ఏ ఆయిల్ మంచిది? Updated :12-11-2015 22:07:54 |
స్థూలకాయం, కొలెస్ట్రాల్, జీర్ణకోశవ్యాధులు, హృద్రోగాలు వంటివన్నీ వంటనూనెలు మితిమీరి వాడటం వల్లే వస్తుంటాయి. అలాగని వాటిని పూర్తిగా మానేసినా మంచిది కాదు. కాబట్టి వంటల్లో రోజూ ఎలాంటి నూనెలు వాడాలి? ఎందుకు వాడాలో తెలుసుకోవాలంటే ఇది చదవండి.
రైస్‌బ్రాన్ ఆయిల్
ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువ. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. సహజసిద్ధమైన విటమిన్-ఇ లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. చర్మకాంతిని మెరుగుపరిచే పోషకాలు రైస్‌బ్రాన్‌లో ఉంటాయి. ఈ నూనెతో ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్
అల్జీమర్స్, పార్కిన్‌సన్ వంటి నాడీమండల వ్యాధుల్ని రాకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.
సన్‌ఫ్లవర్ నూనె
పొద్దుతిరుగుడు గింజల నూనె వాడకం శ్రేయస్కరం. ముఖ్యంగా హృద్రోగసంబంధిత జబ్బుల్ని రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కొలోన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందీ నూనె. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాడీమండల వ్యవస్థను చురుగ్గా మార్చివేస్తుంది.
వేరుశనగ నూనె
శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే నూనె ఇది. మోనో శాచురేటెడ్, పోలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం. హృద్రోగాలు, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడే ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్ కూడా వేరుశనగ నూనెలో ఉన్నాయి. అయితే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు పొగ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఆవనూనె
జీర్ణశక్తిని పెంపొందించే గుణం అధికం. ఉదరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియా, వైరస్‌ను అడ్డుకుంటుంది ఆవనూనె. దగ్గు, జలుబులతో పాటు చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఈ నూనె వాడకం వల్ల కడుపులో మంట కూడా తగ్గుతుంది.
బాదం నూనె
ఈ నూనె ముఖ్యంగా రెండు సమస్యలను తగ్గిస్తుంది. ఒకటి గుండెజబ్బు, రెండు క్యాన్సర్. మంచి కొవ్వును పెంచుతుంది. అప్పుడప్పుడు కడుపులో తలెత్తే గందరగోళం (ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్) రాకుండా చూస్తుంది. కొలోన్ క్యాన్సర్ రానివ్వదు.
కొబ్బరినూనె
చెడు బ్యాక్టీరియాను తరిమేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కొబ్బరినూనె వాడకంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
పామ్ ఆయిల్
కెరొటిన్, విటమిన్-ఇలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పామ్ ఆయిల్‌లో ఉంటాయి. వయసును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఎక్కువ. క్యాన్సర్, అల్జీమర్స్, ఆర్థరైటిస్ బాధితులకు పామ్ ఆయిల్ మంచిది. అయితే మోతాదుకు మించి వాడకూడదు. |
No comments:
Post a Comment