Wednesday 16 September 2015

ఏపీకి అరుదైన గుర్తింపు, 13వ స్థానంలో తెలంగాణ: ప్రపంచ బ్యాంక్ ర్యాంక్‌లివీ

ఏపీకి అరుదైన గుర్తింపు, 13వ స్థానంలో తెలంగాణ: ప్రపంచ బ్యాంక్ ర్యాంక్‌లివీ... Posted by: Srinivas Published: Monday, September 14, 2015, 19:25 [IST] Share this on your social network:    FacebookTwitterGoogle+   Comments (3) Mail న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు భారత దేశంలో వ్యాపారానికి అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవగా... మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది. ఈ జాబితాను ప్రపంచ బ్యాంక్ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విడుదల చేసింది. ఈ జాబితాలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. వ్యాపార అనుకూల జాబితాలో గుజరాత్ 71.14 శాతంతో మొదటి స్థానంలో, ఏపీ 70.12 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ 42.45 శాతంతో 13వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కేరళ, అస్సా, ఉత్తరాఖండ్‌లు.... 19, 22, 23వ స్థానాల్లో నిలిచాయి. కర్నాటక మాత్రం 9వ స్థానంలో నిలిచింది. వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితా వరుసగా.. గుజరాత్ - 1 ఆంధ్రప్రదేశ్ - 2 జార్ఖండ్ - 3 చత్తీస్‌గఢ్ - 4 మధ్యప్రదేశ్ - 5 రాజస్థాన్ - 6 ఒడిశా - 7 మహారాష్ట్ర - 8 కర్నాటక - 9 ఉత్తర ప్రదేశ్ - 10 పశ్చిమ బెంగాల్ - 11 తమిళనాడు - 12 తెలంగాణ - 13 హర్యానా - 14 ఢిల్లీ - 15 పంజాబ్ - 16 హిమాచల్ ప్రదేశ్ - 17 కేరళ - 18 గోవా - 19 పుదుచ్చేరి - 20 బీహార్ - 21 అసోం - 22 ఉత్తరాఖండ్ - 23 చండీగఢ్ - 24 అండమాన్ నికోబర్ దీవులు - 25 త్రిపుర - 26 సిక్కిం - 27 మిజోరాం - 28 జమ్ము కాశ్మీర్ - 29 మేఘాలయ - 30 నాగాలాండ్ 31 అరుణాల్ ప్రదేశ్ - 32

Read more at: http://telugu.oneindia.com/news/telangana/cii-world-bank-report-gujarat-ranked-as-the-most-business-friendly-state-163992.html

No comments:

Post a Comment