Saturday 12 September 2015

జగన్‌లా తప్పుడు పనులు చేయం : లోకేశ్

జగన్‌లా తప్పుడు పనులు చేయం : లోకేశ్
Updated :12-09-2015 03:01:07
  • తండ్రి పేరు చెప్పుకుని బతకడం కాదు
  • పార్టీ కార్యకర్తల కోసం ఏంచేశారో చెప్పాలి: లోకేశ్‌
 
కందుకూరు, సెప్టెంబరు 11 : ‘తాతలు.. తండ్రుల పేర్లు చెప్పుకుని బతకటం కాదు, వారి స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలి’ అని టీడీపీ యువనేత నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. మాయమాటలు, అబద్ధాలు చెబుతూ తండ్రిపేరు చెప్పుకుని సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్న దొంగబ్బాయి ఆటలు ఎంతోకాలం చెల్లవని చెప్పారు. పార్టీ కార్యకర్తల కోసం, వారి సంక్షేమం కోసం వారేమి చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. తాము ఎన్టీఆర్‌ ఆశయసాధన కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కందుకూరులో శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దొంగబ్బాయి అంటూ జగన్‌ని, మా అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేశారు. నేటికీ తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్న వారు పార్టీ కార్యకర్తల కోసం ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దొంగబ్బాయి చెప్పే మాయమాటలు, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పాఠశాల స్థాపించి కష్టాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల పిల్లలకు ఉచితవిద్య అందిస్తున్నామని చెప్పారు. బాలకృష్ణ క్యాన్సర్‌ హాస్పటల్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 134 మందికి ఈవిధంగా సహాయం చేశామని తెలిపారు. జగన్‌లాగా వేలకోట్లు దొంగ డబ్బు సంపాదించాలని లేదని, అలాంటి తప్పుడు పనులు చేయబోమని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దొంగడబ్బు వెనకేసి ఆ డబ్బుతో పత్రిక, టీవీ చానల్‌ పెట్టాలన్న ఆలోచనలు తమకు లేవని చెప్పారు. శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్‌ దాసరి రాజా అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో దివి శివరాం, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రసంగించారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment