సీఎం నిర్ణయం తప్పు... ఆయన ఉత్తర కుమారుడు
కవ్వింపు చర్యలకు రెచ్చిపోవద్దు
23 వరకు తెలంగాణ ప్రజలు నిగ్రహం పాటించాలి
మంత్రిపైన... శాఖపైన తెలంగాణ ఆధారపడి లేదు
అధిష్ఠానానికి భూమాతకున్నంత ఓపిక ఉంది
బిల్లులో లోపాలుంటే కోర్టుకెళ్లండి
సీనిÄర్ పార్లమెంటేరియన్‌గా చెబుతున్నా..
ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు
శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై జైపాల్ విమర్శనాస్త్రాలు

న్యూఢిల్లీ, జనవరి 1 : 'ఆయన విజ్ఞత పరిమితమైంది. మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం ద్వారా ఏదో బ్రహ్మాస్త్రం ప్రయోగించాననుకుంటున్నారు. సీఎంవి ఉత్తరకుమార ప్రగల్బాలు. ఆత్మవిశ్వాసం లేనివారే అడ్డంకులు సృష్టిస్తారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగడలు, వ్యూహాల వల్ల ఏమీ జరిగేది లేదు..ఒరిగేది లేదు. నా దృష్టిలో ఈ నిర్ణయానికి ఎలాంటి ప్రా ధాన్యం లేదు. జనవరి 23 రాత్రి 12 గంటల తర్వాత తెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ పని ముగుస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటివారంలో బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. తెలంగాణ ఏర్పాటు ఖచ్చితంగా జరుగుతుంది. కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు.' అని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి..సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై తనదైన శైలిలో అస్త్రాలను సంధించారు. శ్రీధరబాబు శాఖను మార్చడంపై ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మరో ఉద్యమం రాకుండా చూసేందుకే...
శ్రీధర్‌బాబు శాఖ మార్పు వల్ల తెలంగాణను అడ్డుకుంటున్నారని తెలంగాణ ప్రజలు ఆందోళన చెంది మరో ఉద్యమం ప్రారంభించకుండా చూసేందుకు, వారిలో విశ్వాసం కలిగించేందుకే తాను మాట్లాడుతున్నానన్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలకు తామే మాత్రం రెచ్చిపోబోమని స్పష్టం చేశారు. శ్రీధర్ బాబు శాఖ మా ర్పువల్ల తెలంగాణ ఆగిపోతుందన్న భ్రమ తనకు లేదన్నారు. ముఖ్యమంత్రికి ఒక మంత్రి శాఖను మార్చే హక్కు లేదని తాను అనడం లేదని, హక్కును ఎలా వాడుకుంటున్నారన్నది ప్రధానమని, రాష్ట్ర విభజనకు అడుగులు పడుతున్న సందర్భంలో సీఎం నిర్ణయం తప్పు.. బా«ధ్యతారాహిత్యం.. హాస్యాస్పదమని జైపాల్ స్పష్టం చేశారు. శాఖను మార్చడం ద్వారా కాలచక్రాన్ని ఎలా ఆపగలమని అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మంత్రిపైనా, శాఖపైనా తెలంగాణ ఏ ర్పాటు ఆధారపడి లేదని చెప్పారు.

వ్యూహాత్మకంగానే తెలంగాణ నేతల నిగ్రహం
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ నాయకులు వ్యూహాత్మకంగానే ఆత్మనిగ్రహంతో వ్యవహరిస్తున్నారని, జరుగుతు న్న పరిణామాలను వేయికళ్లతో గమనిస్తున్నారని జైపాల్ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఎం పీలు, రాష్ట్ర మంత్రులు సమైక్యంగా, సఖ్యంగా ఉన్నారని, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. జనవరి 23 వరకు ఓపికతో వేచి ఉండడం ముఖ్యమని ఆయన తెలంగాణ నేతలకు, ప్రజలకు సూచించారు.

సముద్రంలో అలలు ఎవరి కోసమూ వేచి చూడవు
తెలంగాణ వ్యతిరేకులు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తప్పుల తడకగా ఉందని, రాజ్యాంగపరమైన లోపాలు జరిగాయంటున్నారు, అలాంటప్పుడు వారు న్యాయస్థానానికి వెళ్లకుండా రాజ్యాంగ ప్రక్రియను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. 'సమయం, సముద్ర అలలు ఎవరికోసమూ వేచి చూడవు' అంటూ తెలంగాణ కూడా ఏ ఒక్కరి వల్లో ఆగిపోబోదన్నారు.
రాష్ట్ర విభజన బిల్లుపై ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పే చరిత్రాత్మక అవకాశం లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెండు ప్రాంతాల వారిని అభ్యర్థించారు. బిల్లుపై చర్చించకపోతే ప్రజలు నష్టపోతారన్నారు. నిజానికి అసెంబ్లీకి పంపకుండా కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్న సందర్భాలున్నాయని, పంజాబ్ అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉన్న కారణంగా అసెంబ్లీకి పంపకుండానే రాష్ట్రాన్ని విభజించారని జైపాల్ చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీకి చర్చి ంచే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పక్కదారి పట్టించేందుకు శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఎత్తుగడల వల్ల తెలంగాణ, సీమాంధ్రలోని సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు, మనస్పర్థలు కలుగుతాయని, ఇది మంచిది కాదన్నారు. దీని వల్ల ఎటువంటి లాభం చేకూరదన్నారు. మనస్పర్థలు పెంచేవారు దేశభక్తులు కాబోరని వ్యాఖ్యానించారు.

బిల్లును అడ్డుకునే విషయాన్ని పక్కనపెట్టి అసెంబ్లీలో చర్చించి, బిల్లులో లోపాల్ని సూచించాలని ఆయన సూచించారు. పార్లమెంట్ ఏ విషయంలోనూ గుడ్డిగా వ్యవహరించబోదన్నారు.అసెంబ్లీకి అభిప్రాయం చెప్పే హక్కు, అవకాశం, ధర్మం ఉన్నాయన్నారు. వీధుల్లో అరిచి, అసెంబ్లీలో నిద్రపోతే ప్రయోజనం ఏమిటన్నారు. అసెంబ్లీ తన గౌరవా న్ని కాపాడుకునే విధంగా వ్యవహరించాల్సి ఉం దన్నారు. రాజ్యాంగ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
చర్చ జరగనంతమాత్రాన తెలంగాణ ఆగిపోదని, అసెంబ్లీ తీర్మానం ఎలాఉన్నా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముం బైని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించినప్పటికీ పార్లమెంట్ దానికి ఒప్పుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర నేతలు రకరకాల అడ్డంకులు, అభ్యంతరాలు కల్పించడం వల్ల తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని, అంత మాత్రాన ఏర్పాటు క్రమం ఆగలేదన్నారు. అన్ని విషయాలు సక్రమంగా పరిశీలించి, చర్చించి, అందరికీ తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తీర్మానంపై చర్చ జరగలేదనే వారు, బిల్లు వచ్చినప్పుడు చర్చించకపోవడంలో అర్థం లేదన్నారు.
ముఖ్యమంత్రి ధిక్కారంపై అధిష్ఠానం ఎందుకు చర్య తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, అధిష్ఠానానికి భూమాతకున్న ఓపి క ఉందని వ్యాఖ్యానించారు. నిజానికి అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ చివరగా నిర ్ణయం తీసుకుందని చెప్పారు. సమగ్రంగా పరిశీలించిన తర్వాతే బా ధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. హోంమంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి చెప్పలేదని తప్పుపట్టిన వారే ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పుపడుతున్నారని, తాము వెనకడుగు వేస్తున్నారన్నారు. కొన్ని దశాబ్దాలుగా చర్చలు జరిగినా సంతృప్తి చెందకపోతే చేసేదేమీ లేదన్నారు.
ఫిబ్రవరిలోనే బిల్లుకు ఆమోదముద్ర
'సీనియర్ పార్లమెంటేరియన్‌గా, కేబినెట్ మంత్రిగా.. అనుభవంతో చెబుతున్నా.. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్రపడుతుంది' అని జైపాల్ స్పష్టం చేశారు. బీజేపీ పలుమార్లు పార్లమెంట్‌లోనే తెలంగాణ ఏర్పాటును డిమాండ్ చేసిందని, ఆ పార్టీ వెనక్కు వెళ్లే అవకాశం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి సీమాంధ్ర ప్రజలు మోసపోరని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందబోరని జైపాల్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ విలీనానికీ, తెలంగాణ ప్రక్రియకూ సంబంధం లేదని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment