసిన బాధ్యతా రహిత వ్యాఖ్యలు ప్రభావం చూపాయని, వాటిని నిలువరించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. దీనికి ముందు మీడియాతో మాట్లాడిన జైట్లీ.. బిహార్‌ ఎన్నికల పరాజయం తాలూకు నీడలు.. ఆర్థిక సంస్కరణలపై ఎంతమాత్రమూ పడబోవన్నారు. అదేవిధంగా జీఎస్టీ చట్టం విషయంలోనూ కేంద్రం ముందుకు పోతుందని చెప్పారు. ‘దీనివల్ల(బిహార్‌ ఫలితాలు) ఆర్థికరంగంపై ప్రభావం పడుతుందని నేను అనుకోవడంలేదు. సంస్కరణల పథం కొనసాగుతుంది’ అని జైట్లీ అన్నారు. రాష్ట్ర ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి రెఫరెండం కాబోవన్నారు. బిహార్‌లో బీజేపీకి ఓట్లు తగ్గలేదని చెప్పారు. బిహార్‌కు ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామన్నారు. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో బిహార్‌ అభివృద్ధి చెందాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. జీఎస్టీ చట్టం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని మరింతగా ముందుకు పోతుందని అన్నారు. అయితే జీఎస్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు.
 
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో షా భేటీ
బిహార్‌ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షా ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవతతో సోమవారం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు గంట సేపు జరిగిన భేటీలో బిహార్‌ ఎన్నికల ఫలితాల సరళి, ఓటమి, మహాకూటమి బలాబలాలు, ఓటమికి దారితీసిన పరిస్థితులపై భగవతతో షా చర్చించినట్టు సమాచారం. అయితే, పార్టీ నేతలు మాత్రం.. దీనిని సాధారణ భేటీగానే పేర్కొన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా.. బీజేపీ అగ్రనేతలు కలుస్తుంటారని వారు తెలిపారు.

మాటల తూటాలు! 
  • బీజేపీ పరాజయం అనంతరం.. మాజీ ఎంపీ అరుణ్‌శౌరీ.. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఎంపీలు చాలా మంది అంగీకరించారు.
  • బిహార్‌ ఓటమి తర్వాతైనా మోడీ తన వైఖరిని మార్చుకుంటే బావుంటుందని లేకపోతే తామంతా వేరే పార్టీని చూసుకోవడం మంచిదని దక్షిణాదికి చెందిన ఒక ఎంపీ తన మనసులోని మాటను బయట పెట్టారు.
  • బిహార్‌ ఎన్నికలను వ్యక్తిగత వైరంగా మార్చడం వల్లనే ఇంత దారుణంగా ఓడిపోయామని, బీజేపీ-మహాకూటమి మధ్య పోటీలాగా జరిగి ఉంటే గౌరవ ప్రదమైన ఓటమైనా లభించేదని, ఈ ఫలితాలనుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలని మరికొంత మంది ఎంపీలు అగ్రనాయకత్వానికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
  • ‘ఏదైనా సలహా ఇస్తే ఎక్కడ తప్పుగా భావిస్తారేమోనని భయపడుతున్నాం.. మాలో మేము మథనపడటం తప్పితే చేసేదేమీ లేదు’ అని ఎంఎస్‌ ప్లాట్‌లో ఉంటున్న కొంత మంది బీజేపీ ఎంపీలు తమ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.
  • 2014 ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తమకు తిరుగులేదనుకుంటే చెల్లదని, పార్టీలో సీనియర్లను గౌరవించడమే కాకుండా పార్టీకోసం కష్టపడిన వారిని ఇప్పటికైనా గుర్తించాలని మరికొందరు కోరుతున్నారు.

No comments:

Post a Comment