Wednesday, 15 January 2014

మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుంది

మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుంది : చంద్రబాబు నాయుడు

Published at: 14-01-2014 19:02 PM
 5  0  1 
 
 

చిత్తూరు, జనవరి 14 : భారతీయులకు పూర్వవైభవం వచ్చేటట్లుగా ప్రపంచమొత్తం గుర్తింపేకాదు, రెండు, మూడు దేశాల్లో భారతదేశం విడిదిచేయడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా ఉంటుందని, మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుందని, పూర్వవైభవం వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సొంత జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే, 30 స్థానాల్లో ఎలా గెలుస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తిరిగి ప్రశ్నించారు.
సీఎం కొత్త పార్టీపై ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ కరువు, వరదలు వస్తే ఎక్కడికి వెళ్ళరు, ఏమీ చేయరు, ఏ పనీ చేయలేరు అసమర్థ సీఎంకు పార్టీపై ఆశ పుట్టింది, పెట్టని చూద్దాం, రాజకీయంలో ఆటలు, క్రీడలు అన్నీ ఉంటాయి. ఈ రాజకీయ క్రీడలను ప్రజలు ఆలోచించాలని అన్నారు. కిరణ్‌కు ఓ చరిత్ర ఉంది, జాక్‌పాట్ కొట్టారు, సీల్డు కవర్ ముఖ్యమంత్రి అయ్యారు. మూడేళ్లలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
తెలుగుదేశానికి ఓ చరిత్ర ఉంది, నేను, మా నాయకుడు ఎన్టీరామారావు చేయాల్సింది చేశాం, రికార్డ్ సృష్టించామని చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చుని ఎకరాకు కోటి రూపాయాల సంపాదిస్తానని అన్నారు. ఆ కిటుకు అందరికి చెప్పమంటే అది చెప్పారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తండ్రిని అడ్డం పెట్టుకుని రూ. లక్ష కోట్లు సంపాదించారని బాబు విమర్శించారు. దానికి ఏమంటే ఎవరు అవినీతిపరుడు కాదంటారని అంటాడన్నారు. వీటన్నిటినీ ప్రజలు ఆలోచించుకోవాలని, మీ జీవితాల్లో వెలుగు కవాలా? చీకటి కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ ఎప్పుడు కూడా అస్థిరతకు చోటు ఇవ్వకుండా, స్వార్థానికి చోటివ్వకుండా, ఒక సుస్థిరమైన గవర్నమెంట్, నీతివంతమైన ప్రభుత్వం కోసం మేం దోహదం చేశామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు వాడుతున్న సెల్‌ఫోన్లు, నేషనల్ హైవేస్, ఎయిర్‌పోర్టు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్ని తెలుగుదేశం చొరవేనని ఆయన అన్నారు. దాని వల్ల సంపద వచ్చిందని, తనకు ఏ ఆశలేదని, పదవిపై వ్యామోహం అంతకంటే లేదని స్పష్టం చేశారు. అప్పుడు ప్రధానిని చేస్తానంటే రెండు సార్లు వద్దేనే చెప్పానని అన్నారు. ఈ రాష్ట్రం, తెలుగుజాతి ముఖ్యమని, ఒక అజెండా ఉందని, అది చేయాలని వచ్చానని అన్నారు. అప్పుడు గానీ, ఇప్పుడు గానీ అధికారం ముఖ్యమం కాదని, సమాజం బాగుపడాలని, దేశం బాగుపడాలని, పేదరికం పోవాలని, రైతులు ఆనందంగా ఉండాలని, యువతకు ఉద్యోగాలు రావాలని, అవినీతి రహిత భారత దేశం కోసం కృషి చేస్తామని, మాటల్లో కాదు, చేతల్లో చూపుతామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/54297#sthash.77EMwlHe.dpuf

No comments:

Post a Comment