ఆయన కరీంనగర్ రాకుండా పోలీసులే అడ్డుకోవాలి : పొన్నం
కరీంనగర్, జనవరి 2 : ముఖ్యమంత్రి కిరణ్‌పై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కిరణ్ కరీంనగర్‌కు రారు. వస్తే... ఆయన హెలికాప్టర్‌ను గాలిలోనే తుపాకీతో పేల్చేస్తాం' అని అన్నారు. గురువారం కరీంనగర్‌లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. "ముఖ్యమంత్రి రాకను అటు ప్రజలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. ఆయన జిల్లాకు రావడాన్ని ఇష్టపడటంలేదు. ఈ సమయంలో సీఎం కూడా వచ్చే ధైర్యం చేయరని భావిస్తున్నాను. ఒకవేళ వస్తే... తెలంగాణ బిడ్డలుగా పోలీసులే కిరణ్‌ను అడ్డుకోవాలి.
యావత్తు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా సీఎం ఇక్కడికి రావాలని చూస్తే ఆయన హెలికాప్టర్‌ను గాల్లోనే పేల్చేస్తాం'' అన్నారు. గ్రామ గ్రామాన ముర్దాబాద్‌లు, దిష్టిబొమ్మల దహనాలు చేసినా ఆయన ఇక్కడకు వస్తే సిగ్గులేక వచ్చినట్లేనని ప్రభాకర్ స్పష్టం చేశారు. శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆ అవసరం వస్తే తెలంగాణ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని పొన్నం పేర్కొన్నారు. 'కిరణ్ వస్తే ఒకటి తీసుకువచ్చి కొట్టమని నాపై స్టేట్‌మెంట్ ఇచ్చిన మావోయిస్టు నేత జగన్‌ను అడుగుతా' అని పొన్నం ఓ ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ బదులిచ్చారు.
పొన్నంపై ఫిర్యాదులు: ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్‌పై విజయవాడ, విశాఖపట్నంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పొన్నంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలోని కాంగ్రెస్ నేతలు వన్‌టౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. న్యాయనిపుణల సలహా తీసుకొని తగిన చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు. విశాఖపట్నంలో యువజన కాంగ్రెస్ నేతలు నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
No comments:
Post a Comment