Saturday 12 September 2015

ఫ్యాషన్@ భీమవరం

ఫ్యాషన్@ భీమవరం
Updated :12-09-2015 12:01:39
  • రేపు మిస్‌ వెస్ట్‌ పోటీలు
ఫ్యాషన్‌ షోలు..కాంపిటేషన్‌ షోలు హైదరాబాద్‌, ముంబై వంటి మహా నగరాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడవి పట్టణాలకూ చేరుకున్నాయి. మిస్‌ పశ్చిమ గోదావరి పోటీలకు భీమవరం ఆదివారం వేదిక కానున్నది. ఈ పోటీలలో పాల్గొనేందుకు పలువురు యువతులు పట్టణంలో శిక్షణ పొందుతున్నారు. పోటీలకు ఎంపికైన వివిధ ప్రాంతాల యువతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సినిమా రంగంలోకి వెళ్ళాలంటే ఇలాంటి పోటీల్లో పాల్గొంటే అవకాశాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్యాషన్‌ షోలలో పాల్గొనే వారు ఎక్సర్‌సైజ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటేనే ఈ కాంపిటేషన్‌లో విజయం సాధించవచ్చని యువతులు చెబుతున్నారు.
అన్నిరకాలుగా సక్సెస్‌ కావాలి
లీలా టాటా, ఫ్యాషన్‌ కొరియోగ్రఫీ,
హైదరాబాద్‌)

ఫ్యాషన్‌ షోలలో ముందు స్థాయిలో నిలవాలంటే వాకింగ్‌ ఒక్కటే కాదు.. అన్ని రకాలుగా సక్సెస్‌ కావాలి. ధారాళంగా మాట్లాడటం, ఫేస్‌ ఫీలింగ్‌ రియాల్టీగా ఉండాలి. నవ్వు, కళ్ళతో చూ డటం ఇవన్నీ ఆకట్టుకునే విధంగా ఉండాలి.
 
అన్నీ బావుండాలి
జి.స్రవంతి ,ఫ్యాషన్‌ డిజైనర్‌, విజయవాడ 
ఐదు సంవత్సరాల నుంచి ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నాను. బ్యాడీ మెజర్‌మెంట్స్‌ కరెక్ట్‌గా ఉన్నప్పుడే ఫ్యాషన్‌ షోలలో ప్రథమ స్థానంలో నిలవగలరు. శరీర ఆకృతి, మెజర్‌మెంట్స్‌ని బట్టి డ్రెస్‌ ఎంపిక చేస్తాం. డ్రెస్‌తో పాటు వాకింగ్‌, హెయిర్‌స్టైల్‌ అన్నీ కరెక్టుగా ఉంటేనే షోలో ఆక ట్టుకునే విధంగా ప్రదర్శించడానికి వీలుంటుందిఫ్యాషన్‌
షోలంటే ఆసక్తి : కె.శాంతి, తణుకు
తణుకులో బాల్‌ బ్యాడ్మింటన్‌ కోచ్‌గా చేస్తున్నాను. హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ డిజైన్‌ సంవత్సరం కోర్సు పూర్తిచేశాను. మొదటి నుంచి ఫ్యాషన్‌ షోలలో పాల్గొనాలని ఆసక్తి ఉండేది. అయితే ఆ అవకాశం రాకపోవడం వల్ల ఇప్పటివరకు ఎక్కడ పాల్గొనలేదు.జిల్లాలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల ఆసక్తి గలవారికి అవకాశం కల్పించినట్లయింది.
 
కళాశాల పోటీలలో ఫస్ట్‌ : రేష్మిశర్మ, భీమవరం
బివిరాజు కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాను. కళాశాలలో మిస్‌ పోటీలు నిర్వహించినప్పుడు ప్రథమ స్థానం లో నిలిచా. పలు ఫ్యాషన్‌ షోలను కళాశాలలో నిర్వహించారు. ప్రస్తుతం ఎంబీఏ చేస్తూ చిన్న జాబ్‌ కూడా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌ మీద ఆసక్తి ఉండేది. అందుకనే దీని వైపు మక్కువ చూపుతున్నాను. ఫ్యాషన్‌ రంగంలో రాణించాలన్నదే లక్ష్యం.
సినీ ఇండస్ర్టీకి వెళ్ళాలని..షేక్‌ షబీనా,జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెంలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాను. సినీఇండస్ర్టీకి వెళ్ళాలన్నదే లక్ష్యం. లోకల్‌ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తున్నాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కాంపిటేషన్‌ ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. శిక్షణ ఉంటేనే ఏ రంగంలోనైనా ముందంజలో ఉంటాం.
మోడల్‌ కావాలని ఆశ : అనూష,ఏలూరు 
మోడల్‌ కావాలన్నదే నా ఆశ. అయితే అది ఏ విధంగా అవ్వాలో..ఎలా శిక్షణ పొందాలో తెలిసేది కాదు. ఇలాంటి ప్రదర్శనలు జిల్లాస్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల ఈ అవకాశం దక్కింది. ఏ విధంగా ఉంటే మోడల్‌ అవుతారన్న దానిపై శిక్షణ ఇస్తున్నారు. ఒకసారి శిక్షణ పొందడం వల్ల ఆ అనుభవంతో మోడల్‌ అయ్యే అవకాశం వస్తుందనుకుంటున్నా

No comments:

Post a Comment