Friday, 3 January 2014

తెలంగాణ ఆల్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ ఆల్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు : జానారెడ్డి

Published at: 03-01-2014 17:30 PM
 1  1  0 
 
 

హైదరాబాద్, జనవరి 3 : తెలంగాణ ఆల్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను శ్రీధర్‌బాబకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్‌క్లబ్ హౌస్‌లో అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది, ఈ భేటీకి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
సమావేశం ముగిసిన అనంతరం మంత్రి జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్‌బాబును శాఖ నుండి తప్పించడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశామని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకు వెళతామని అన్నారు. సిద్ధాంతాలు వేరైనా తెలంగాణ ఏర్పాటు «ధ్యేయంగా అన్ని పార్టీల నేతలం కలిసి పనిచేస్తామని, తెలంగాణ కోసం ఒకే మాటపై అసెంబ్లీలో పనిచేస్తామని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా చర్చను ప్రజల దృష్టికి తీసుకువెళతామని, తెలంగాణకు ఎవరు అడ్డుపడుతున్నారో ప్రజల ముందు ఉంచుతామని జానారెడ్డి స్పష్టం చేశారు. శ్రీధర్‌బాబును శాఖ నుండి తప్పించడం పెత్తందారి పోకడగా ఆయన అభివర్ణించారు. ఈ విషయమై ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవాలని సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల వ్యుహాలకు తమ వద్ద ప్రతివ్యూహాలు ఉన్నాయన్నారు.
తీర్మానాలు ...
ఈ భేటీలో తెలంగాణ ప్రాంత నేతలు ప్రధానంగా రెండు తీర్మానాలు చేశారు. శాసన సభ వ్యవహారాల నుండి శ్రీధర్ బాబును తప్పించడాన్ని ఖండిస్తూ మొదటి తీర్మానం చేశారు. ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవాలని రెండో తీర్మానం చేశారు. సిపిఎం, మజ్లిస్, సిపిఐ పార్టీలతోను చర్చించాలని నిర్ణయించారు. కో ఆర్డినేషన్ కమిటీ భేటీలో కో ఆర్డినేషన్ కమిటీని వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో కాంగ్రసెసు పార్టీ నుండి గండ్ర వెంకటరమణ, శ్రీధర్ బాబు, టిడిపి నుండి ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్ఎస్ నుండి ఈటెల రాజెందర్, హరీష్ రావు, బిజెపి నుండి నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణలు ఉన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/50070#sthash.VGP7IT2b.dpuf

No comments:

Post a Comment