Saturday, 28 November 2015

ఏపీలో మలేషియా పాలన

ఏపీలో మలేషియా పాలన

Sakshi | Updated: November 28, 2015 16:43 (IST)
ఏపీలో మలేషియా పాలన
హైదరాబాద్: : సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని నిర్ణయించినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సి ఉందని, అందులో భాగంగా మలేషియా ల్యాబ్ ఎక్సర్‌సైజ్‌ను అనుసరించాలని చెప్పారు. ఆరెంజ్, గ్రీన్ కలర్స్ పెట్టుకుని ప్రతి మూడు నెలలకోసారి ప్రగతిని సమీక్షించే ఈ విధానం మలేషియాలో సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో కూడా మలేషియా తరహాలో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

దాదాపు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లోని సచివాలయానికి వచ్చిన చంద్రబాబు ఈ సందర్భంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. శాఖల వారిగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరయ్యారు.

రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృధ్ది రేటు 7.48 శాతంగా నమోదైందని, 2015-16లో 10.83 లక్ష్యంగా నిర్ధేశించినట్టు చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం, ప్రాజెక్టులు, నీరు-చెట్టు, భూ గర్భ జలాల సంరక్షణ వంటి అంశాలపై మాట్లాడారు.

నెల్లూరులో జరిగిన విచ్చలవిడి కట్టడాల వల్లే ఇటీవలి కాలంలో ఆ పట్టణంలో వరద బీభత్సం సృష్టించిందని చెప్పారు.  అనంతపురం జిల్లాలో ఈసారి ఊహించని విధంగా వర్షపాతం పెరిగిందని, భూ గర్బ జలాలు అందక రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారని చెబుతూ, 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 3 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 150 దేవాలయాల పని తీరును ఆయన ప్రశంసించారు. ఈ ఏడాది రాష్ట్రంలో పర్యాటకుల ముఖ్యంగా విదేశీ పర్యాటకులు సంఖ్య పెరిగిందని చెప్పారు.

No comments:

Post a Comment