ఇదీ తెలంగాణలో రైతు ఆత్మహత్యల లెక్క!
సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే116 మంది
ఏపీలో 63 మంది రైతుల బలవన్మరణం
సర్కారీ గణాంకాలు అంతంతే.. .. 2 రాష్ట్రాల్లో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన
రైతు ఊపిరి ఉరి కొయ్యకు బరువుగా వేలాడుతుంటే...
సర్కార్లు లెక్కల చిక్కుముళ్ల పేరుతో చికాకు పడుతున్నాయి!!
రైతు బతుకు కరెంటు తీగ మీద మృతదేహమై కాలిపోతుంటే...
ప్రభుత్వాలు కారణాల కహానీలతో కాలం గడుపుతున్నాయి!!
రైతు జీవితం పురుగు మందుతో కాలగర్భంలో కలసిపోతుంటే...
పాలకులు పరిహారం ఎంత అంటూ పరిహాసాలాడుతున్నారు!!!
‘ఆత్మహత్య చేసుకున్న రైతులు 97 మంది’...
ఇది మంత్రి పోచారం మార్చి 9న శాసనమండలిలో చెప్పిన లెక్క.
‘5 లక్షల పరిహారం ఇవ్వం.. పేర్లు మిస్సైతే చెప్పండి. చేరుస్తాం’...
ఇది సీఎం కేసీఆర్ మార్చి 17న శాసనసభలో చెప్పిన మాట.
‘2009 తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి.
రైతు పరిస్థితి అంత ఆందోళనకరంగా ఏమీ లేదు’...
ఇది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్.
ఏది నిజం! ఎవరు నిజం? మొత్తం తెలంగాణలో హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో కలిపి, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరుదాకా ఆత్మహత్య చేసుకున్న రైతులు 97 మందే అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది! ఈ లెక్కన సగటున ఒక్కో జిల్లాలో నెలకు ఒక్క రైతు చనిపోయినట్లు! ‘‘రైతు ఆత్మహత్యలపై బాధపడుతున్నాం. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం పెంచం. రూ.5 లక్షల పరిహారం ఇవ్వం. ఉన్న స్కీమ్ ప్రకారమే పరిహారం చెల్లిస్తాం. మేం ఇచ్చిన జాబితాలో రైతుల పేర్లు మిస్ అయితే వివరాలు ఇవ్వండి. ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందో అది చేస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులకు న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష! మరి తెలంగాణ వచ్చాక, తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 97 మందేనా? ప్రభుత్వ జాబితాలో చేరకుండా ఎవరైనా మిగిలిపోయారా? ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు
లేనే లేవా? అనే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ దృష్టి సారించింది. తెలంగాణవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలోనే ఆత్మహత్యలు జరిగాయని ఈ పరిశీలనలో తేలింది. కొన్ని నెలలపాటు ప్రతి రోజూ ఇద్దరు, ముగ్గురు, నలుగురి దాకా, రైతులు ఆత్మహత్య చేసుకున్నారని క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు కనిపించాయి.
2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా జిల్లాల వారీగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ఆంఽధ్రజ్యోతి సేకరించింది. అప్పుల బాధ భరించలేక, గిట్టుబాటు ధరల్లేక, పంట పండక... ఇలా రకరకాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 97 కాదు... 593 (‘ఆంధ్రజ్యోతి’ సోమవారం సంచిక ప్రచురణ నాటికి) అని తేలింది. ఉరి వేసుకుని, పురుగుల మందు తాగి, రైలు కింద పడి... ఇలా రకరకాల రూపాల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక.. ఎండిన పంట చూసి గుండె పగిలి మరణించిన వారూ ఉన్నారు. గుండెపోటు మరణాలను మినహాయించినా... రైతు ఆత్మహత్యలు 593గా లెక్క తేలింది. జిల్లాల వారీగా ఏ రైతు, ఎప్పుడు, ఎలా ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లోనే ఏకంగా 116 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం పెను విషాదం. ఆ తర్వాత 94 రైతు ఆత్మహత్యలతో కరీంనగర్ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో సుమారు 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ‘రైతు స్వరాజ్య వేదిక’ అంచనా వేసింది. 593 మంది రైతులు బలవన్మరణం పాలైనట్లు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో స్పష్టమైంది. మరి... సర్కారు వారి లెక్క మాత్రం 97 వద్దే ఆగిపోయింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది తగిన విచారణ జరిపి, రైతు ఆత్మహత్యలను నిర్ధారించకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవో నెంబర్ 421 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలి. అప్పులిచ్చిన వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.50 వేలు అందించాల్సి ఉంటుంది. ఇంకా... పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించడం, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు, పెన్షన్ కూడా మంజూరు చేయాలి. ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్లతో ఏర్పాటైన కమిటీ విచారణ జరిపి... రైతు ఆత్మహత్యలను నిర్ధారించాల్సి ఉంది. కానీ... ఈ విచారణ సక్రమంగా జరగడంలేదని... రైతు ఆత్మహత్యలపై సర్కారు చెబుతున్న లెక్కలు తప్పని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘అతను రైతే. వ్యవసాయంలో కష్టనష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు’ అని స్థానికులు ధ్రువీకరిస్తున్నప్పటికీ... అధికారుల వైపు నుంచి మాత్రం కనికరం కనిపించడంలేదు.
ఏ జిల్లా చూసినా...
జీవనదులున్న ఖమ్మం నుంచి కరువు జిల్లా మహబూబ్‌నగర్ దాకా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతు ఆత్మహత్యలు భారీ స్థాయిలో జరిగాయి. పెద్దగా సాగునీటి ప్రాజెక్టులేవీ లేక... వర్షాలు, భూగర్భ జలాలపైనే ఆధారపడిన మెదక్ జిల్లా రైతు ఆత్మహత్యలకు నిలయంగా మారింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఏకంగా 116 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దౌల్తాబాద్ మండలం తిమ్మక్‌పల్లికి చెందిన భాస్కర్ రెడ్డి అనే రైతు తన పొలంలో నాలుగు బోర్లు వేశారు. ‘‘ఆయనకు రెండు లక్షల రూపాయల అప్పు ఉండేది. ఏడెకరాల భూమి కౌలుకు తీసుకుని మరో రెండు లక్షలు అప్పు చేశాడు. ఈసారి వానల్లేక పంటలు పండకపోవడంతో భాస్కర్ రెడ్డి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు’’ అని అదే గ్రామానికి చెందిన రైతు జగపతి రెడ్డి తెలిపారు. అత్యంత కరువు జిల్లా... మహబూబ్‌నగర్‌లో 78 మంది బలవన్మరణం పాలయ్యారు. ప్రభుత్వం మాత్రం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 20 మందేనని తెలిపింది.
ఉదాహరణకు... మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ రైతు చిక్కొండ నారాయణ నిరుడు నవంబర్ 13న పురుగుల మందు తాగి చనిపోయారు. ఆయన మరణానికి వ్యవసాయ సంబంధమైన కష్టాలు, దానివల్ల పెరిగిన అప్పులే కారణమని స్థానిక రైతులూ ధ్రువీకరించారు. ‘‘మా ఊళ్లో రెండేళ్ల నుంచి పంటలు సరిగా లేవు. పత్తి, వేరుశనగ పంటలకు పురుగు సోకి చాలామంది నష్టపోయారు. నారాయణ కూడా ఇలాగే నష్టపోయాడు. అప్పటికే ఆయనకు అప్పులున్నాయి. ఈ కష్టం భరించలేక పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోయాడు’’ అని పాండు అనే రైతు తెలిపారు. జిల్లాలో 20 మంది రైతులు మరణించినట్లు ప్రభుత్వమే గుర్తించినప్పటికీ... ఇప్పటికి రెండు కుటుంబాలకు మాత్రమే పరిహారం అందింది.
జూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సొంత జిల్లాలో ఏకంగా 116 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దగా సాగునీటి ప్రాజెక్టులేవీ లేక... వర్షాలు, భూగర్భ జలాలపైనే ఆధారపడిన మెదక్ జిల్లా.. రాష్ట్రం మొత్తంలోనే రైతు ఆత్మహత్యలకు ప్రధాన నిలయంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలో 71 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. అయితే...17 మంది మాత్రమే ‘నిజమైన రైతులు’ అని నిర్ధారించారు. వారికి మాత్రమే పరిహారం ఇచ్చారు.
నూతన రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచీ ఇప్పటిదాకా తెలంగాణలో సుమారు 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ‘రైతు స్వరాజ్య వేదిక’ అంచనా వేసింది. 593 మంది అన్నదాతలు బలవన్మరణం పాలైనట్లు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో స్పష్టమైంది. మరి... సర్కారు వారి లెక్క మాత్రం 97 వద్దే ఆగిపోయింది.
నిజామా‘బాధ’...
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి (40) శారీరకంగా వికలాంగుడు. వ్యవసాయాన్ని, కష్టాన్ని నమ్ముకున్నాడు. కానీ... కాలం కలిసిరాక, పంటలు పండక అప్పులపాలయ్యారు. చివరికి... గత ఏడాది అక్టోబర్ 14న ఆత్మహత్య చేసుకున్నారు. కానీ... ప్రభుత్వం ఆయనను రైతుగా, ఆయనది రైతు ఆత్మహత్యగా గుర్తించనేలేదు. సాయిరెడ్డి కుటుంబ సభ్యులు కనిపించిన అధికారినీ పట్టుకుని సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇక... ఆదిలాబాద్ జిల్లాలోని 52 మండలాల్లో ఏకంగా 40 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. కానీ... ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా గుర్తించలేదు. సాగు కలిసిరాక, అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో 71 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. అయితే... వీరిలో 17 మంది మాత్రమే ‘నిజమైన రైతులు’ అని అధికారులు నిర్ధారించారు. వారికి మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగిలిన వారికి కన్నీరే మిగిలింది. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజయ్య(40) కుటుంబానిదీ అదే దయనీయ పరిస్థితి. ‘‘మాకు రెండెకరాలుంది. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాం. కరెంటు కోతలు, బావుల్లో నీళ్లు లేక వేసిన పత్తి ఎండిపోయింది. 2 లక్షలు నష్టం వచ్చింది. అప్పులు కట్టే పరిస్థితి లేక నా భర్త పల్లపు రాజయ్య గత ఏడాది ఆగస్టు 3న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సహాయం కోసం పెట్టుకున్న దరఖాస్తు పెట్టుకున్నా ఫలితం లేదు’’ అని రాజయ్య భార్య పోచమ్మ వాపోయారు.
ఓరుగల్లు ఘోష...
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్, ఆత్మకూర్, సంగెం మండలం మినహా... మిగిలిన అన్ని మండలాల్లో రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 52 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో మహిళా రైతులూ ఉన్నారు. ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన పంచగిరి బిక్షపతి (52) రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తనకున్న 20 గుంటలతోపాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. అకాల వర్షాలతో నష్టపోయి... మృత్యువును ఆశ్రయించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. ఇక రైతు ఆత్మహత్యల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 94 మంది బలవన్మరణం పాలయ్యారు. ‘‘మాది మధ్య తరగతి కుటుంబం. రెండకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెద్దబ్బాయి నవీన్ సీఏ, చిన్నబ్బాయి ఇంజినీరంగ్ చదువుతున్నాడు. వారిని బాగా చదివించి ప్రయోజకులను చేయాలనే తపనతో మూడేళ్లుగా మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. అందులో పత్తి, మొక్కజొన్న సాగు చేయగా పంటలు సక్రమంగా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అటు వ్యవసాయం దెబ్బతిని, ఇటు పిల్లలను చదివించే పరిస్థితి లేకపోవడంతో నా భర్త ఊకంటి మధుసూదన్ రెడ్డి పురుగుల మందు తాగి మరణించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ రాలేదు’’ అని రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన రజిత కన్నీరు మున్నీరవుతున్నారు.
రంగారెడ్డి (42)
1) మదాస్ వెంకటయ్య (కొండాపూర్(మం), గండీడ్ (గ్రా), జూన్ 06) 2)తెలుగు నర్సింహులు(చెన్‌వెల్లి, చేవెళ్ల, జూలై 03) 3) పిల్లిగుండ్ల మాణయ్య (రావులపలి, మర్పల్లి, జూలై 09) 4) అంతారం అనంతయ్య (అనంతి), బూచన్‌పల్లి, మర్పల్లి, జూలై 07) 5)ఎం.వెంకటయ్య (కండ్లపల్లి, పూడూరు. ఆగస్టు 06) 6)చాకల్లి సత్తయ్య(ఎత్‌బార్‌పల్లి, మొయినాబాద్, ఆగస్టు 09) 7)మంగళి బాల్‌రాజ్ (బంట్వారం, బంట్వారం, సెప్టెంబర్ 12) 8) ముత్యాల అంజయ్య(భువనగిరిపల్లి, షాబాద్, సెప్టెంబర్ 21) 9) నాదిర్గా కృష్ణారెడ్డి (రావులపల్లి, మర్పల్లి, అక్టోబర్ 09) 10) పూలపల్లి వెంకటయ్య(పీరంపల్లి, వికారాబాద్, అక్టోబర్ 09) 11)పెద్దగొల్ల పాండయ్య ( మల్లారెడ్డిగూడెం, మోమిన్‌పేట, అక్టోబర్ 13) 12) మల్కాపురం యాదయ్య(తక్కళ్లపల్లి, యాచారం , ఆగస్టు 14) 13) ఆకుల యాదయ్యగౌడ్ (కమ్మెట, చేవెళ్ల, ఆగస్టు 17) 14) కొంపల్లి రామయ్య (పీలారం, వికారాబాద్, అక్టోబర్ 16) 15) బేగరి అంతయ్య (రేగడి ఘణాపూర్, చేవెళ్ల, అక్టోబర్ 20) 16)కుమ్మరి సత్తయ్య (కుమ్మరిగూడ, షాబాద్, అక్టోబర్ 22) 17) మల్లగారి రామస్వామి (సయ్యద్‌పల్లి , పరిగి, ఆక్టోబర్ 23) 18) బండమీది మణేప్ప(బండపల్లి , పెద్దేముల్, అక్టోబర్ 30) 19)కొత్తపల్లి రాజు (కొజ్జగూడ, శంకర్‌పల్లి, నవంబర్ 01) 20)రాములునాయక్(బొంపల్లితండా, దోమ, నవంబర్ 04), 21) బోయిని యాదయ్య(సల్బత్తాపూర్, బంట్వారం, నవంబర్ 11) 22) కుమ్మరి నర్సయ్య(ఎక్‌మామిడి, నవాబుపేట్, నవంబర్ 11) 23) రాములు (కేసారం, చేవెళ్ల, నవంబర్ 17) 24) పాత్లోత్ శ్రీను (బండలేమూర్, మంచాల, నవంబర్ 18) 25) కావలి కిష్టయ్య (ఎనికెపల్లి , చేవెళ్ల, నవంబర్ 19) 26) తెలుగు రాందాస్ (అంతారం. చేవెళ్ల, నవంబర్ 23) 27) కావలి అనంతయ్య (పెండ్లిమడుగు, వికారాబాద్, నవంబర్ 27) 28) పోతురాజు (పాండు ఏన్కతల, మోమిన్‌పేట, నవంబర్ 28) 29) విఠల్ (పట్లూర్, మర్పల్లి, డిసెంబర్ 04) 30) గుర్రాల యాదిరెడ్డి(రుద్రారం, షాబాద్, డిసెంబర్ 13) 31) లక్ష్మయ్య(కడ్చర్ల, నవాబుపేట, డిసెంబర్ 14) 32) శ్రీనివాస్‌రెడ్డి(ఎలకొండ, నవాబుపేట, డిసెంబర్ 21) 33) బద్దుల వెంకటయ్య(తుమ్మలూరు, మహేశ్వరం, డిసెంబర్ 22) 34) సంగం యాదయ్య(మేడిపల్లి , యాచారం, డిసెంబర్ 28)35)ముత్యం సత్తయ్య(తంగడపల్లి , చేవెళ్ల, డిసెంబర్ 29) 36)కుమ్మరి పోచయ్య(కొత్లాపూర్, మర్పల్లి, జనవరి 01) 37)మంగలి రంగయ్య(కాళ్ళాపూర్, పరిగి, జనవరి 27) 38)దొబ్బలి బాబు(మర్పల్లి మర్పల్లి, ఫిబ్రవరి 02) 39)పామెన పరమేష్(ఆలూరు, చేవెళ్ల, ఫిబ్రవరి 24) 40)భీమనమోని రాములు(తాడిపర్తి, యాచారం, ఫిబ్రవరి 28) 41)పెంటయ్య( కేసారంచేవెళ్ల, మార్చి 03) 42)సందుల శ్రీనివాస్‌రెడ్డి(నవాంద్గి, బషీరాబాద్, మార్చి06)
వరంగల్ (52)
1)బుట్టి శివయ్య (సోడసపల్లి (మం), ధర్మసాగర్ (గ్రా), జూన్ 04) 2)మేకల కొమురయ్య(ధర్మసాగర్ , ధర్మసాగర్, జూన్, 11) 3)బొజ్జం కొమురయ్య(వెల్లంపల్లి , పరకాల , జూన్ 13) 4)మడికంటి సంతోష్ (పోచంపల్లి, రేగొండ, జూన్ 13) 5)ముంద్రబోయిన జయ(బొడ్డుచింతలపల్లి, గీసుకొండ, జూన్ 13) 6)గాడుదుల వెంకన్న(ఆనేపురం, మరిపెడ, జూన్ 20)7)పొన్న శ్రీనివాస్ (కడవెరుగు, చేర్యాల , జూన్ 20) 8)చిన్నాల దేవేందర్(బండౌతాపురం, వర్దన్నపేట, జూన్ 22) 9)వంగరి కిష్టయ్య(కోమళ్ళ, రఘునాధపల్లి, జూన్ 23) 10)పెదబోయిన సంపత్(సీతారాంపురం, పరకాల, జూలై 03) 11)నమిండ్ల సదానందం(మచ్చాపురం, గీసుకొండ, జూలై 12) 12)కొనపాక శ్రీహరి (వరికోల్, పరకాల, జూలై 13) 13)వీరగోని సమత(దూత్‌పల్లి, చిట్యాల, జూలై 21) 14)ముంత మల్లిఖార్జున్ (శాయంపేటహవేలి, గీసుకొండ, జూలై 22) 15)మాలోతు సురేందర్ (గిద్దబండతండా, రఘునాధపల్లి, జూలై 29) 16)చల్లకొరివి యాదయ్య(కొన్నే, బచ్చన్నపేట, ఆగస్టు 02) 17)కందూరి మల్లయ్య(చేర్యాల, చేర్యాల, ఆగస్టు 12) 18)పిన్నింటి దేవేందర్ (పంధిని, వర్దన్నపేట, ఆగస్టు 12) 19)నల్ల సమ్మయ్య(సబ్బక్కపల్లి, చిట్యాల, ఆగస్టు 20) 20)రాగుల కరుణాకర్(కడవెరుగు, చేర్యాల, ఆగస్టు 21) 21)ఉదుగుల పోషయ్య (మద్దెల గూడెం, ధర్మసాగర్, ఆగస్టు 22) 22)కొంపెల్లి శైలజ(ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపురం, సెప్టెంబర్ 05) 23)మాస బీరయ్య (ముస్త్యాల, చేర్యాల, సెప్టెంబర్ 12) 24)పండుగ చంద్రయ్య(చుంచునకోట, చేర్యాల, సెప్టెంబర్ 15) 25)మందా సిద్ధారెడ్డి(చుంచునకోట, చేర్యాల, సెప్టెంబర్ 18) 26)బైరు బుచ్చయ్య(వంగపహాడ్, హసన్‌పర్తి, సెప్టెంబర్ 20) 27)దాడిన దశమంతరెడ్డి(వేచరేణి, చేర్యాల, సెప్టెంబర్ 20) 28)గెడిసె ఎల్లయ్య (బంజర, మద్దూరు, అక్టోబర్ 03) 29)పెసరు యాదగిరి (పెద్ద పెండ్యాల, ధర్మసాగర్, అక్టోబర్ 20) 30)కొక్కండ రాజయ్య (గుర్జకుంట, చేర్యాల, అక్టోబర్ 27) 31)బారి కొమురయ్య (బూర్గంపాడు, డోర్నకల్, అక్టోబర్ 28) 32)ఎస్‌కే ఖాజామియా(మునిగలవీడు, నెల్లికుదురు, నవంబర్ 01) 33)పేరుబొట్ల సుధాకర్ (దామరంచపల్లి, రేగొండ, నవంబర్ 02) 34)తుప్పటి లక్ష్మి(కట్కూరు, బచ్చన్నపేట, నవంబర్ 03) 35)గాగిళ్ళాపురం కనకయ్య(ఇటుకాలపల్లి, బచ్చన్నపేట, నవంబర్ 03) 36)సామల స్వామి(బచ్చన్నపేట, బచ్చన్నపేట, నవంబర్ 04) 37)రాసూరి సారయ్య(బందపల్లి, రాయపర్తి, నవంబర్ 05) 38)చెడుపాక వెంకన్న(నైనాల ,నెల్లికుదురు, నవంబర్ 16) 39)బానోతు బీమా(మడిపెల్లి, నెక్కొండ, నవంబర్ 22) 40)వీరాటి జనార్దన్‌రెడ్డి(గీసుకొండ, గీసుకొండ, డిసెంబర్ 10) 41)గుండెబోయిన అరవింద్ (నాగారం, పరకాల, జనవరి 05) 42)మామిడి నర్సయ్య (గొర్లవీడు, భూపాలపల్లి, జనవరి 29) 43)నీల నర్సయ్య (కొడువటూరు, బచ్చన్నపేట, ఫిబ్రవరి 06) 44)మండల రాజిరెడ్డి(కావులపల్లి, రేగొండ, ఫిబ్రవరి 18) 45)ఆవుల నర్సయ్య(కోనారావుపేట, చెన్నారావుపేట, ఫిబ్రవరి 25) 46)బండి పోశయ్య (బావుసింగ్‌పల్లి,చిట్యాల, మార్చి 02) 47)బొమ్మెర కరుణాకర్ (గొల్లపల్లి, నెక్కొండ, మార్చి 03) 48)సుంకరి రాజయ్య(అక్కరాజుపల్లి, నర్మెట, మార్చి 06) 49)పోలెబోయిన పోశయ్య (తరిగొప్పుల, నర్మెట, మార్చి 12) 50)సింరవేణి పోశయ్య (నేరుడుపల్లి, భూపాలపల్లి, మార్చి 12) 51)పెద్ద మహేశ్(నర్సాపూర్, నర్మెట, మార్చి 13) 52) సిరంగి సరిత (చిట్యాల, సుబ్బక్కపల్లి, మార్చి 17)
మహబూబ్‌నగర్ (78)
1)జి.చిన్నతిరుపతయ్య (చిన్న తిరుమలాపూర్(మం), తాడూరు(గ్రా), జూన్ 27) 2)గోద రామస్వామి(జీలుగుపల్లి, లింగాల, జూలై 01) 3)భైరమోని రమేష్(హేమాజీపూర్, బాలానగర్, జూలై 02) 4)ఈర్లపల్లి శేఖర్(ఈర్లపల్లి, జడ్చర్ల, జూలై 08) 5)శవ్వ.అర్జునయ్య(ఉప్పునుంతల, ఉప్పునుంతల, జూలై 09) 6)లింగస్వామి(పాతధారారం, లింగాల, జూలె ౖ11) 7)అరెకంటి అలివేలు (మన్ననూరు, ఆమ్రాబాద్, జులై 11) 8)వేముల కిష్టయ్య(శ్రీపురం, నాగర్‌కర్నూలు, జూలై 19) 9)పాలెం సంజీవ(కౌకుంట్ల, దేవరకద్ర, జూలై 21) 10)బోయనరసింహ (శాయన్‌పల్లి, బిజినేపల్లి, జూలై 23) 11)వై.అంజయ్యగౌడ్(అర్కపల్లి, మాడుగుల, జూలై 25) 12)ఆర్ వెంకట్రాములు (నిజలాపూర్, అడ్డాకుల, జూలై 28) 13)బోయకృష్ణయ్య(గౌరారం, తెలకపల్లి, అగస్టు 01) 14)బొర్రజంగయ్య(అన్మాస్‌పల్లి, ఆమనగల్లు, అగస్టు 05) 15)పెంటయ్య(కల్వరాల,పానగల్, ఆగస్టు 06) 16)నేనావత్‌శంకర్(గట్టుమీదితండా, ఉప్పునుంతల, ఆగస్టు 13) 17)ఎం.పర్వతాలు (ఉప్పునుంతల, ఉప్పునుంతల, అగస్టు 14) 18)పరశురాములు(కొండారెడ్డిపల్లి, బల్మూరు, సెప్టెంబర్ 04) 19)కురుమూర్తి(కాశీంనగర్, వనపర్తి , సెప్టెంబర్ 14) 20)లింగమయ్యగౌడ్(తుర్కలపల్లి, వంగూరు, సెప్టెంబర్ 22) 21)సత్తయ్య(లింగసాయిపల్లి, బిజినేపల్లి, సెప్టెంబర్ 23) 22)కొట్టం బచ్చయ్య(పెనిమిళ్ల, ఉప్పునుంతల, సెప్టెంబర్ 26) 23)నరసింహ (పెద్దమందడి, పెద్దమందడి, సెప్టెంబర్ 26) 24)గొల్లవెంకటయ్య (కోడేరు, కోడేరు, సెప్టెంబర్ 28) 25)మారం నారయ్య(పెనిమిళ్ల, ఉప్పునుంతల, సెప్టెంబర్ 29) 26)పాత్లావత్‌సురేష్(మేడిగడ్డతండా,ఎం.ఘనపుర్, బాలానగర్, సెప్టెంబర్ 29) 27)రామావత్‌ఫకీరా(మన్ననూరు, ఆమ్రాబాద్, అక్టోబర్ 04) 28)దాసరి కృష్ణయ్య(అనంతవరం, బల్మూరు, అక్టోబర్ 04) 29)తానెంనరసింహులు(అంబటాపూర్, జడ్చర్ల, అక్టోబర్ 05) 30)గోవిందు(మద్దలబండ, మల్దకల్, అక్టోబర్ 15) 31)పాపయ్య(అవంచ, తిమ్మాజీపేట, అక్టోబర్ 17) 32)చిటికాల నరసింహులు(శ్రీరంగాపూర్, కొందుర్గు, అక్టోబర్ 19) 33)గొల్ల నర సింహులు (పుల్లప్పగూడ, కొందుర్గు, అక్టోబర్ 19) 34)బాలస్వామి(వనపట్ల, నాగర్‌కర్నూలు, అక్టోబర్ 22) 35)జి.శ్రీనివాస్‌రెడ్డి(రెడ్డిగూడెం, చిల్వేరుమిడ్జిల్, అక్టోబర్ 22) 36)గల్ల మద్దిలేటి (రాజోలి, వడ్డేపల్లి, అక్టోబర్ 23) 37)ఆంజనేయులు(పుల్లగిరి, తిమ్మాజీపేట, అక్టోబర్ 24) 38)కవటచంద్రయ్య(కొట్ర, వెల్దండ, అక్టోబర్ 26) 39)మాన్యానాయక్(హేమ్లానాయక్‌తండా, తిమ్మాజీపేట, అక్టోబర్ 27) 40)సాలేటిఅంజయ్య(కాసులాబాద్, కొందుర్గు, అక్టోబర్ 28) 41)కుర్వమాసన్న(జూరాల, ఆత్మకూరు, నవంబర్7) 42)నరసింహులు(చించోడు, ఫరూఖ్‌నగర్, నవంబర్ 9) 43)మన్నె మాసిరెడ్డి(వెన్నచర్ల, పెద్దకొత్తపల్లి , నవంబర్ 12) 44)చిక్కొండ్ర నారాయణ(కొత్తపల్లి, మిడ్జిల్, నవంబర్ 13) 45)కడారి దుర్గయ్య (మన్ననూరు, ఆమ్రాబాద్, నవంబర్ 14) 46)శ్రీనివాసులు (ఆమడబాకుల, కొత్తకోట, నవంబర్ 14) 47)పుట్టమాసన్న (పెద్దగూడెం, వనపర్తి, నవంబర్ 18) 48)లక్ష్మారెడ్డి(ముచ్చర్లపల్లి, మిడ్జిల్, నవంబర్ 18) 49)మురళయ్య(ముచ్చర్లపల్లి, మిడ్జిల్, నవంబర్ 19) 50)వెంకటయ్య(పెద్దపల్లి,తెలకపల్లి, నవంబర్ 19) 51)కొత్తగొల్లమైబు(వెల్కిచర్ల, భూత్పూర్, నవంబర్ 20) 52)నరేందర్‌రెడ్డి (పాతమొల్గర, భూత్పూర్, నవంబర్ 21) 53)మర్కపుల్లయ్య(తుర్కపల్లి, ఆమ్రాబాద్, నవంబర్ 26) 54)రుస్తుం నరసింహులు (చించోడు, ఫరూఖ్‌నగర్, నవంబర్ 27) 55)బోయభీమయ్య (మానవపాడు, మానవపాడు, డిసెంబర్3) 56)గోప్యనాయక్(పెద్దూరుతండా, పడ్కల్ తలకొండపల్లి, డిసెంబర్ 7) 57)మన్యచెన్నమ్మ (లక్ష్మీపల్లి, దేవరకద్ర, డిసెంబర్8) 58)సంకెఈశ్వరయ్య(కుడికిళ్ల, కొల్లాపూర్, డిసెంబర్ 15) 59)చెన్నయ్య(శ్రీరంగాపూర్, కొందుర్గు, డిసెంబర్ 16) 60)గుండూరితిరుపతయ్య (తెలకపల్లి, తెలకపల్లి, డిసెంబర్ 25) 61)ఈశ్వరయ్య(జూలకల్లు, వడ్డేపల్లి, డిసెంబర్ 29) 62)చంద్రశేకర్‌రెడ్డి(చిన్నమందడి, వనపర్తి, జనవరి 3) 63)వేమారెడ్డి(తాటికుంట, మల్దకల్, జనవరి 23) 64)సంతరాములు(గోపన్‌పల్లి, దేవరకద్ర, జనవరి 24) 65)బండలనరసింహ(కొలుకులపల్లి, మాడ్గుల, ఫిబ్రవరి 14) 66)ఏదుట్లశాంతయ్య(పొలికేపాడు, గోపాల్‌పేట, ఫిబ్రవరి 20) 67)గోరంట్లశేఖర్(పులిజాల, నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 21) 68)సాయిలు(తిమ్మాజీపేట, తిమ్మాజీపేట, ఫిబ్రవరి 22) 69)కుమ్మరిసుభాష్(మల్లాపూర్, కొత్తూరు, ఫిబ్రవరి 23) 70)వి.పెద్దహన్మంతు (మున్ననూరు, గోపాలపేట, ఫిబ్రవరి 24) 71)బోయ శాయన్న (తోమాలపల్లి, పెబ్బేరు, ఫిబ్రవరి 28) 72)చెట్టుకుంటఅంజనేయులు (ఎదిరపల్లి, తిమ్మాజీపేట, ఫిబ్రవరి 28) 73)గొడుగువెంకటయ్య (కోనాపూర్, ఆమనగల్లు, ఫిబ్రవరి 28) 74)గొబ్బూరు బస్వరాజు(మాగనూరు, మాగనూరు, మార్చి 02) 75)రాముడు (వడ్డేపల్లి, వడ్డేపల్లి, మార్చి 02) 76)దొడ్లనర్సయ్య(అంకిరోనిపల్లి, అచ్చంపేట, మార్చి 04) 77)తిరుపతయ్యగౌడ్(ఎదిర, కొందుర్గు, మార్చి 05) 78)ఇస్వయ్య (పోలేపల్లి, బొంరాస్‌పేట, మార్చి 08)
నిజామాబాద్ (43)
1)సత్యనారాయణ (తిమ్మాపూర్ (మం), బీర్కూర్ (గ్రా) , 09జూన్) 2)బీర్ల లస్మయ్య(ఇసాయిపేట, మాచారెడ్డి, 17జూన్) 3)గుగ్గులోత్ సోదరనాయక్ (సోమారంపేట తండా, మాచారెడ్డి, 18జూన్) 4)కుంట ప్రవీణ్‌రెడ్డి (మర్కల్, సదాశివనగర్, 18జూన్) 5)మన్నె నారాయణ (బస్వాపూర్, భిక్కనూరు, 18జూన్) 6)రాజిరెడ్డి (కుప్రియాల్, సదాశివనగర్, 18జూన్) 7)నడ్పి గంగాధర్ (నీలా, రెంజల్, 18జూన్) 8)సైదబోయిన గంగాధర్ (నీలా, రెంజల్, 03ఆగస్టు) 9)రమావత్ బాబ్య (గుజ్జుల్ తండా, గాంధారి , 18ఆగస్టు) 10)అంద్యాల లింగం (రాజంపేట్, బిక్కనూరు, 11 సెప్టెంబర్) 11)శంకర్ (కొల్లూరు, కోటగిరి, 4అక్టోబర్) 12)చాకలి నాగు (బాన్సువాడ, బాన్సువాడ, 06అక్టోబర్) 13)మర్కంజల అశోక్ (బాన్సువాడ, బాన్సువాడ, 09అక్టోబర్) 14)కైరుద్దీన్(జాకోరా, వర్ని, 09అక్టోబర్) 15)కుంట రాజయ్య (శాబ్ధిపూర్. కామారెడ్డి, 12 అక్టోబర్) 16)మెట్ల గంగాధర్ (మదన్‌పల్లి, మాక్లూర్, 12 అక్టోబర్) 17)నాగెర్తి సాయిరెడ్డి (ఎర్రపహాడ్, తాడ్వాయి, 12 అక్టోబర్) 18)త్రిశూల్‌రెడ్డి (అన్నారం, పిట్లం, 16అక్టోబర్) 19)చిన్నరాములు(ఫతేనగర్, నవీపేట, 16 అక్టోబర్) 20)చాకలి నర్సింలు(పాల్వంచ, మాచారెడ్డి, 20అక్టోబర్) 21)మల్కన్నగారి పర్వయ్య (సజ్జన్‌పల్లి, లింగంపేట, 20 అక్టోబర్) 22)చాకలి బాలితండా(మల్లారం, వర్ని, 29అక్టోబర్) 23)రామావత్ రవి (కారెపల్లి, భీమ్‌గల్, 31అక్టోబర్) 24)జింక భీమన్న (నీలా, రెంజల్, 31అక్టోబర్) 25)దుబాసి సాయిలు (అచ్చంపేట్, నిజాంసాగర్, 02నవంబర్) 26)శంకర్ (ధోతి, మద్నూర్, 04 నవంబర్) 27)పోశెట్టి (తగ్గెల్లి, బోధన్, 04 నవంబర్), 28)గోపరి భూమయ్య (మోపాల్, నిజామాబాద్, 04 నవంబర్) 29)జోగు గంగారాం (కిష్టాపూర్, బీర్కూర్, 07నవంబర్) 30)భూమయ్య (లక్ష్మాపూర్, వర్ని. 08 నవంబర్) 31)ఆకుల పెద్ద గంగాధర్ (బాచన్‌పల్లి, భీమ్‌గల్, 12నవంబర్) 32)బోండ్ల కిష్టయ్య (లక్ష్మాపూర్, ఎల్లారెడ్డి, 12నవంబర్) 33)చిట్టి సాయిలు (తాడ్కోల్, బాన్సువాడ, 18నవంబర్) 34)డి.శ్రీనివాస్ (దర్యాపూర్, నవీపేట్, 29నవంబర్) 35)ఎల్లప్ప (మేనూరు, మద్నూర్, 29నవంబర్) 36)నడ్పి బాలిరెడ్డి (మర్కల్, సదాశివనగర్, 29నవంబర్) 37)రాజమణి (పేట్‌సంగెం, గాంధారి, 01డిసెంబర్) 38)కర్నాల గంగనర్సయ్య (బడా భీమ్‌గల్, భీమ్‌గల్, 01డిసెంబర్) 39)గంగారాం(గూపన్‌పల్లి, నిజామాబాద్, 01డిసెంబర్) 40)ప్రవీణ్‌రెడ్డి (తాడ్‌బిలోలి, రెంజల్, 06డిసెంబర్) 41గగ్గులోత్ చందర్ (డీబీ తండా, ధర్పల్లి, 06డిసెంబర్) 42)మమ్మాయి లక్ష్మణ్ (గాంధారి, గాంధారి, 08డిసెంబర్) 43)పోసాని భూపాల్ (సదాశివనగర్, సదాశివనగర్ , 08 డిసెంబర్)
ఖమ్మం (20)
1)జొబ్బ శ్రీనివాసరావు (రాయమాదారం (మం), ఏన్కూరు, (గ్రా), ఆగస్టు 20) 2)పాయం పాపయ్య (వేపలగడ్డ, గుండాల, ఆగస్టు 26) 3)చింతాల లక్ష్మయ్య (చిన్నమండవ, చింతకాని, అక్టోబర్ 6) 4)తేజావత్ వీరు (టేకులపల్లి, టేకులపల్లి, అక్టోబర్ 18) 5)గంగావత్ తారు (కొమరారం, ఇల్లందు, అక్టోబర్ 20) 6)కుప్పా నర్సింహులు (వాజేడు, వాజేడు, అక్టోబర్ 21) 7)భూక్యా రామ్యా (అజ్మీరాతండా, తిరుమలాయపాలెం, అక్టోబర్ 22) 8)పాయం సూరయ్య (పెద్దబండిరేవు, దుమ్ముగూడెం, అక్టోబర్ 24) 9)మొగిలి నాగేశ్వరరావు (రొంపిమళ్ల, మధిర, అక్టోబర్ 25) 10)ఎనికె తిరుపతయ్య (అశ్వాపురం, చంద్రుగొండ, అక్టోబర్ 27) 11)పాయం రాంబాబు (నడిగూడెం, గుండాల, అక్టోబర్ 30) 12)తాటి శ్రీను (ఉలవనూరు, పాల్వంచ, అక్టోబర్ 30) 13)తేళ్ల లక్ష్మయ్య (రాయపట్నం, మధిర, నవంబర్ 10) 14)నునావత్ చందు (బద్యాతండా, రఘునాధపాలెం, నవంబర్ 20) 15)స్వర్ణ వెంకటేశ్వరరావు (కొణిజర్ల, కొణిజర్ల, డిసెంబర్ 11) 16)బాణోతు సక్రాం (పడమటితండా, తిరుమలాయపాలెం, డిసెంబర్ 15) 17)టీ అజయ్‌కుమార్ (రాజీవ్‌నగర్ తండా, ఇల్లందు, డిసెంబర్ 15) 18)కాటి రాములు (బందేరికలపాడు, పాల్వంచ, డిసెంబర్ 24) 19)అన్నంగి సైదులు (సత్యనారాయణపురం, బయ్యారం, డిసెంబర్ 31) 20) పాలెపు పుల్లారావు (బాలప్పేట, తల్లాడ, మార్చి 1)
ఆదిలాబాద్ (71)
1) అడె కుంచారాం (మసాల-బి(మం), బేల (గ్రా), మే 08) 2)జాదవ్ ఇందాల్ (సూర్యంతండా, కుంటాల, జూన్ 04) 3)కె. గులాబ్‌సింగ్ (గుర్రాల తండా, బోథ్, జూన్ 06) 4)ఆనంద్‌బాబు(పెండ్‌పెల్లి, బైంసా, జూన్ 07) 5)జాదవ్ ప్రకాష్ (నిగిని, బోథ్, జూన్ 09) 6)భీమన్న (కౌట్ల, సారంగాపూర్, జూన్ 13) 7)బర్ల శంకర్ (కౌట్ల (బి), సారంగాపూర్, జూన్ 13) 8)గంగాధర్ (రాచాపూర్, లక్ష్మణచాంద, జూన్ 14) 9)పీరన్న (కారేగాం, ముథోల్, జూన్ 26) 10)బి.మహేష్ (సాత్నాల, జైనథ్, జూన్ 27) 11)ఎం. విఠల్(తోయగూడ, బేల, జూలై 09) 12) పుండలిక్ (విఠోలి, ముథోల్, జూలై 11) 13)కొడప కౌడు (మేడిగూడ, జైనథ్, జూలై 12) 14)అప్పాల జైపాల్‌రెడ్డి(బోథ్, బోథ్,జూలై 13) 15)చిన్నయ్య (లోకేశ్వరం, లోకేశ్వరం, జూలై 15) 16)సోనారి వినోద్ (చింతల్‌బోరి, బైంసా, జూలై 15) 17)సంతోష్ (సిరికొండ , ఇచ్చోడ, జూలై 17) 18)రాగంశెట్టి శ్రీనివాస్ (మునిగళ్ల, మంచిర్యాల, జూలై 25) 19)జోడె రాందాస్ (బేల, బేల, జూలై 27) 20)పవర్‌బీంజీ (సాకెర, బోథ్, జూలై 28) 21)జి. పంచపూల (కిష్టునాయక్ తండా, ఖానాపూర్, ఆగస్టు 03) 22)రాథోడ్ గణపతి (నాగల్‌కొండ, నార్నూర్, ఆగస్టు 07) 23)తోటి కిషన్ (చెన్నూర్, చెన్నూర్, ఆగస్టు 07) 24)అక్కల తిరుపతి (గూడెం, దండెపల్లి, ఆగస్టు 08) 25)ఆడె సంజీవ్ (బామ్ని(బి), కుంటాల, ఆగస్టు 12) 26)కవిందర్ (కొత్తపేట్, జన్నారం, ఆగస్టు 13) 27)ఎస్‌కె సాయినాథ్ (వాలేగావ్, బైంసా, ఆగస్టు 13) 28)నిమ్మలప్రపుల్‌రెడ్డి (ఖోడద్, తలమడుగు, ఆగస్టు 26) 29)వాంకిడి కళావతి (పొచ్చెర, బోథ్, ఆగస్టు 28) 30)కారుకురి శంకరయ్య (కొత్తకొమ్ముగూడెం, లక్షెట్టిపేట్, సెప్టెంబర్ 02) 31)జెటాలరాములు (కప్పర్ల, తాంసి, సెప్టెంబర్ 03) 32)జి. అవదూద్ (అజ్‌గుల్, బైంసా, సెప్టెంబర్ 04) 33)కథం విఠల్‌రావుపటేల్ (అంకోలి, కుబీర్, సెప్టెంబర్ 04) 34)ద్యాగల నారాయణ (కరత్వాడ, బోథ్, సెప్టెంబర్ 06) 35)బల్లి సిరాజి (అందాపూర్, కుంటాల, సెప్టెంబర్ 07) 36)సి.వెంకట్‌రెడ్డి (సుంకిడి, తలమడుగు, సెప్టెంబర్ 10) 37)టి. రాజేశ్ (నమ్నూర్, మంచిర్యాల, సెప్టెంబర్ 15) 38)బోవర్ విఠల్ (కొబ్బాయి, బేల, సెప్టెంబర్ 16) 39)జాదవ్‌ప్రేమ్ (నడ్డంగూడ మామిడిపెల్లి, సిర్పూర్(యు), సెప్టెంబర్ 16) 40)రత్నపూరి శ్రీనివాస్ (తలమడుగు, తలమడుగు, సెప్టెంబర్ 20) 41)గడ్డం సాయిరెడ్డి(కామూల్, బైంసా, సెప్టెంబర్ 27) 42)రాథోడ్ సురేష్ (లింగాపూర్, సిర్పూర్ (యు), అక్టోబర్ 01) 43)రంగి అనుష (లకంపూర్, నేరడిగొండ, అక్టోబర్ 03) 44)కనక జగ్గెరావ్ (వైజాపూర్, గుడిహత్నూర్, అక్టోబర్ 04) 45)గోకు పోషన్న (పేరకపల్లి, కడెం, అక్టోబర్ 10) 46)తొడసం దస్రు (నందిగామ, తలమడుగు,అక్టోబర్ 12) 47)జాదవ్ రమేష్ (మర్లపల్లి, బోథ్, అక్టోబర్ 14) 48)చౌహన్ ప్రకాష్ (కుచ్లాపూర్, తలమడుగు, అక్టోబర్ 15) 49)కల్యాణ్‌జయశ్రీ (కోతూల్‌గావ్, బైంసా, అక్టోబర్ 18) 50)చిన్న గంగన్న (కోతూల్‌గావ్, బైంసా, అక్టోబర్ 19) 51)పెంటనారాయణ (కుమారి, నేరడిగొండ, అక్టోబర్ 21) 52)బొజ్జ భీమ లింగు (మందపల్లి, ఖానాపూర్ , అక్టోబర్ 24) 53)అంబకంటి లక్ష్మణ్ (తిమ్మాపూర్, కుంటాల, అక్టోబర్ 26) 54)నారాయణ (అంబకంటి, కుంటాల, అక్టోబర్ 26) 55)చించు లింగయ్య (ఇటిక్యాల, లక్షెట్టిపేట్, నవంబర్ 02) 56)అవూనురి బాలయ్య ( తిమ్మాపూర్, లక్షెట్టిపేట్, నవంబర్ 02) 57)ఎం సంతోష్‌కుమార్ (లక్షెట్టిపేట్, లక్షెట్టిపేట్, నవంబర్ 02) 58)జాజిమొగ్గ రాందాస్ (కప్పర్ల, తాంసి, నవంబర్ 09) 59) మోరే ఉమేష్ (పటాన్, బేల, నవంబర్ 17) 60)రాథోడ్ నారాయణ(బొందిడి, నేరడిగొండ, నవంబర్ 24) 61)కాలే ఆత్మరాం (ప్రబ్దనగర్, ఇంద్రవెల్లి, డిసెంబర్ 08) 62)ఆడ రోహిత్‌దాస్ (జైయిత్రంతాండ, ఉట్నూర్, డిసెంబర్ 11) 63)రాథోడ్ రాయిసింగ్ (మహగావ్ , సిర్పూర్ (యు), డిసెంబర్ 13) 64)బోన్ల లింగన్న (లక్ష్మణచాంద, లక్ష్మణచాంద, డిసెంబర్ 22) 65)జాడి రాజలింగుచచ (మురిమడుగు, జన్నారం, డిసెంబర్ 25) 66)సుధాకర్ (లింగాపూర్, సిర్పూర్ (యు), డిసెంబర్ 30) 67)ఆర్. గణపతి (ముథోల్ ముథోల్, జనవరి 11) 68) కె. నర్సిములు (డోప్టాల, బేల, ఫిబ్రవరి 05) 69)సుభాష్ (హస్నాపూర్, తాంసి, ఫిబ్రవరి 13) 70)అందె అశోక్ (పొన్నారి, తాంసి, మార్చి 03) 71) బూక్యరాంసింగ్ (రాంనగర్‌తాండ, ఖానాపూర్, మార్చి 04)
మెదక్ (116)
1)అశోక్‌రెడ్డి (ఎల్లరెడ్డిపేట(మం), దుబ్బాక (గ్రా), 2 జూన్) 2)టంకరి సిద్దిరాములు(కోనాపూర్, రామాయంపేట, 3 జూన్) 3)దోసపల్లి గోపాల్ (తాళ్లపల్లి, సంగారెడ్డి, 7 జూన్) 4)కర్రె బీరయ్య (తిమ్మక్కపల్లి, దౌల్తాబాద్, 7 జూన్) 5)బాపునపల్లి రాజయ్య (గట్లమల్యాల, నంగునూర్, 9 జూన్) 6)డి. సత్యనారాయణ(శాలిపేట, శంకరంపేట(ఆర్), 13 జూన్) 7)చీర్ల యాదగిరి (ముట్రాజ్‌పల్లి, గజ్వేల్ , 14 జూన్) 8)మంగలి ఏసు (నాగాపురం, మెదక్, 15 జూన్, 9)ముత్యాలు (రాయవరం, జగదేవ్‌పూర్ , 17జూన్) 10)అవుటి అంజయ్య (మాయికోడ్, మనూరు, 19 జూన్) 11)కాసుల భాస్కర్‌రెడ్డి (తిమ్మక్కపల్లి, దౌల్తాబాద్, 19 జూన్) 12)విఠల్‌గౌడ్ (సూరారం, చిన్నశంకరంపేట, 21 జూన్) 13)బొయినిమల్లేశం (తాలెల్మ, జోగిపేట, 23జూన్) 14)నరిగే పర్శరాలు (మగ్దుంపూర్, నంగునూర్,24 జూన్) 15)పింగిరి మల్లయ్య (కొడకండ్ల , గజ్వేల్, 24 జూన్) 16)దశరథ్ (చెర్లగూడెం, సంగారెడ్డి, 26 జూన్) 17)తుడుం పద్మారావు (కూచన్‌పల్లి, మెదక్, 27 జూన్) 18)కొడిపెల రవి (కొడకండ్ల, గజ్వేల్, 4 జూలై) 19)దొడ్డి పుష్ప (చెట్ల నర్సంపల్లి, దౌల్తాబాద్, 5 జూలై) 20)ఎం.మల్లేశం (మారెపల్లి, కొండాపూర్, 7 జూలై) 21)కుమ్మరి సురేష్ (కూచారం, తూప్రాన్, 9 జూలై) 22)చిట్యాల రామలింగారెడ్డి (మంగోల్, కొండపాక, 14 జూలై) 23)దరణి మల్లయ్య(సిర్సనగండ్ల, కొండపాక, 18 జూలై) 24)నడిపి స్వామి (రామాయంపేట, రామాయంపేట, 18 జూలై) 25)కర్వ బీరయ్య (నవాబుపేటవీధి, మెదక్, 22 జూలై) 26)చంద్రబోయిన చంద్రం (మోతె, మిర్దొడ్డి, 1 ఆగస్టు) 27)లంబాడి శంకర్(దంతెపల్లి తండా, రామాయంపేట, 5 ఆగస్టు) 28)గుర్రాల బాబు (చంబర్తి. జగదేవ్‌పూర్,. 8 ఆగస్టు) 29)మండి నాగయ్య (పోతులబోగుడ, అల్లాదుర్గం, 8 ఆగస్టు ) 30)లతావత్ లభ్యారాం (రాజిపేట తండా, మెదక్, 19 ఆగస్టు) 31)రచ్చబోయిన బాలాగౌడ్ (మైలారం, వర్గల్, 20 ఆగస్టు) 32)మన్నె సత్యనారాయణ(దమక్కపల్లి, తూప్రాన్, 25 ఆగస్టు) 33)కత్రాల బాల్‌రాజ్ (కాట్రియాల, రామాయంపేట, 30 ఆగస్టు) 34)మోతె ఆంజనేయులు (అవుసులేనిపల్లి, వర్గల్ , 3 సెప్టెంబర్) 35) పిచ్చకుంట్ల నర్సింలు ( గోర్రెకల్, అల్లాదుర్గం, 3 సెప్టెంబర్) 36)లంబాడి శంకర్ (పెద్దగొట్టిముక్ల, శివ్వంపేట, 4 సెప్టెంబర్) 37)మిట్టుకుమార్ (అగ్రారం, చిన్నశంకరంపేట, 8 సెప్టెంబర్) 3‘8)సంతోష్ రాథోడ్ (హుగ్గెల్లి, జహీరాబాద్, 9 సెప్టెంబర్) 39)బిచ్చన్నగారి నర్సమ్మ (లింగుపల్లి, మిర్దొడ్డి, 11 సెప్టెంబర్) 40)మతిరెడ్డి బాల్‌రెడ్డి (నర్సన్నపేట, జగదేవ్‌పూర్, 16 సెప్టెంబర్) 41)శివశంకర్ (బిజిలీపూర్ , అల్లాదుర్గం, 25 సెప్టెంబర్) 42)గుంటలచిన్న రాజమల్లయ్య (కమ్మర్‌పల్లి, దుబ్బాక, 29 సెప్టెంబర్) 43)వాసం పద్మ (కమ్రాలపల్లి, చిన్నకొడూరు, 30 సెప్టెంబర్ ) 44)పిల్లిచంద్రం (తిమ్మాయిపల్లి, నంగునూరు, 2 అక్టోబర్) 45)లావూరి అంజూనాయక్ (లింగాయిపల్లి తండా, దౌల్తాబాద్, 4 అక్టోబర్) 46)దేశెట్టి మల్లయ్య (వెంకటాపూర్, సిద్దిపేట, 4 అక్టోబర్) 47)అవుసుల దుర్గాచారి (యావాపూర్ , తూప్రాన్, 4 అక్టోబర్) 48)తీగుళ్ళ కనకయ్య (కొండాపూర్, జగదేవ్‌పూర్, 5 అక్టోబర్) 49)చాకలి అంజయ్య (మాచిరెడ్డిపల్లి , కోహీర్, 5 అక్టోబర్) 50)బెస్త లక్ష్మయ్య (కొత్తూర్.కె, కోహీర్, 6 అక్టోబర్) 51)బండల ధశరత్ (చౌదర్‌పల్లి, వర్గల్ , 6 అక్టోబర్) 52)దొద్దు విష్ణు (దాచారం, గజ్వేల్, 9 అక్టోబర్) 53)గుండప్ప (దెగుల్‌వాడి, కంగ్టి, 10 అక్టోబర్) 54)బుక్కల కొండయ్య(నర్సన్నపేట, జగదేవపూర్ , 16 అక్టోబర్) 55)ఈడ్ల నర్సింలు (కమ్మంపల్లి, మునిపల్లి, 16 అక్టోబర్) 56)సంగం అమృత (రామతీర్థం, పాపన్నపేట, 21 అక్టోబర్) 57)మన్నె నర్సింలు (యూసుపేట, పాపన్నపేట, 24 అక్టోబర్) 58)మారెడ్డి ఎల్లారెడ్డి(ఇర్కోడు, సిద్దిపేట, 25 అక్టోబర్) 59)బూర్గుపల్లి శంకరయ్య (పిడిచెడు, గజ్వేల్, 26 అక్టోబర్) 60)వల్లెపు నర్సమ్మ (దాచారం, గజ్వేల్, 26 అక్టోబర్) 61)బదావత్ మోతిలాల్ (కొమటిపల్లి తండా, రామాయంపేట, 31 అక్టోబర్) 62)బందార్ మల్లయ్య (బూర్గుపల్లి. సిద్దిపేట, 31 అక్టోబర్) 63)గడీల శ్రీశైలం (అంగడికి ష్టాపూర్ , జగదేవ్‌పూర్, 5 నవంబర్) 64)వినోద (గోనెపల్లి, చిన్నకోడూరు, 13 నవంబర్) 65)రామవ్వ (పాతూరు, మెదక్, 13 నవంబర్) 66)రాములు (తంగెడుపల్లి, సదాశివపేట, 13 నవంబర్) 67)కొమ్మాట మల్లయ్య(నస్కల్, రామాయంపేట, 16 నవంబర్) 68) పిట్ల బిక్షపతి (దీపాయపల్లి, దౌల్తాబాద్, 16 నవంబర్) 69)శ్రీశైలం (తాటిపల్లి, మునిపల్లి, 16 నవంబర్) 70)బేగరి శ్రీనివాస్ (గుంతమర్పల్లి, ఝరాసంగం, 16 నవంబర్) 71)గుమ్మడి శంకరయ్య (చిన్నగొట్టిముక్ల, శివ్వంపేట, 17 నవంబర్) 72)ఎన్కపల్లి నర్సయ్య (కొడకండ్ల , గజ్వేల్ 18 నవంబర్) 73)బట్టికాడి రాజాగౌడ్ (మల్కాపూర్, తూప్రాన్, 21 నవంబర్) 74)మాయదారి విజయేందర్ (ముబారక్‌పూర్- ఎ, సదాశివపేట, 23 నవంబర్) 75)మానూర్ మల్లారెడ్డి (హంగర్గా .కె, నారాయణ్‌ఖేడ్, 25 నవంబర్) 76)సంపత్‌రెడ్డి (ఘనపురం, నంగునూరు, 2 డిసెంబర్) 77)బుడ్డ యాదగిరి (రామచంద్రాపూర్, నర్సాపూర్, 3 డిసెంబర్) 78)వల్లపు కిష్టయ్య (దాచారం, గజ్వేల్, 4 డిసెంబర్) 79)తుడుం శ్యాంసన్ (గుడికందుల, తొగుట, 5 డిసెంబర్) 80)కనకయ్య(ధర్మాజిపేట, దుబ్బాక, ఽ6 డిసెంబర్) 81)చొక్కాయి యాదగిరి (గడిపెద్దాపూర్,అల్లాదుర్గం, 8 డిసెంబర్) 82)మేర్గు యాదగిరి (దుద్దెడ, కొండపాక, 8 డిసెంబర్) 83)కుమ్మరి జన్నయ్య ( పోతులబోగుడ, అల్లాదుర్గం, 9 డిసెంబర్) 84)మడావత్ చంద్రియా (వాడి, మెదక్, 15 డిసెంబర్) 85)బోయ రాములు (మనియార్‌పల్లి, కోహీర్, 15 డిసెంబర్) 86)బీరోళ్ళ జహంగీర్ (నదీనగర్, జగదేవ్‌పూర్, 16 డిసెంబర్) 87)బెల్లల పరుశురాములు (జాలిగామ, గజ్వేల్, 16 డిసెంబర్) 88)కుమ్మరి రాములు (అలిరాజిపేట, జగదేవ్‌పూర్, 18 డిసెంబర్) 89)చాకలి మానయ్య (మదిర, కోహీర్, 22 డిసెంబర్) 90)బానోత్ రవి (లింగాయిపల్లి తండా, దౌల్తాబాద్, 24 డిసెంబర్) 91)బండి మల్లయ్య (దాచారం, గజ్వేల్, 25 డిసెంబర్) 91)పీరి సుధాకర్ (ఆరేపల్లి, దౌల్తాబాద్. 25 డిసెంబర్) 92)కాసబోయిన స్వామి (రాంపూర్, చేగుంట, 26 డిసెంబర్) 93)ఎండి ఇస్మాయిల్ (సైదాపూర్, కొండాపూర్. 28 డిసెంబర్ ) 94)నల్ల బిక్షపతి (కరీంనగర్, చేగుంట, 30 డిసెంబర్) 95)మన్నె శ్రీను(జగిర్యాల, రేగోడ్ , 1 జనవరి) 96)యాదగిరి (పాతూర్, మెదక్, 1 జనవరి) 97)భక్షీరాం (తుర్కపల్లి తండా, నారాయణ్‌ఖేడ్, 3 జనవరి) 98)గడ్డం ఏసయ్య( బ్యాతోల్, మెదక్, 4 జనవరి) 99)చింత ఆంజనేయులు (మనోహరాబాద్, తూప్రాన్, 16 జనవరి) 100)అర్కెల మల్లయ్య (పోతాన్‌పల్లి, చేగుంట, 16 జనవరి) 101)చెవుల కొండల్ (లింగుపల్లి , మిర్దొడ్డి, 16 జనవరి) 102)కుమ్మరి శ్యామయ్య (మద్దికుంట, సదాశివపేట, 16 జనవరి) 103)కొలన్‌పాక సామి (బయ్యారం, గజ్వేల్, 21 జనవరి) 104)మానగండ్ల బాలనర్సయ్య (నర్సంపేట, దౌల్తాబాద్, 29 జనవరి) 105)గంగుల భాస్కర్ (బద్దారం, కొండపాక,29 జనవరి) 106)సంతోష్ (వరిగుంతం, కొల్చారం,1 ఫిబ్రవరి) 107)తెడ్డు లక్ష్మీనారాయణ (చెబర్తి, జగదేవ్‌పూర్, 15 ఫిబ్రవరి) 108)జూలకంటి సత్యనారాయణ (గుండ్లపల్లి, శివ్వంపేట, 21 ఫిబ్రవరి) 109)కీచుగారి వెంకటయ్య(రాంసాగర్, దౌల్తాబాద్, 25 ఫిబ్రవరి) 110)శివ్వోళ్ళ హరీష్ (తిమ్మక్‌పల్లి, దౌల్తాబాద్, 25 ఫిబ్రవరి) 111)సాయిలు (పోతన్‌పల్లి, నారాయణఖేడ్, 10 మార్చి) 112)గోదారి దాసయ్య (మిన్‌పూర్, పాపన్నపేట, 13 మార్చి) 113)బాకి చంద్రయ్య (మైలారం, వర్గల్, 16 మార్చి) 114)జాగిని పోచయ్య (దొంతి, శివ్వంపేట, 17 మార్చి) 115) బిక్కనూరి రమేశ్ (లింగాపూర్, తొగుట, 17 మార్చి) 116) కేశన రాజయ్య ( చిన్నశంకరం పేట, శాలిపేట, మార్చి 19)
కరీంనగర్ (94)
1)చీకోటి వెంకటేశం (పెద్దూర్ (మం), సిరిసిల్ల (గ్రా), జూన్ 01), 2)పెద్దోజు మొగిలి (జూపాక, హుజూరాబాద్, జూన్ 03) 3)నరుకుల్ల మల్లేశం (తిప్పయ్యపల్లె, కొడిమ్యాల, జూన్ 10) 4)బైరి పోచిరెడ్డి (గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, జూన్ 15) 5)సింగిరెడ్డి రాజిరెడ్డి (రామన్నపేట, బోయినపల్లి, జూన్ 15) 6)బీరం రాజయ్య (వడ్కాపూర్, జూలపల్లి, జూన్ 18) 7)చీరాల శ్రీనివాస్ (సుందరగిరి, చిగురుమామిడి, జూన్ 21)) 8)వంగపల్లి చంద్రయ్య (కొత్తపల్లి, గంభీరావుపేట,జూన్ 22) 9) దయ్యాల గంగారాం(అంబారిపేట, కథలాపూర్, జూన్ 28) 10)కెక్కర్ల జయపాల్ (ఖమ్మంపల్లి, ముత్తారం, జూలై 02) 11)కొమ్మిడి లక్ష్మీ (దామెర, ఎల్కతుర్తి, జూలై 10) 12)న్యాలకంటి రాంరెడ్డి(దుమాల, ఎల్లారెడ్డిపేట, జూలై 10) 13)దాసరి రవీందర్ (మర్రిపల్లిగూడెం, కమలాపూర్, జూలై 11) 14)గంట సమ్మయ్య (గంటగూడెం, కాటారం, జూలై 17) 15)పులిగంటి సమ్మయ్య (చిన్నతూండ్ల, మల్హర్, జూలై 18) 16)జంగ కనుకయ్య(మైదంబండ, ముత్తారం, జూలై 23) 17)పల్లపు రాజయ్య (వెంకటాయపల్లి, గంగాధర, ఆగస్టు 03) 18)కాతుమండి రమేష్ (పాపక్కపల్లి, జమ్మికుంట, ఆగస్టు 08) 19)ఇందారపు వేణు (పెద్దకల్వల, పెద్దపల్లి, ఆగస్టు 11) 20)గొల్లపల్లి జోగిరెడ్డి (అనంతారం, ఇల్లంతకుంట, ఆగస్టు 15) 21)చిలుముల సమ్మయ్య(ఆదివారంపేట, కాటారం, ఆగస్టు 21) 22)ఎక్ రాజు (కమలాపూర్, కమలాపూర్, ఆగస్టు 22) 23)మారుపాటి సాంబారెడ్డి (భీమదేవరపల్లి, భీమదేవరపల్లి, ఆగస్టు 25) 24) నెల్లి పోచయ్య (కొరటపల్ల్లి, రామడుగు, ఆగస్టు 27) 25)చింతపంటి కళావతి (తిర్మలాపూర్, రామడుగు, ఆగస్టు 28) 26)పుర్రె రాజలింగం (ఆత్మకూర్, మెట్‌పల్లి, సెప్టెంబర్ 02) 27)ముక్కా సదయ్య (చిన్నకోమటిపల్లి, జమ్మికుంట, సెప్టెంబర్ 02) 28)ఠాకూర్ చందర్‌సింగ్ (నవాబుపేట్ , చిగురుమామిడి, సెప్టెంబర్ 03) 29)ఖమ్మంపల్లిమల్లయ్య (శంకరంపల్లి, కాటారం, సెప్టెంబర్ 03) 30)ఎంకమురి తిరుపతి (చింతలపల్లి, ఎల్కతుర్తి, సెప్టెంబర్ 04) 31)పారుపల్లి రాజేశం (కాకర్లపల్లి, మంథని, సెప్టెంబర్ 05) 32)దేవుశెట్టి అంజయ్య (కాచిరెడ్డిపల్లి, గంగాధర, సెప్టెంబర్ 09) 33)గుగులోతు రాము(రాజనగరం, రాయికల్, సెప్టెంబర్ 09) 34)గుగులోతు శ్రీనివాస్ (చాపగాని తండా, భీమదేవరపల్లి, సెప్టెంబర్ 10) 35)బొజ్జ శ్రీనివాస్ (కేశనపల్లి, ముత్తారం, సెప్టెంబర్ 10) 36)అనుమాండ్ల కనుకారెడ్డి (గూడెం, బెజ్జంకి, సెప్టెంబర్ 10) 37)తనుగుల అశోక్ (సూరారం, ఎల్కతుర్తి,సెప్టెంబర్ 14) 38)సుల్తానా రమాదేవి (కట్కూర్ ,భీమదేవరపల్లి, సెప్టెంబర్ 16) 39)దున్నపోతుల సమ్మవ్వ (గౌరవెల్లి, హుస్నాబాద్, సెప్టెంబర్ 16) 40)బాస్వ రాజయ్య (ధర్మసాగర్, కాటారం, సెప్టెంబర్ 18) 41)మంథెన సమ్మయ్య (చింతకాని, కాటారం, సెప్టెంబర్ 22) 42)పోలు రాజయ్య (తోటపల్లి, హుస్నాబాద్, సెప్టెంబర్ 23) 43)బద్ది భీమయ్య (పోతారం, సారంగాపూర్, సెప్టెంబర్ 23) 44)న్యాత దేవరాజు (గర్జనపల్లి ,ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 25) 45)తోట మల్లయ్య (తడగొండ, బోయినపల్లి, సెప్టెంబర్ 25) 46)మెంగని తిరుపతి (తిమ్మాపూర్, ధర్మపురి, సెప్టెంబర్ 27) 47)కత్తెరపాక అంజయ్య (కొదురుపాక, బోయినపల్లి, అక్టోబర్ 02) 48)దశరథం రమేష్ (లక్కారం, ముత్తారం, అక్టోబర్ 05) 49)చీకట్ల మల్లయ్య (సముద్రాల, కోహెడ, అక్టోబర్ 09) 50)పుట్టకొక్కుల కుమార్ (అడవి శ్రీరాంపూర్, ముత్తారం, అక్టోబర్ 10) 51)ఊకంటి మదుసుధన్‌రెడ్డి(మోతె, రామడుగు, అక్టోబర్ 11) 52)ముదం వీరస్వామి (రాంపూర్, హుజూరాబాద్, అక్టోబర్ 16) 53)ఎంబడి సంతోషి (పాశిగాం, ధర్మపురి, అక్టోబర్ 19) 54)అటికం రాజేందర్ (పీచుపల్లి, బెజ్జంకి, అక్టోబర్ 21) 55)పురుగుల దేవయ్య (లింగంపేట, చందుర్తి, అక్టోబర్ 25) 56)బుర్రపోచయ్య (వింజపల్లి, కోహెడ, అక్టోబర్ 31) 57)జోడు సాగర్ (యామన్‌పల్లి, మహాముత్తారం, నవంబర్ 01) 58)పడిగె దేవయ్య (చిన్నబోనాల, సిరిసిల్ల , నవంబర్ 02) 59)బావు శ్రీనివాస్ (మైసంపల్లి, కోహెడ, నవంబర్ 03) 60)దోమల దుర్గయ్య (సముద్రాల, కోహెడ, నవంబర్ 06) 61)కట్లె చిన్నదేవయ్య (రాజన్నపేట, ఎల్లారెడ్డిపేట, నవంబర్ 09) 62)లావుడ్య బిక్షపతి (భల్లునాయక్‌తండా, హుస్నాబాద్, నవంబర్ 14) 63)రౌతు మధురయ్య (దుబ్బలపల్లి, సుల్తానాబాద్, నవంబర్ 15) 64)మెండె దేవయ్య (గొల్లపల్లి, వేములవాడ, నవంబర్ 16) 65)మైదం సత్తయ్య (దమ్మన్నపేట, ధర్మపురి, నవంబర్ 18) 66)తలగంప తిరుపతి (వెన్కేపల్లి, సైదాపూర్, నవంబర్ 21) 67)నేతికుంట లక్ష్మి (గంభీర్‌పూర్, కథలాపూర్, నవంబర్ 22) 68)దయ్యాల లక్ష్మణ్ (రుద్రంగి, చందుర్తి, నవంబర్ 22) 69)పబ్బాల కుంటయ్య (మల్కాపూర్, బోయినపల్లి, నవంబర్ 23) 70)ఎలా చంద్రం (సముద్రాల, కోహెడ, నవంబర్ 24) 71)పిట్టల రాజయ్య (గండిపల్లి, హుస్నాబాద్, నవంబర్ 26) 72)ఓరగంటి లచ్చయ్య (పత్తికుంటపల్లె, ఇల్లంతకుంట, డిసెంబర్ 06) 73)అనగోని లస్మయ్య (సైదాపూర్. సైదాపూర్, డిసెంబర్ 06) 74)బత్తుల శ్రీనివాస్ (కిష్టాపూర్ , రామడుగు, డిసెంబర్ 11) 75)పాల్త్య పెద్ద శంకర్ (ఒడ్డెలింగాపూర్, రాయికల్, డిసెంబర్ 13) 76)మహేష్ సంపత్(వెంకట్రావ్‌పల్లె, హుజూరాబాద్, డిసెంబర్ 15) 77)మాచమల్ల చంద్రయ్య (బొమ్మనపల్లి, చిగురుమామిడి, డిసెంబర్ 16) 78)ఎర్రబెల్లి బాలయ్య (రేగులపల్లి, బెజ్జంకి, డిసెంబర్ 19) 79)కొండం భాస్కర్‌రెడ్డి (గజసింగవరం, గంభీరావుపేట, డిసెంబర్ 22) 80)గుగ్గిళ్ళ బాలయ్య (గుగ్గిళ్ళ, బెజ్జంకి, డిసెంబర్ 23) 81)దిడ్డి రమేశ్ (కొత్తపల్లి, పెద్దపల్లి. జనవరి 03) 82)బోడ వేణు (పదిర, ఎల్లారెడ్డిపేట, జనవరి 07) 83)పిట్ల పెద్దలింగం (వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట. జనవరి 17) 84)నత్తి లక్ష్మిరాజం (రాఘవపేట, మల్లాపూర్, జనవరి 25) 85)చెల్పూరి శ్రీనివాస్ (బొమ్మకల్, సైదాపూర్, జనవరి 30) 86)పెద్ది రాజయ్య (పూడూర్, కొడిమ్యాల, ఫిబ్రవరి 02) 87)మడ్లపల్లి వీరేశం (వెలిచాల, రామడుగు, ఫిబ్రవరి 07) 88)బండి ఓదెలు (మడిపలి, జమ్మికుంట, ఫిబ్రవరి 17) 89)మర్రి బాలయ్య (నవాబుపేట్ , చిగురుమామిడి, మార్చి 04) 90)గోకని మోహన్‌రెడ్డి (గోపాల్‌రావుపల్లె. సిరిసిల్ల , మార్చి 08) 91)నాగెల్లి మహిపాల్‌రెడ్డి (గుండారెడ్డిపల్లి, కోహెడ, మార్చి 04) 92) బరోతు సమ్మయ్య (దొబ్బలపాడు, మహాముత్తారం, మార్చి 15) 93) పెద్దపోలు మల్లయ్య (మహదేవపూర్ కాళేశ్వరం, మార్చి 18) 94) కుక్కల మల్లయ్య (ఎల్కతుర్తి, జీల్గుల, మార్చి 19)
నల్లగొండ (77)
1)గంగనబోయిన పరమేశం (చెల్మెడ (మం), మునుగోడు(గ్రా), జూన్ 02) 2)కల్లూరి వెంకటేశ్వర్లు(ఔరవాణి, నార్కట్‌పల్లి, జూన్ 06) 3)పసునాడి యాదయ్య (ముస్త్యాలపల్లి, భువనగిరి, జూన్ 06) 4)చేగొండి సైదులు (గుర్రంపోడ్, గుర్రంపోడ్, జూన్ 07)5)గుర్రం బిక్షమయ్య (జూనుతుల, గుర్రంపోడ్, జూన్ 09) 6)గుద్దేటి లాలయ్య (తకళ్ళపల్లి, చింతపల్లి, జూన్ 12) 7)పబ్బు యాదయ్య (శోభనాద్రిపురం, రామన్నపేట, జూన్ 20) 8)జంగిడి శ్రీను(నసర్లపల్లి, చింతపల్లి, జూలై 01) 9)కల్కూరి కళమ్మ (వెలువర్తి, వలిగొండ, జూలై 06) 10)రొట్టెల లచ్చయ్య (తిప్పర్తి, తిప్పర్తి, జూలై 15) 11)మాదగోని యాదయ్య (జి.యడవెల్లి, కనగల్, జూలై 19) 12)బండి సుమలత (సిలార్‌మియాగూడెం, తిప్పర్తి, జూలై 27) 13)బత్తిని విద్యాసాగర్ (సుద్దాల, గుండాల, జూలై 27) 14)చెట్కూరి మల్లయ్య (కాల్వపల్లి, రాజాపేట, జూలై 27) 15)మండల శ్రీను (కాల్వపల్లి, గుర్రంపోడ్, ఆగస్టు 08) 16)గుండెబోయిన వెంకన్న (కంచనపల్లి, నల్లగొండ, ఆగస్టు 08) 17)వెన్నమళ్ళ శివకుమార్ (పిట్టంపల్లి, కట్టంగూర్, ఆగస్టు 13) 18)మునికుంట్ల కృష్ణయ్య (కుధాభాక్షపల్లి, మర్రిగూడ, ఆగస్టు 18) 19)అబ్బనబోయిన పరమేశ్ (అమలూరు. గుర్రంపోడ్, ఆగస్టు 18) 20)మునుగోడు లక్ష్మయ్య (ఆకుతోటపల్లి, డిండి, ఆగస్టు 19) 21)దాసరి రాములు (పల్లెపహాడ్, తుర్కపల్లి, ఆగస్టు 21) 22)మారగోని వెంకటయ్య (అంగడిపేట, చండూరు, సెప్టెంబర్ 03) 23)అంకటి లింగయ్య (చేపూరు, గుర్రంపోడ్, సెప్టెంబర్ 06) 24)బీమనపల్లి పార్వతమ్మ(రేగట్టె, కనగల్,సెప్టెంబర్ 09) 25)కేశబోయిన లక్ష్మయ్య(గుండ్లపల్లి, నల్లగొండ, సెప్టెంబర్ 13) 26)ఎర్ర సత్తయ్య (పీపల్‌పహాడ్, చౌటుప్పల్, సెప్టెంబర్ 15) 27)దూదిమెట్లఅంజయ్య (రాయినిగూడెం, చింతపల్లి, సెప్టెంబర్ 15) 28)పొడిశెట్టి పున్నయ్య (చిత్తలూరు, శాలిగౌరారం, సెప్టెంబర్ 16) 29)చాడ రాజయ్య (చల్లూరు, రాజాపేట, సెప్టెంబర్ 20) 30)చామ సత్తిరెడ్డి (కొండపాకగూడెం, నార్కట్‌పల్లి, అక్టోబర్ 02) 31)బానోతు పడ్త్యా (రుస్తాపూర్, తుర్కపల్లి, అక్టోబర్ 02) 32)బోయిని బాలయ్య (తుర్కపల్లి, తుర్కపల్లి, అక్టోబర్ 02) 33)కొర్ర రూప్ల (గాగిళ్ళపురం, చందంపేట, అక్టోబర్ 03) 34)పల్లా సత్యపాల్ రెడ్డి(దిలావర్‌పూర్, ఆలేరు, అక్టోబర్ 07) 35)కట్టెగోల లక్ష్మయ్య (పాల్వాయి, గుర్రంపోడ్, అక్టోబర్ 11) 36)ముంగి వెంకటయ్య (తుర్కపల్లి, కనగల్, అక్టోబర్ 12) 37)బొబ్బలి వెంకట్‌రెడ్డి(దీపకుంట, నల్లగొండ, అక్టోబర్ 14) 38)జాల యాదయ్య (పిట్టంపల్లి, కట్టంగూర్, అక్టోబర్ 16) 39)గొల్ల రామలింగయ్య (నోముల, నకిరేకల్, అక్టోబర్ 17) 40)బీ వెంకటేశ్వర్లు (ఐలాపురం, మిర్యాలగూడ, అక్టోబర్ 18) 41)గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డి (గుడిపల్లి, పీఏపల్లి, అక్టోబర్ 18) 42)కొమ్ము లింగయ్య(రావి గూడెం, మునుగోడు, అక్టోబర్ 24) 43)గుత్తా రామకృష్ణారెడ్డి (ఔరవాణి, నార్కట్‌పల్లి, అక్టోబర్ 25) 44)నక్క లక్ష్మయ్య (నసర్లపల్లి, చింతపల్లి, అక్టోబర్ 25) 45)బయ్య చినలింగయ్య (చెర్కుపల్లి, కేతేపల్లి, అక్టోబర్ 27) 46)గూడూరు బుచ్చిరెడ్డి (మసీద్‌గూడెం, చౌటుప్పల్, అక్టోబర్ 30) 47)మాలిగ దశరధ (కొరటికల్, మునుగోడు, నవంబర్ 01) 48)పబ్బు లక్ష్మమ్మ (తేరట్‌పల్లి, చండూరు, నవంబర్ 06) 49)నేనావత్ చందు (నేరేడుగొమ్ము, చందంపేట, నవంబర్ 08) 50)కరెంటోతు సునీత (అలుగు తండా, సంస్థాన్‌నారాయణపురం, నవంబర్ 11) 51)సపావట్ రాములు (జాల్ తండా, ఎర్రారం డిండి, నవంబర్ 11) 52)కావలి వెంకన్న (ఉడతలపల్లి, చండూరు, నవంబర్ 12) 53)సొవ్వురి సాయిలు (చిత్రియాల, చందంపేట, నవంబర్ 16) 54)లవిశెట్టి అంజయ్య (తిప్పర్తి, తిప్పర్తి, నవంబర్ 17) 55)ఆరేటి వెంకట్ రెడ్డి (పాషవానిగూడెం,గుర్రంపోడ్, నవంబర్ 18) 56)మద్దెల తిరుపతయ్య (గాగిళ్లపూరం, చందంపేట, నవంబర్ 22) 57)రూపని జానయ్య (చందనపల్లి, నల్లగొండ, నవంబర్ 23) 58)కొండమడుగు ఎల్లేశం (బస్వాపూర్, భువనగిరి, నవంబర్ 25) 59)బాణోతు కిట్టు (లాలితండా, నేరేడుచర్ల, నవంబర్ 26) 60)దెపావత్ పాండు (వీర్లగడ్డతండా, హాలియా, నవంబర్ 28) 61)కున్సోతు బీమా నాయక్ (పచ్చర్లబోడుతండా, భువనగిరి, నవంబర్ 30) 62)కట్టెగోయిన సాలయ్య (నడికూడ, గుర్రంపోడ్, డిసెంబర్ 08) 63)నల్లా రాంరెడ్డి (వెంకటాపురం, నార్కట్‌పల్లి, డిసెంబర్ 10) 64)మెండె అంజయ్య (ఉర్మడ్ల, చిట్యాల, డిసెంబర్ 19) 65)బొడ్డు పెద వెంకటయ్య (మొండికాని గూడెం, గుర్రంపోడ్, డిసెంబర్ 20) 66)కుడతాల కాశయ్య (నల్లగొండ, నల్లగొండ, డిసెంబర్ 21) 67)కస్పరాజు లచ్చయ్య (తిప్పర్తి, తిప్పర్తి, జనవరి 21) 68)కొమ్ము అవిలయ్య (కడపర్తి, నకిరేకల్, జనవరి 21) 69) కర్తాల శ్రీధర్ (గంధమల్ల, తుర్కపల్లి, జనవరి 22) 70)తాటికొండ అయిలయ్య (వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి, జనవరి 28) 71)శ్రీరాముల పోల్‌రాజు (ఎన్నారం, రామన్నపేట, జనవరి 30) 72)పెట్టుగల ధనమ్మ(వెలిమకన్నె, మునుగోడు, ఫిబ్రవరి 09) 73)మేఘావత్ మంగు (బాలాజీ నగర్‌తండా, పిఎపల్లి, ఫిబ్రవరి 11) 74)లింగాల నర్సయ్య (ఎన్‌జిబండలు, తుర్కపల్లి, ఫిబ్రవరి 16) 75)నిమ్మల లక్ష్మారెడ్డి (రామడుగు, హాలియా, మార్చి 04) 76) పుచ్చకాయల జనార్దన్‌రెడ్డి (అన్నెపర్తి, నల్లగొండ, మార్చి 06) 77) ఉడుత ఈదయ్య (చింతపల్లి, ఉమ్మాపురం, మార్చి 17)
ఏపీలో రైతు ఆత్మహత్యల జాబితా (2014 జూన్ నుంచి) మృతులు 63 మంది
అనంతపురం (59)
1) పుల్లారెడ్డి (పామిడి (మం), రామరాజుపల్లి (గ్రా), జూన్ 13 (మృతి తేదీ) 2)ఉప్పర లక్ష్మణ (రొద్దం, కొత్తపల్లి, జూన్ 13), 3)కేశప్ప (కొత్తచెరువు, మారకుంటపల్లి, జూన్ 14) 4)సరస్వతి (పెద్దవడుగూరు, అవలంపల్లి, జూన్ 18) 5)సుధాకర్ (గుంతకల్లు, వై.టి చెరువు, జూలై 01) 6)హనుమన్న (గుంతకల్లు, బుక్కసంగాల, జూలై 02) 7)ఓబులయ్య (యాడికి, జూలై 09) 8)శివారెడ్డి (పామిడి, ఏ.కొండాపురం, ఆగస్టు 02)9) ఓబన్న (మడకశిర, హెచ్‌ఆర్ పాళ్యం, ఆగస్టు 06) 10)శ్రీకాంత్‌రెడ్డి (గుత్తి, లచ్చానుపల్లి, ఆగస్టు 09) 11)బెస్తలక్ష్మిదేవమ్మ (రొద్దం, వై.టిరెడ్డిపల్లి, ఆగస్టు 11) 12)శ్రీనివాస్‌రెడ్డి (కూడేరు, పి. నారాయణపురం, ఆగస్టు 18) 13)గిడ్డీరప్ప (గుడిబండ, ఎస్‌ఎస్ గుండ్లు, సెప్టెంబర్ 05 ) 14)ఓబుళరెడ్డి(గుత్తి, పి.కొత్తపల్లి, సెప్టెంబర్ 15) 15)వెంకటనారాయణరెడ్డి (పెద్దవడుగూరు, చింతలచెరువు, సెప్టెంబర్ 17) 16)వెంకటరామిరెడ్డి(పెద్దవడుగూరు, చింతలచెరువు, సెప్టెంబర్ 18) 17)నెట్టెప్ప (గుంతకల్లు, గుండాల, సెప్టెంబర్ 20) 18)కురబ రామచంద్ర (బొమ్మనహాల్, నేమకల్లు, సెప్టెంబర్ 24) 19)పసల వెంకటేష్(చెన్నేకొత్తపల్లి, మేడాపురం, సెప్టెంబర్ 25) 20)ముత్యాలురెడ్డి (పెద్దవడుగూరు, కాశేపల్లి, సెప్టెంబర్ 26) 21)రాముడు (బత్తలపల్లి, తాడిమర్రి, అక్టోబర్ 05) 22)ఉప్పరగోపీనాథ్ (రొద్దం, గోనిమేకలపల్లి, అక్టోబర్ 07, 2014) 23)బోయ శ్రీనివాసులు (రొద్దం, గోనిమేకలపల్లి, అక్టోబర్ 11) 24)నారాయణ (కళ్యాణదుర్గం, ముదిగల్లు, అక్టోబర్ 14) 25)వన్నప్ప (ఉరవకొండ, అక్టోబర్ 18) 26)రాములమ్మ (బత్తలపల్లి, ఎర్రాయపల్లి, అక్టోబర్ 18) 27)వెంకటరాముడు (అనంతపురంరూరల్, కామారుపల్లి, అక్టోబర్ 22) 28)హుస్సేనప్ప(గుంతకల్లు. నల్లదాసరిపల్లి, అక్టోబర్ 22) 29)శ్రీనివాసులు (కళ్యాణదుర్గం, నారాయణపురం, అక్టోబర్ 10) 30)సోమేనాయక్ (గోరంట్ల, బి.ఎన్ తాండా, నవంబర్ 10) 31)కోదండరాముడు (యాడికి, నగరూరు, నవంబర్ 18) 32)కె. సుబ్బయ్య (తలుపుల, బలిజపేట, నవంబర్ 24) 33)ఉదయ్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి, గంగాదేవిపల్లి , డిసెంబర్ 07) 34)గుజ్జల నాగభూషణం (ధర్మవరం, మల్లేనిపల్లి, డిసెంబర్ 10) 35)రామిరెడ్డి (రొళ్ళ, అలుపనపల్లి, డిసెంబర్ 13) 36) తలారీ రాజు (నార్పల, గంగనపల్లి, డిసెంబర్ 25) 37)ఎం.రవీంద్రనాయక్ (తలుపుల, చంద్రనాయక్ తండా, డిసెంబర్ 30 38)వెంకటేశు (తాడిపత్రి, పోరాటకాలనీ, డిసెంబర్ 31) 39)రాజేష్ (కంబదూరు, కురాకులపల్లి, జనవరి 08) 40) గురుస్వామి (ఉరవకొండ, ఆమిద్యాల, జనవరి 16) 41)కురుబ సిద్దప్ప (లేపాక్షి, మామిడిమాకులపల్లి, జనవరి 16)42)నారాయణస్వామి (ధర్మవరం, నాగలాపురం, జనవరి 28 ) 43)నరసింహారావ్ (బొమ్మనహాల్. దేవగిరి, ఫిబ్రవరి 01) 44)రామాంజనేయులు (కంబదూరు, ఒంటారెడ్డిపల్లి, ఫిబ్రవరి 04) 45)పాపన్నగారి గంగప్ప (ధర్మవరం, మల్లకాలువ, ఫిబ్రవరి 08) 46)గుంజే రమేష్ (నార్పల, దిగుమర్రి, ఫిబ్రవరి 15) 47)రాజేష్(కంబదూరు, రాళ్లఅనంతపురం, ఫిబ్రవరి 18) 48)చిన్నఅంకిరెడ్డి(తాడిపత్రి, బొడాయిపల్లి, ఫిబ్రవరి 20) 49)గోవిందనాయక్(వజ్రకరూరు, వెంకటాంపల్లి పెద్ద తండా, ఫిబ్రవరి 25) 50)శంకరయ్య (యల్లనూరు, నిట్టూరు, ఫిబ్రవరి 25) 51)దేవి (పెద్దవడుగూరు, చింతలచెరువు, మార్చి 02) 52)భీమిరెడ్డి (రాయదుర్గం, ఆవులదట్ల, మార్చి 04) 53)అరుణాచల్‌రావ్ (లేపాక్షి, పూలమతి, మార్చి 10) 54)నారాయణస్వామి (గుత్తి , కొత్తపేట, మార్చి 11) 55)వెంకటప్ప(కళ్యాణదుర్గం, సీబాయి, మార్చి 12) 56) హుస్సేనప్ప(గుత్తి, గొజ్జేపల్లి, మార్చి 13) 57)బెస్త పెద్ద పోతన్న ( రొద్దం, వైటీరెడ్డిపల్లి, మార్చి 19) 58) బెస్త రామజోగి (గార్లెదిన్నె, గార్లెదిన్నె, మార్చి 19) 59) గొళ్ల మునీంద్ర ( శింగనమల, శింగనమల, మార్చి 19)
ప్రకాశం (4)
1) దాసరి లక్ష్మీనారాయణ (కోలలపూడి (మం), మార్టూరు(గ్రా), సెప్టెంబర్ 23) 2) పిన్నిక అచ్చయ్య (మార్కాపురం, మార్కాపురం, డిసెంబర్ 20) 3)పెడవల్లి రామాంజనేయులు (మార్టూరు, మార్టూరు, మార్చి 09) 4) కన్నెబోయిన శ్రీను (పెద్దారవీడు, తమ్మడపల్లి, మార్చి 17)
ఆత్మహత్య చేసుకున్నదిలా...
పురుగుల మందు తాగి- 67ు.. ఉరివేసుకుని - 26ు
ఇతరత్రా- 7ు (బావుల్లో దూకి,
నిప్పంటించుకుని, రైలుకింద పడి తదితర మార్గాల్లో..)
No comments:
Post a Comment