Wednesday, 15 January 2014

బిల్లు చుట్టూ ముళ్లు

బిల్లు చుట్టూ ముళ్లు

Sakshi | Updated: January 14, 2014 04:11 (IST)
బిల్లు చుట్టూ ముళ్లు
 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుతో పరిస్థితి మరింత సంక్లిష్టం
 పెద్ద సంఖ్యలో సవరణల ప్రతిపాదన, సూచనలతో విస్పష్టం
 సమైక్యవాదులతో పాటు విభజనవాదులూ వ్యతిరేకిస్తున్న వైనం
 బిల్లుకే ఏ ప్రాతిపదికా లేదంటూ పలు పార్టీల అభ్యంతరం
 విభజన బిల్లులోని ప్రతి క్లాజునూ ‘తొలగించాలి’ అంటూ
 సవరణలు ప్రతిపాదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
 రాష్ట్ర విభజనతో మూడు ప్రాంతాల వారికీ  చేటేనంటూ వివరణలు
 బిల్లులో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలను ఎత్తిచూపిన వైఎస్సార్ సీపీ


 రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వేదికలుగా ప్రస్తుతం చర్చిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013’ (ముసాయిదా)పై ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో నివేదించిన సవరణలు, సలహాలు, సూచనలు.. విభజన వల్ల రెండు రాష్ట్రాల్లో తలెత్తే అనేక చిక్కుముడులు, సమస్యలు, సవాళ్లను ప్రస్ఫుటం చేస్తున్నాయి. బిల్లులో పొందుపరిచిన ప్రతి అంశం లోతుపాతుల్లోకి వెళితే ఇరు ప్రాంతాలకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేదిగా ఉంది. అనేక అంశాలను సమైక్యవాదులే కాదు విభజనవాదులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏళ్లనాటి ఆకాంక్ష అని చెబుతున్న విభజనవాదులు సైతం పలు కీలకాంశాల్లో సవరణలు ప్రతిపాదించటం.. బిల్లు ఎంత సంక్లిష్టంగా ఉందనేదానికి అద్దం పడుతోంది. ఇరు ప్రాంతాల మధ్య సుదీర్ఘ కాలం విడదీయరాని బంధం ఏర్పడిన నేపథ్యంలో విభజన వల్ల భౌగోళిక, నైసర్గిక, ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, ఉద్యోగ, నదీ జలాల వంటి కీలకాంశాల్లో కొత్త సమస్యలను ఈ బిల్లు తెచ్చిపెడుతోంది.

  బిల్లు రూపొందించిన తీరు సమస్యల పరిష్కారానికి కాకుండా వాటిని మరింత జటిలం చేసే దిశలోనే ఉన్నాయన్నది నిపుణుల విశ్లేషణ. బిల్లులో పొందుపరిచిన అంశాలు సంక్లిష్టంగా ఉండగా.. అసలు కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపకల్పనలోనే ప్రాతిపదిక ఏదీ అనుసరించలేదని కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. విభజన వల్ల తలెత్తే తీవ్రమైన సమస్యల నేపథ్యంలో ఉభయ సభల్లో పలు రాజకీయ పార్టీలకు చెందిన సమైక్యవాదులు సవరణలను ప్రతిపాదించగా.. కొన్ని కీలకాంశాల్లో విభజనవాదులు సైతం సలహాలు, సూచనలు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించాలన్న దానిపై గతంలో పాటించిన విధివిధానాలేవీ అనుసరించకపోవడం, సంప్రదాయాలను ఖాతరు చేయకపోవడం, కమిటీల సూచనలు, సిఫారసులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013’ దేశంలోనే అత్యంత సంక్లిష్టమైన బిల్లుగా మారింది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామిక దేశంలో ఇప్పటివరకు ఆ నిర్ణయానికి రావడానికి కొన్ని పద్ధతులను పాటిస్తున్నారు. ఒక ప్రాంతంలోని ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయానికి రావడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. దేశంలో మొదటిసారి రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) ఏర్పాటు చేసి దాని సూచనలకు అనుగుణంగా రాష్ట్రాల విభజన, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత క్రమంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లను విభజించి వాటి నుంచి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పుడు ఆయా రాష్ట్రాల శాసనసభలు తమ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. ఆ తర్వాతే కేంద్రం విభజన బిల్లుల రూపకల్పన, తిరిగి వాటిపై ఆయా రాష్ట్రాల చట్టసభలు సమ్మతి తెలియజేయడం, ఆ తర్వాత పార్లమెంటులో బిల్లులను ఆమోదించడమన్న ప్రక్రియలో కొత్త రాష్ట్రాలు అవతరించాయి. ఆ మూడు రాష్ట్రాల విభజన బిల్లుల్లోనూ విభజన అనంతర ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ స్వయంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాలు ఆమోదించి కోరి విభజన చేసుకున్న నేపధ్యంలో తదుపరి తలెత్తిన సమస్యలపై పరస్పర చర్చలకు ఆస్కారంకలిగింది. కానీ.. ఆంధ్రప్రదేశ్ విషయంలో వాటన్నింటికి భిన్నంగా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించింది. 1969 లో తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం సమయాల్లో కూడా కేంద్రం విభజన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పలేదు. సుదీర్ఘ కాలం తర్వాత.. అదీ దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన నేపధ్యంలో శరవేగంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలన్న నిర్ణయానికి రావడం తీవ్ర విమర్శకు తావిచ్చింది.

 రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రం పెత్తనమే!

 మొత్తం 12 విభాగాలు (పార్ట్‌లు) గా పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రూపొందించారు. మొత్తం 108 క్లాజుల్లో విభజన ఏ రకంగా చేస్తున్నదీ బిల్లులో పొందుపరిచారు. ఈ క్లాజులపై ప్రాథమిక దశలోనే కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆయా పార్టీల్లోని ప్రతినిధులు అంశాల వారీగా సవరణలు ప్రతిపాదించారు. విభజన ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలు మినహాయించి ప్రతి అడుగులోనూ కేంద్రం తన పెత్తనాన్ని చాటుకుంది.
  రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఉత్పన్నమయ్యే అనేక సమస్యలకు కేంద్రం ఏ మాత్రం పరిష్కారం చూపకపోగా పరిష్కార అధికారాలను తన చేతుల్లో పెట్టుకుని అదే పరిష్కారమన్నట్లు బిల్లులో పేర్కొంది. విడిపోయిన తర్వాత ప్రధానంగా ఉద్యోగులు, పెన్షన్లు, ఆస్తులు, అప్పులు, నదీ జలాలు, ఉమ్మడి రాజధాని, గవర్నర్‌కు విశేషాధికారాలు, శాంతి భద్రతలు, బలగాలు.. ఒకటేమిటి అనేక అంశాల్లో తలెత్తే వివాదాలేవైనా సరే కేంద్రం పెత్తనం స్పష్టంగా కనబడుతోంది. ఏ వివాదమైనా కేంద్రం తన ఆదేశాల (ఆర్డర్) ద్వారా పరిష్కరిస్తుందని చెప్పింది.
  విభజన అనంతరం ఏర్పడే రాష్ట్రాలు ప్రధానంగా ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి మాత్రం కేంద్రం బిల్లులో ఎలాంటి హామీ ఇవ్వలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని విషయంలో కానీ నదీ జలాల్లో వాటాల పైన కానీ కమిటీలు, మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. అవి కూడా కేంద్రం పెత్తనంలోనే పనిచేస్తాయి.
  రాష్ట్రాన్ని విభజించడం ద్వారా రెండు రాష్ట్రాలకు చెందిన అనేక అంశాలపై కేంద్రానికి పెత్తనం కట్టబెట్టే దిశగా బిల్లు పర్యవసానాలు ఉన్నాయని ఆయా క్లాజులను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే బిల్లులోని అనేక అంశాలపై సవరణలు ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు విన్నవించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మొత్తం క్లాజులను ‘‘తొలగించండి’’ అని సవరణలు ప్రతిపాదించింది. మిగతా పార్టీలు మాత్రం ప్రాంతాల వారిగా సవరణలను ప్రతిపాదించారు.

 విభజన బిల్లులోని కీలకాంశాలను పరిశీలిస్తే...!

  పార్ట్   1 బిల్లు, నిర్వచనం, భౌగోళిక విభజన


 క్లాజు-1: ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు -2013’’. రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి ఈ పేరుతో కేంద్రం బిల్లును రూపొందించింది. (రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించడానికి ఉద్దేశించి ఈ పేరుతో విభజనకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఏర్పడినందున మెజారిటీ సభ్యులు ఈ క్లాజును తొలగించాలని సవరణ ప్రతిపాదించారు.) బిల్లు తొలి క్లాజులో పొందుపరిచిన దానికి అనుగుణంగానే బిల్లులోని ఇతర క్లాజుల్లో వివరించారు.
 క్లాజు-2: బిల్లు పేరు, దాని నిర్వచనం, కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి అమలులోకి వస్తుంది. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శాసనసభ నియోజకవర్గం, శాసనమండలి నియోజకవర్గం, ఎన్నికల కమిషన్, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందున్న రాష్ట్రం, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనాభా నిష్పత్తి 58.32 : 41.68గా ఉందని, ప్రస్తుత సభలో ఉన్న ప్రజాప్రతినిధులు విభజన అనంతరం ఆయా రాష్ట్రాల చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించడం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదలాయించిన భూభాగం, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నుంచి బదలాయించిన భూ భాగంలోని జిల్లాలు, మండలాలు, తాలూకాలు వంటివన్నీ కొత్త రాష్ట్రంలో భాగంగా మారుతాయి...

   పార్ట్   2 సరిహద్దులు, భూభాగాలు

 క్లాజులు - 3, 4: కేంద్రం అధికారిక గెజిట్ ప్రకటించిన తేదీ నుంచి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు తెలంగాణలో అంతర్భాగంగా ఉంటాయి. విభజనను వ్యతిరేకిస్తూ సవరణలు ప్రతిపాదించినందున సహజంగా భౌగోళికంగా సరిహద్దులను విడగొట్టడాన్ని వ్యతిరేకించారు. తెలంగాణను విభజించిన తర్వాత ఉండబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులు, భూభాగాలకు సంబంధించి సెక్షన్ 3 లో ప్రత్యేకించి వివరణను పొందు పరిచారు.
 క్లాజు-5 : తెలంగాణ, ఆం్రధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ పది సంవత్సరాలకు మించని విధంగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుంది. పదేళ్ల గడువు ముగిసిన తరువాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. 1955 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం కిందకొచ్చే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతమంతా ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.
 (ఉమ్మడి రాజధాని అన్నది ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక చిక్కుముడులతో చాలా సంక్లిష్టంగా మారడంతో ఇరు ప్రాంతాల ప్రతినిధుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునే గడువు విషయంలో విభజనవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. పరిపాలనా పరమైన చిక్కులతో పాటు ఉమ్మడి రాజధాని వల్ల అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని సమైక్యవాదులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు.)
 క్లాజు-6 :  విభజన బిల్లు చట్ట రూపం దాల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి తగిన సూచనలు సిఫారసు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. చట్టబద్ధంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లోగా ఈ కమిటీ తన సిఫారసులను అందిస్తుంది.
 (విభజననే అంగీకరించనప్పుడు ఇది ఉత్పన్నంకాదని సమైక్యవాదులు చెబుతుంటే, కమిటీ 45 రోజుల్లో తన సిఫారసులు అందిస్తున్నప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగించాల్సిన అవసరమే లేదని, రెండు మూడేళ్లలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని విభజన వాదులు సూచిస్తున్నారు.)
 క్లాజు-7 :  ప్రస్తుతమున్న రాష్ట్ర గవర్నర్ రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఉంటారు. రాష్ట్రపతి నిర్ణయించినంత కాలం ఆయన రెండు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగుతారు.
 క్లాజు-8 :  శాంతిభద్రతలకు సంబంధించి ఈ క్లాజులో తొమ్మిది సబ్‌క్లాజులను పొందుపరిచారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న ప్రాంతంలో ప్రజల భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తుల పరిరక్షణ అంశాలన్నింటికీ గవర్నర్‌దే బాధ్యత. ఈ ప్రాంతంలోని శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, వాటి కేటాయింపులను గవర్నర్ చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలితో సంప్రదింపుల మేరకు ఈ గవర్నర్ నడుచుకోవాలి. ఏవైనా అంశం ఉత్పన్నమైనప్పుడు గవర్నర్ వ్యక్తిగతంగా తనకు న్యాయమనిపించిన విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఆయన తీసుకున్నదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు. ఈ గవర్నర్‌కు సహాయకారిగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది. ఈ క్లాజులోని 8 (ఎ) (1) లో పొందుపరిచినట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అదనపు పోలీసు బలగాలను అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ శిక్షణా సంస్థ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటుంది. ఇలా మూడేళ్ల పాటు కేంద్రం పర్యవేక్షించిన అనంతరం అది తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళుతుంది. ఆ తర్వాత ఇలాంటి సంస్థనొకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంలో కేంద్రం సహకరిస్తుంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లను ఆ రెండింటికీ పంపిణీ చేస్తారు.
 క్లాజులు-9, 10 :  రెండు రాష్ట్రాల ఏర్పాటుకు వీలు కల్పించడానికి రాజ్యాంగంలోని తొలి షెడ్యూలు ‘‘రాష్ట్రాలు’’ అన్న చోట సవరణ చేస్తారు. తొలి షెడ్యూలులో 28 రాష్ట్రాల జాబితా తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణను చేర్చుతారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిల్లో ఆయా ప్రభుత్వాల అధికారాల్లో ఏలాంటి తేడాలు ఉండవు. (జీహెచ్‌ఎంసీ పరిధిని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూనే రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల అధికారాల్లో ఏమాత్రం తేడాలు ఉండవని బిల్లులో పేర్కొనడం గందరగోళానికి కారణమవుతోంది.

  పార్ట్   3 చట్టసభల్లో ప్రాతినిథ్యం, విభజన

 క్లాజులు 11, 12 : రాజ్యసభ స్థానాలకు సంబంధించి రెండు రాష్ట్రాల విభజన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 18కి బదులు 11 ఉంటాయి. మిగిలిన ఏడు స్థానాలు తెలంగాణలోకి వస్తాయి. ఇప్పుడున్న సభ్యుల పదవీ కాలంలో ఎలాంటి మార్పులుండవు.
 క్లాజులు 13, 14, 15: చట్ట సభల్లో ప్రాతినిథ్యం - రెండు రాష్ట్రాలను వేరుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి రాష్ట్రంలోని ప్రస్తుత 42 లోక్‌సభ స్థానాల్లో మార్పులు అమలులోకివస్తాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1950 మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉంటాయి. అలా ఆయా రాష్ట్రాల్లో చేరిన నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుల పదవీ కాలంలో ఎలాంటి మార్పు ఉండదు. ‘నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులు-2008’ ని అనుసరించి ఈ నియోజకవర్గాల పరిధులు కొనసాగుతాయి.
 క్లాజులు 16 నుంచి 21 వరకు: రెండు రాష్ట్రాల మధ్య శాసనసభల విభజన ప్రక్రియను ఈ క్లాజుల్లో పొందుపరిచారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ పరిధిలో 175, తెలంగాణ పరిధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రస్తుత శాసనసభలో ఆంగ్లో ఇండియన్ జాతీయుల నుంచి ఒక ప్రతినిధిని నియమిస్తుండగా, రెండు రాష్ట్రాల విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లోనూ ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిథ్యం కల్పించవచ్చు. ఈ క్లాజుల్లోనే సభాపతి, ఉపసభాపతి ఎంపిక విధానాలను కూడా పొందుపరిచారు.
 ళీ రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధి ఉమ్మడి రాజధానిగా ఉంటుందని బిల్లులో పొందుపరచగా, ఆయా రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి ఎక్కడ కొనసాగుతాయి. వాటి నిర్వహణాంశాలేవీ బిల్లులో స్పష్టంగా చెప్పలేదు.
 క్లాజులు 22 నుంచి 25 వరకు: శాసనమండలి (కౌన్సిల్), మార్పులు, రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను ఈ క్లాజుల్లో వివరించారు. రెండు రాష్ట్రాల్లోనూ కౌన్సిల్ కొనసాగుతుంది. గరిష్టంగా 90 మంది సభ్యులతో ప్రస్తుత శాసనమండలి ఏర్పాటు జరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణ రాష్ట్రంలో 40 మందికి మించకుండా సభ్యులు ఉండాలని నిర్దేశించారు.
 క్లాజులు 26 నుంచి 29 వరకు: నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ఈ క్లాజుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా, రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. కమిషన్‌కు సహకరించేందుకు ఐదుగురు శాసనసభ్యులు లేదా లోక్‌సభ సభ్యులను అసోసియేట్ సభ్యులుగా కేంద్రం నియమిస్తుంది. కమిషన్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి లేదా వ్యతిరేకించడానికి ఈ సభ్యులకు అధికారం ఉండదు. సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు, అభ్యంతరాల పరిశీలన అనంతరం నిర్ణయాలను ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రచురించాలి.

  పార్ట్   4 హైకోర్టు విభజన, నిర్వహణ

 క్లాజులు 30 నుంచి 43 వరకు: ఈ క్లాజుల్లోని అన్ని సబ్‌క్లాజుల్లో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టును నెలకొల్పేంత వరకూ హైదరాబాద్‌లోని ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రస్తుత జడ్జీలందరూ ఉమ్మడి హైకోర్టు జడ్జీలుగా కొనసాగుతారు. వారి జీతభత్యాల వ్యయాన్ని దామాషా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కేటాయిస్తారు. సిబ్బంది ఏర్పాటుతో సహా విధివిధానాలు ఇతర అంశాలను ఈ క్లాజుల్లో పొందుపరిచారు. 31లోని 1వ సబ్‌క్లాజు 30వ విభాగంలోని నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హైకోర్టు ఉండాలి. విభజన అనంతరం ప్రస్తుత హైకోర్టు హైదరాబాద్ హైకోర్టుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నెలకొల్పబోయే స్థానం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నియమించిన ప్రదేశంలో ఉండాలి. 2 రాష్ట్రాల హైకోర్టుల అధికారపరిధి, న్యాయమూర్తుల విభజన, న్యాయవాదుల అంశాలు, బార్ సభ్యుల ఆప్షన్లు, రిట్ పిటిషన్ల ప్రక్రియల స్వరూపం, న్యాయమూర్తుల అధికారాలు, సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే విధానం, హైదరాబాద్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కార్య వ్యవహారాల బదిలీ అంశాలను వివరించారు.
 బార్ కౌన్సిల్: ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్నందున హైకోర్టు అడ్వకేట్లకు బిల్లులో ఆప్షన్ కల్పించారు. అడ్వకేట్స్ చట్టం-1961 మేరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లు ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఏ హైకోర్టు బార్ కౌన్సిల్‌లో కొనసాగదలుచుకున్నారో లిఖితపూర్వకంగా తెలియజేయాలి. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వారిచ్చిన ఆప్షన్ మేరకు ఎవరైతే తెలంగాణకు మారాలని కోరుకుంటారో వారు తెలంగాణ బార్ కౌన్సిల్‌లో సభ్యులవుతారు.

  పార్ట్   5 ఖర్చు చేసే అధికారం, ఆదాయ పంపిణీ

 క్లాజులు - 44, 45, 46:  రాష్ట్ర ఆదాయ, వ్యయాలను ఎలా నిర్వర్తించే అంశాలను ఈ క్లాజుల్లో పొందుపరిచారు. తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర వ్యయు (ఖర్చు) వుంజూరు అంశం పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆరు నెలల కాలానికి ఆ రాష్ట్ర సంచిత నిధి నుంచి వ్యయూనికి అధికారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల వ్యయూలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వేర్వేరు నివేదికలను గవర్నర్‌కు సవుర్పించాలి. వీటి ఆధారంగా ఏదైనా అంశంపై చర్య తీసుకొనేందుకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రత్యేక అధికారాలు కల్పించడాన్ని ప్రస్తావించారు. క్లాజు 46 (1) ప్రకారం పదవుూడో ఆర్థిక సంఘం నిధులను జనాభా దావూషా లేదా మరేదైనా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయూలి.

  పార్ట్   6 ఆస్తులు, అప్పుల పంపకం

 క్లాజులు 47 నుంచి 67 వరకు: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆస్తులు అప్పుల పంపకానికి సంబంధించిన వివరాలు, కేటారుుంపుల విధానాన్ని పొందుపరిచారు. ఈ 20 క్లాజుల్లో పేర్కొన్న అనేక అంశాలపై ఏర్పడబోయే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలుగా మారే అవకాశాలున్నందున ప్రతి చోటా కేంద్రం ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు జారీ చేయొచ్చని బిల్లులో చేర్చారు.
  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం ప్రయోజనాలు పొందడానికి హక్కు ఉంటుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఉత్పన్నమైన ఆర్థికపరమైన అప్పులను కూడా కొత్తగా ఏర్పడే రాష్ట్రం భరించాలి. ఆస్తులు, అప్పులు రెండు రాష్ట్రాల వుధ్య సరైన, సవుుచితమైన సవూనమైన పంపకాలు జరగాలి. ఈ విషయుంలో వివాదాలను పరస్పర ఒప్పందాలతో పరిష్కరించుకోవాలి. అలా కుదరని పక్షంలో భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ సలహాపై కేంద్రం తన ఆదేశాల ద్వారా పరిష్కరించాలి.
  భౌగోళిక సరిహద్దులు నిర్ణయించిన మేరకు వాటి పరిధుల్లోని భూములు, వనరులు ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు బయట ఉన్న ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంపకం చేస్తారు. తనకు యోగ్యవుని కేంద్రం భావిస్తే అవసరమైన చోట తన ఆదేశాలతో ఆయూ రాష్ట్రాలకు ఆస్తుల పంపిణీ చేయువచ్చు. ప్రత్యేక సంస్థలు, వర్కుషాపులు, ప్రభుత్వ సంస్థలు, స్టోర్లను ఏ రాష్ట్ర ప్రాంతంలో ఉంటే ఆ రాష్ట్రానికి అందించాలి. సచివాలయుం, శాఖాధిపతుల కార్యాలయూలకు చెందిన స్టోర్లను జనాభా ప్రాతిపదిక పై రాష్ట్రాల వుధ్య కేటారుుంచాలి.
  ఖజానా, బ్యాంకు నిల్వలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వుధ్య పంచాలి. నిధుల సర్దుబాటును ఇరు రాష్ట్రాల ట్రెజరీల నుంచి కాకుండా రిజర్వు బ్యాంకులోని రెండు రాష్ట్రాల పరపతి నిల్వలను సర్దుబాటు చేయుడం ద్వారా అవులుచేయూలి. ఆస్తిపన్ను, సుంకం బకారుులు ఏ రాష్ట్రం పరిధిలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతారుు. రుణాలు, అడ్వాన్సులను కూడా ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రమే వసూలు చేసుకోవాలి. పెట్టుబడులు, సెక్యూరిటీలను జనాభా ప్రాతిపదికపై పంపకం చేయాలి.
  భవిష్యనిధి, పింఛన్లు: ఉద్యోగి ఏ రాష్ట్రానికైతే శాశ్వతంగా కేటాయించబడతారో ఆ రాష్ట్రమే ఆ ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ బాధ్యత వహించాలి. పింఛన్ల విషయుంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను 8వ షెడ్యూల్‌లోని నిబంధనల మేరకు బదిలీ చేయూలి. ఏదైనా ఒక పని కోసం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం యధావిధిగా కొనసాగుతుంది.

  పార్ట్   7 విద్యుత్ ఉత్పాదన, రోడ్డు రవాణా పంపిణీ

 క్లాజులు 68 నుంచి 75 వరకు:  రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో పొందుపరిచిన కంపెనీలు, కార్పొరేషన్ల అంశాలను ఈ క్లాజుల్లో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పాదన, పంపిణీ, సరఫరా, నీటి సరఫరాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ఆర్థిక సంస్థ, రోడ్డు రవాణా పర్మిట్లు తదితర అంశాలకు సంబంధించిన అంశాలను వివరించారు. కార్పొరేషన్లు, సంస్థలు ఇవి నియుమిత రోజు నుంచి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ చేసిన వూదిరిగానే సంస్థలు ఏ ప్రాంతంలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. విద్యుదుత్పత్తి, సరఫరాలకు సంబంధించి ఏ ప్రాంతానికైనా ప్రతికూలంగా ఉంటే దాన్ని వూర్పు చేయూలని సూచించింది. ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ పంపిణీ సరఫరాకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీచేస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా పర్మిట్లు నిర్దేశిత తేదీకి వుుందే చెల్లుబడి అరుునట్లుంటే కనుక కొత్తగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అధికారవర ్గంతో ధ్రువపరుచుకోవలసిన అవసరం లేదు.

  పార్ట్   8 ఉద్యోగుల పంపకం, నియమావళి

 క్లాజులు 76 నుంచి 83 వరకు: ఈ క్లాజులు, అన్ని ఉప క్లాజుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు సంబంధించిన నియువూవళిని పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోసం రెండు వేర్వేరు క్యాడర్లుగా ఏర్పాటవుతాయి. రాష్ట్ర క్యాడర్లకు అధికారుల కేటారుుంపు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నిర్ణరుుంచాలి. ఇతర సర్వీసులకు సంబంధించి ప్రస్తుత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తెలంగాణలో తాత్కాలికంగా పనిచేయూలని కేంద్రం ఉత్తర్వులు ఇస్తేనే తప్ప ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగాలి. స్థానిక, జిల్లా, జోనల్, వుల్టీజోనల్ కేడర్లకు సంబంధించిన ఉద్యోగులు నియుమిత తేదీ తరువాత కూడా అదే కేడర్‌లో కొనసాగుతారు. ఉద్యోగులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాకనే ఆయూ రాష్ట్రాల్లో పనిచేయుడానికి వీలవుతుంది. అందరికీ సవుుచిత, సవుధర్మ అవకాశాలు కల్పించేందుకు 30 రోజుల్లో సలహా సంఘాలను ఏర్పాటు చే యూలి. ఏపీ పబ్లిక్ సర్వీసు క మిషన్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కమిషన్‌గా ఉంటుంది. తెలంగాణకు వురో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేంతవరకు రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ అవసరాలను నెరవేర్చే బాధ్యత చూడాలి. ప్రస్తుత ఏపీపీఎస్‌సీ చైర్మన్, సభ్యులు ఆ రాష్ట్రానికే కొనసాగుతారు.

  పార్ట్  9 జల వనరుల నిర్వహణ, అభివృద్ధి

 (గోదావరి, కృష్ణా నదీ జలాలు, వాటి నిర్వహణ మండళ్లకు అపెక్స్ కౌన్సిల్)
 క్లాజులు 84 నుంచి 89 వరకు: జల వనరుల నిర్వహణపై వివరాలు పొందుపరిచారు. 90, 91 క్లాజులు, ఉప క్లాజుల్లో గోదావరి, కృష్ణా జలాల నిర్వహణకు ప్రత్యేక వుండళ్ల ఏర్పాటు, వాటి పర్యవేక్షణకు అపెక్స్ కౌన్సిల్ (అత్యున్నతాధికార వుండలి)ని ఏర్పాటు చేయూలని చేర్చారు. ఈ అపెక్స్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా కేంద్ర జలవనరుల వుంత్రి, సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వుుఖ్యవుంత్రులు ఉంటారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించడం, ఆమోదించడం ఈ వుండలి బాధ్యత. నదీజలాల పంపకంపై వివాదాలు తలెత్తితే సంప్రదింపులు, పరస్పర ఒప్పందాల ద్వారా పరిష్కరించుకోవాలి. గోదావరి, కృష్ణా జల వుండళ్లు కేంద్రం నిబంధనల మేరకు ప్రాజెక్టుల నిర్వహణ, పాలన తదితర అంశాలను పర్యవేక్షించాలి. గోదావరి వుండలి తెలంగాణలో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయూలి. ఇవి స్వయుం ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తారుు. ఈ బోర్డుల చైర్మన్లు, సభ్యులను కేంద్రం నియుమిస్తుంది. చీఫ్ ఇంజనీర్ స్థారుు అధికారిని సభ్యకార్యదర్శిగా బోర్డులకు నియుమిస్తారు. ఇవి కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి సరఫరా నియుంత్రణ బాధ్యతలు చూస్తారుు. ఒప్పందాలకు అనుగుణంగా విద్యుచ్ఛక్తి నియుంత్రణ విధిని ఇవి పాటించాలి. ప్రాజె క్టుల నిర్మాణ పనులను వుదింపుచేస్తారుు. ఈ బోర్డులకు సిబ్బందిని ఇరు రాష్ట్రాల నుంచి సవూన నిష్పత్తిలో డిప్యుటేషన్‌పై నియుమించాలి. జీతభత్యాలు ఇరు రాష్ట్రాలు చెల్లించాలి. కృష్ణా జలాలకు సంబంధించి ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్ పరిధిలోకి రాని అంశాలపై వురో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయూలి. ఇంతకువుుందు ట్రిబ్యునల్ కేటారుుంపులు చేయుకుంటే ప్రాజెక్టు వారీగా నిర్దిష్ట కేటారుుంపులు చేయూలి.

  ఈ క్లాజులన్నిటినీ తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సవరణ ప్రతిపాదన అందించింది. నదీ జలాలు ఏడో షెడ్యూల్‌లో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం. అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను వేయువచ్చు కానీ ఇలా అపెక్స్ కౌన్సిల్‌ను ఒక బిల్లు ద్వారా వేయుడం సరికాదు. ఇది నిబంధనలకు విరుద్ధం. అలా చేయూలంటే ఏడో షెడ్యూల్‌లోని రాష్ట్రాల జాబితాకు వూర్పులు, చేర్పులు చేయూల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయూలి. అలా వూర్పులు చేయుకుండా ఈ బిల్లుతో వుుందుకు వెళ్లడం అల్ట్రా వైర్స్ (అధికార పరిధులకు అతీతం) అవుతుంది. పరోక్షంగా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించినట్లు అవుతుంది. మిగులు జలాల వాడకంలో స్వేచ్ఛ అనేది ఆంధ్రప్రదేశ్‌కు వూత్రమే ఉంది. దేశంలో వురే రాష్ట్రానికీ లేదు. ప్రపంచంలో కూడా ఇలాంటి దాఖలాలు లేవు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటరుుతే మిగులు జలాలు వాడుకొనే స్వేచ్ఛ ఆంధ్ర, రాయులసీవు, తెలంగాణ ప్రాంతాలు వుూడూ కోల్పోవలసి వస్తుంది. రాష్ట్ర విభజనతో నదీజలాల విషయుంలో వుూడు ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ నవుు్మతోంది. అందువల్లే ఈ క్లాజులు అనవసరమని భావిస్తూ తొలగించాలని సవరణ ప్రతిపాదించింది.

  పార్ట్  10 వలిక సదుపాయూలు, ఆర్థిక చర్యలు

 క్లాజులు 92 నుంచి 94 వరకు: రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థికాభివృద్ధి కోసం పన్ను ప్రోత్సాహకాలతో తగు ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయుం అందించాలి. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయుం, శాసనసభ, శాసనమండలితో పాటు అవసరమైన వలిక సదుపాయూలతో సహా కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం ప్రత్యేక ఆర్థికసాయుం అందించాలి. కొత్త రాజధాని కోసం అవసరమైతే శిథిలమైన అటవీప్రాంతాన్ని డీనోటిఫై చేయూలి.
  రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నందున ఈ క్లాజుల్లోని ఏ అంశవుూ ఉత్పన్నవువ్వదు కనుక వాటిని రద్దుచేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ సవరణ ఇచ్చింది.

  పార్ట్  11 అందుబాటులో ఉన్న ఉన్నత విద్య
 

 క్లాజు 95: ఈ క్లాజులో కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్య విషయుంలో సవూన అవకాశాలు కల్పించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ, ఎరుుడెడ్, అన్‌ఎరుుడెడ్, ఉన్నత సాంకేతిక, వైద్య విద్యలో ప్రస్తుతవుున్న అడ్మిషన్ల విధానాన్నే పదేళ్లకు మించకుండా కొనసాగించాలి.
  సమైక్య రాష్ట్రంలో ఈ క్లాజులోని అంశాలు అనవసరం కనుక వీటిని తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సవరణ ప్రతిపాదించింది.

  పార్ట్  12 న్యాయు సంబంధ నిబంధనలు

 క్లాజు 96: ఈ క్లాజులో రాజ్యాంగంలోని 168వ పరిచ్ఛేదానికి సవరణ గురించి పొందుపరిచారు. అందులోని 1వ విభాగంలోని సబ్‌క్లాజ్ ‘ఎ’లోని జాబితాలో తమిళనాడు అనే పదం తర్వాత తెలంగాణ అనే పదాన్ని చేర్చాలి. క్లాజు 97: రాజ్యాంగంలోని 371(డి) అధికరణాన్ని వూరుస్తూ 168 పరిచ్ఛేదానికి సవరణ ప్రతిపాదన గురించి పేర్కొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పదానికి బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అనే పదాలను చేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆయూ రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, విద్య తదితర అంశాల్లో సవూనావకాశాలు కల్పించాలి. ఆయూ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు విభిన్న నిబంధనలు అవులు చేయువచ్చునని సూచించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల వారికి సవూన అవకాశాలు ఉండాలని రాజ్యాంగాన్ని సవరించి ఏడో షెడ్యూల్‌లో 371(డి) ని చేర్చారు.

 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగ సవరణ చేరుుంచారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఆమె వూట్లాడుతూ సింపుల్ మెజారిటీ ఉన్న సన్‌డ్రై (చిల్లరవుల్లర) ప్రభుత్వాలు ఈ రాజ్యాంగ సవరణకు వూర్పులు చేర్పులు చేయుకుండా ఉండేందుకే ఏడో షెడ్యూల్‌లో చేరేస్తున్నట్లు సభకు హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే రాజ్యాంగాన్ని పకడ్బందీగా సవరించారు. అనేక చిక్కువుుడులు ఉన్నారుు కాబట్టే ఇరు ప్రాంతాల్లోని ఉద్యోగులు, నిరుద్యోగులకు నష్టం జరిగే అవకాశవుుంది. కనుకనే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటోంది. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోని ఈ క్లాజ్ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా సమైక్య స్ఫూర్తికి కూడా విరుద్ధం కనుక దీన్ని తొలగించాలని ఆ పార్టీ సవరణ ప్రతిపాదించింది.

 క్లాజులు 98 నుంచి 108 వరకు:
 ఈ క్లాజుల్లో 1951 సంవత్సరపు 43వ చట్టంలోని 15 ‘ఎ’ సెక్షన్‌కు, 1956లోని 37వ నంబర్ చట్టంలోని 15వ సెక్షన్‌కు సవరణల గురించి పొందుపరిచారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూసంస్కరణల చట్టం, ఇతర చట్టాల అనుసరణకు అధికారం, ఇతర ప్రాంతాలకు విస్తరించడం, చట్టాల అన్వయుం, చట్టబద్ధ విధుల కోసం అధారిటీల ఏర్పాటు, పెండింగ్, ప్రొసీడింగ్‌ల బదిలీ, కొన్ని కేసులలో ప్రాక్టీసు చేయుడానికి న్యాయువాదులకు హక్కు తదితర అంశాలను పొందుపరిచారు.

 - సి.హెచ్.శ్రీనివాసరావు, ఆర్.ఎం.బాషా  (పొలిటికల్ బ్యూరో, సాక్షి)
 

No comments:

Post a Comment