దుకాణం తెరిచే ఉంచుకోవాలని చిరంజీవికి ఆనాడే చెప్పా :నాయయణ
విశాఖపట్నం, జనవరి 4 : దుకాణం (పార్టీ) తెరిచి ఉంచుకోమని చిరంజీవికి తాను ఆనాడే చెప్పానని, దాన్ని మూసేయడం వల్ల ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరాలా? అని దిక్కులు చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ కంటే ప్రధాని మన్మోహన్‌సింగే ప్రమాదకారి అని ఆరోపించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థి అంటూ ప్రకటించి అవినీతికి వారసుడిని చేశారని వ్యాఖ్యానించారు. ఇక మొన్నటివరకు తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పిన బీజేపీ ఇప్పుడు సీమాంధ్రకు అన్యాయం జరిగిందంటూ కొత్త వాదన లేవనెత్తడం విచిత్రంగా ఉందన్నారు. మరోవైపు టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.
No comments:
Post a Comment