Wednesday, 1 January 2014

శ్రీధర్‌బాబుకు షాక్

శ్రీధర్‌బాబుకు షాక్

Published at: 01-01-2014 07:11 AM
 2  2  0 
 
 

సభా వ్యవహారాలు తీసేసుకున్న కిరణ్
ఆ శాఖ సాకే శైలజానాథ్‌కు అప్పగింత
కొత్త ఏడాది ముందు సంచలన నిర్ణయం
శ్రీధర్‌తో తలనొప్పి అనే అనుమానమే కారణం
హైదరాబాద్, డిసెంబర్ 31 : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'బౌన్సర్' వదిలారు. కొత్త ఏడాది ముందు మంత్రి శ్రీధర్‌బాబుకు ఝలక్ ఇచ్చారు. 3వ తేదీ నుంచి విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనున్న అత్యంత కీలకమైన సమయంలో... దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి 'శాసనసభా వ్యవహారాల' శాఖను లాగేసుకున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ సిఫారసును గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి పంపించారు. ఆ సిఫారసును గవర్నర్ కూడా వెంటనే ఆమోదించారు. శ్రీధర్‌బాబు శాఖ మార్చడం ఒక సంచలనం! ఇంతకుమించిన సంచలనం ఏమిటంటే... ఏమాత్రం శషభిషలు, ఆలోచనలకు తావివ్వకుండా శాసనసభ వ్యవహారాల శాఖను సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా, సమైక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న సాకే శైలజానాథ్‌కు శాసనసభా వ్యవహారాలను అప్పగించారు. ప్రొరోగ్ వివాదం, విభజన బిల్లుపై చర్చకు శ్రీకారం... ఈ రెండు వివాదాల్లో తనను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారన్న కోపంతోనే శ్రీధర్‌బాబుకు సీఎం కిరణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందు సభ ప్రొరోగ్ కాలేదు. బిల్లు రాష్ట్ర శాసనసభకు రానున్న నేపథ్యంలో... సభను ప్రొరోగ్ చేయించాలని, తర్వాత సభను ఎప్పుడు సమావేశ పరచాలనే నిర్ణయాధికారాన్ని తన చేతిలోకి తీసుకోవాలని సీఎం భావించారు. ప్రొరోగ్ చేయాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. ఇది... తెలంగాణ నేతలకు గుస్సా తెప్పించింది. 'ప్రొరోగ్‌కు ఒప్పుకునేది లేదు. ఒకవేళ స్పీకర్ లేఖ పంపించినా... శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆ ఫైలును నా దగ్గరే పెండింగ్‌లో పెడతాను' అని శ్రీధర్‌బాబు బహిరంగంగా ప్రకటించారు.
అంతేకాదు... స్పీకర్ నుంచి వచ్చిన ఫైలును పెండింగ్‌లో పెట్టి చూపించారు కూడా! దీంతో... సభ ప్రొరోగ్ కాకుండా ఆగిపోయింది. కిరణ్ వ్యూహానికి గండి కొట్టినట్లయింది. చివరికి... మంత్రివర్గం సమావేశమై శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం నిర్ణయించింది. ఇలా 'ప్రొరోగ్' విషయంలో శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌తో 'ఢీ అంటే ఢీ' అన్నారు. ఆ తర్వాత... రాష్ట్రపతి నుంచి సభకు ముసాయిదా బిల్లు వచ్చింది. డిసెంబర్ 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అదేరోజు సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్క స్పీకర్ స్థానంలో ఉండగా... బిల్లుపై చర్చకు శ్రీకారం చుట్టడంపై 'చిన్నపాటి డ్రామా' నడిచింది. శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో మంత్రి శ్రీధర్‌బాబు బిల్లుపై చర్చ చేపట్టాలని కోరడం... ఆ వెంటనే స్పీకర్ స్థానంలో ఉన్న భట్టి విక్రమార్క విపక్షనేత చంద్రబాబు పేరు పిలవడం, ఆ వెంటనే సభను వాయిదా వేయడం జరిగిపోయింది. దీంతో... బిల్లుపై చర్చ మొదలైందా? లేదా? అనే మీమాంస, వివాదం తీవ్రస్థాయిలోనే చెలరేగింది. సాంకేతికంగా చర్చ ప్రారంభమైనట్లుకాదని ఒక వర్గం చెబుతుండగానే... శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్‌బాబు 'చర్చ మొదలైంది' అని ప్రకటించారు. ప్రొరోగ్ వ్యవహారంతో శ్రీధర్‌బాబుపై 'గుస్సా'గా ఉన్న కిరణ్‌కు చర్చ వివాదం మరింత కోపం తెప్పించింది. మరోవైపు... మూడో తేదీ (శుక్రవారం) నుంచి విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇలాంటి సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ శ్రీధర్‌బాబు వద్ద ఉంటే తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన శాఖను మార్చినట్లు తెలుస్తోంది. శ్రీధర్‌బాబుకు ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖల్లో ఒకటైన వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు.
సమన్వయం కోసమే!
శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై ముఖ్యమంత్రి వర్గీయుల తమ కోణంలో వాదన వినిపిస్తున్నారు. "నిజానికి... రాష్ట్రపతి నుంచి విభజన ముసాయిదా బిల్లు వచ్చిందని, దీనిపై చర్చ జరపాల్సి ఉందని అన్ని శాసనసభా పక్షాల అభిప్రాయం కోరుతూ శాసనసభా వ్యవహారాల మంత్రి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ, శ్రీధర్‌బాబు నేరుగా చర్చ మొదలైందని ఏకపక్షంగా చెప్పేశారు. ఇది సమంజసం కాదు'' అని సీఎం సన్నిహితులు పేర్కొంటున్నారు. శాసనసభ నడిపేందుకు నియమ నిబంధనలు, సంప్రదాయాలు ఉంటాయని... ప్రాంతాలు, వివాదాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా వాటిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రికి, శాసనసభ వ్యవహారాల మంత్రికి మధ్య సభలో సమన్వయం అత్యంత అవసరమని, అది లేకుండా సభను నడిపించడం కష్టమని చెబుతున్నారు. అందువల్లే శ్రీధర్‌బాబు శాఖ మార్చినట్లు పేర్కొంటున్నారు. వాణిజ్యపన్నుల శాఖ కూడా కీలకమైనదేనంటూనే... 'ఆ శాఖను శ్రీధర్‌బాబు తీసుకుంటారా? లేదా? వేచి చూడాల్సిందే' అని ఓ నేత అన్నా
- See more at: http://www.andhrajyothy.com/node/49139#sthash.dLyZvexc.dpuf

No comments:

Post a Comment