వెంకయ్య వ్యాఖ్యలు: చంద్రబాబుపై బిజెపి ఆసంతృప్తి
Posted by: Pratap Published: Saturday, March 7, 2015, 17:26 [IST] Share this on your social network: FacebookTwitterGoogle+ CommentsMail హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరు పట్ల బిజెపి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు మీడియాకు ఎక్కడంపై బిజెపి నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. టిడిపి నాయకుల మాట అలా ఉంచితే స్వయంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టడం వారికి మింగుడు పడడం లేదని అంటున్నారు. తాజాగా, కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు చేసిన ఆరోపణలు కూడా అదే విషయాన్ని పట్టిస్తున్నాయి. మిత్రపక్షాల నాయకులు బహిరంగంగా మాట్లాడడం సరి కాదని, ఏవైనా సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని వెంకయ్యనాయుడు శనివారం నెల్లూరులో అన్నారు. ఈ మాటలను ఆయన చంద్రబాబును ఉద్దేశించే అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని తప్పు పట్టారు. గవర్నర్ ప్రసంగం కూడా కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వెళ్లగక్కిన అంశాలే ఉన్నాయి. అయితే, ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు శనివారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. విభజన చట్టాన్ని అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో లేదని ఆయన అన్నారు. ఈ రకంగా చూస్తే ఎపికి ప్రత్యేక హోదా లభించదనే విషయం మరింతగా రూఢీ అవుతోంది. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా ఎపికి ప్రత్యేక హోదా రాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. అంటే, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి లేదనే అభిప్రాయమే ఆయన మాటల్లో వ్యక్తమైంది. తాను బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేనంటూనే చంద్రబాబు కేంద్రంపై అసంతృప్తి రూపంలో విమర్శలు చేస్తున్నారు. దానికితోడు, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్రాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కొనసాగడమేమిటని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి మంత్రులను ఇంకా ఎందుకు కొనసాగస్తున్నారని కూడా ఆయన అడిగారు. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో మాట మార్చడం వెనక కూడా చంద్రబాబు హస్తం ఉందనే అభిప్రాయంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశంలో తప్పు పట్టారు. రాజధాని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ఎత్తిచూపిన పవన్ కళ్యాణ్ మాట మార్చి, హైదరాబాద్ మీడియా సమావేశంలో కేంద్రంపైనే ప్రదానంగా దృష్టి కేంద్రీకరించారు. ఏమైనా, తెలుగుదేశం, బిజెపిల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవనే విషయం అర్థమవుతోంది.
Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/venkaiah-comments-bjp-unhappy-with-chandrababu-152295.html

No comments:
Post a Comment