ఆరు నూరైనా తెలంగాణ ఆగదు
ఆట ముగిసింది..అంతిమ విజయం తెలంగాణదే
బిల్లు పాస్ కావడానికి సాధారణ మెజారిటీ చాలు
సీఎంకు పరమ దుర్మార్గ, కిరాతక బిరుదు ఇవ్వాలి
రాష్ట్రం వచ్చాక కిరణ్,బాబు,జగన్లకు సత్కారం:కేసీఆర్
బిల్లు పాస్ కావడానికి సాధారణ మెజారిటీ చాలు
సీఎంకు పరమ దుర్మార్గ, కిరాతక బిరుదు ఇవ్వాలి
రాష్ట్రం వచ్చాక కిరణ్,బాబు,జగన్లకు సత్కారం:కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 : ఆరు నూరైనా, సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీకి మోకాళ్లపై నడిచి వెళ్లినా రాష్ట్ర విభజనను ఆపలేరని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. "ఆట ముగిసింది. అంతిమ విజయం తెలంగాణదే. మిగిలిందల్లా బిల్లులో సవరణలు చేయించుకోవడమే. అందుకు అందరం కలిసి ఢిల్లీకి వెళదాం. రాయల తెలంగాణను అడ్డుకోవడంలో విజయం సాధించినట్లే బిల్లులో సవరణలు సాధించుకుందాం'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయ ఆవరణలో గురువారం సంఘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు తెలంగాణ విడిపోతే తమ పరిస్థితి ఏమిటని సీమాంధ్రవారు అంటున్నారని, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే తెలంగాణను కబళించడానికి కుట్రలు ప్రారంభమయ్యాయని చెప్పారు. "ఇప్పుడు మాట్లాడుతోన్న కిరణ్ కొత్తోడు కాడు. పాతోడే. అందుకే లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే అని నేను అప్పుడే చెప్పా. జయప్రకాశ్ నారాయణ్, చంద్రబాబు, కిరణ్.. వీరందరి రంగులు బయటపడిపోయాయి. అందరూ తెలంగాణను దోపిడీ చేయాలనుకునేటోళ్లే. రాష్ట్రం విడిపోతే మాకు లోటు బడ్జెట్ అవుతుందని కిరణ్ చెబుతుండు.
అంటే విడిపోతే అడుక్కు తిందామని, విడిపోకపోతే దొబ్బి తిందామనా?'' అని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బిల్లును తప్పనిసరిగా పార్లమెంటులో పాస్ చేయిస్తామని బీజేపీ అగ్రనేత ఆడ్వాణీ స్పష్టం చేశారని, అధికార పక్షం, ప్రతిపక్షం అనుకున్నాక తెలంగాణను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. "పార్లమెంటులో బిల్లు పాస్ కావాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలంటున్నారు. కానీ, అది అవసరం లేదు. 55 మంది సభకు వస్తే కోరం ఉన్నట్లు భావించి సభను నడిపిస్తారు. ఈ 55 మంది సభ్యుల్లో 28 మంది ఓటేసినా.. సాధారణ మెజారిటీలో బిల్లు పాస్ అయిపోతుంది. ఇప్పటికే 33 పార్టీలతో మాట్లాడా. ఒక్క సీపీఎం, సమాజ్‌వాదీ తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంటుకు వెళ్లినప్పుడల్లా చాలా మంది ఇతర పార్టీల నేతలు 'క్యా రావ్ సాబ్! తుమారా తెలంగాణ క్యా హువా?' అని ప్రశ్నిస్తున్నారు. నేను చెబుతున్నా.. ఏ బిల్లుకు రానంత అత్యధిక మెజారిటీతో రాష్ట్ర విభజన బిల్లు పాస్ అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ కూడా బిల్లును ఆపలేవు'' అని తెలిపారు. ఆర్టికల్ -3 గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారని, రాష్ట్రాల విభజన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి నియంతృత్వం ఉండకూదన్న ఉద్దేశంతో అంబేద్కర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న క్లాజు పెట్టారని చెప్పారు. "ఈ అంశంపై అంబేద్కర్ రాత్రి 12 గంటల వరకు నిద్ర పోకుండా ఆలోచించి ఒక నోట్‌ను తయారు చేసి మిగతా సభ్యులకు చూపించారు. వారందరూ ఒప్పుకొన్నారు. రాష్ట్రాల్లో ఉప ప్రాంతాలు ఉంటాయని, ఒకానొక సందర్భంలో ఆ స బ్ రీజియన్ ప్రజలు కష్టపడితే ఉద్యమాలకు దిగే అవకాశం ఉందని అంబేద్కర్ యోచించారు. చివరకు అవి దేశంలో అంతర్యుద్దాలకు దారి తీస్తాయన్న ఆందోళనతో.. రాష్ట్రాల విభజన అధికారాలు కేంద్రం వద్దే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్-3ని రాజ్యాంగంలో జొప్పించారు. మరికొంత మంది కోర్టుల ప్రస్తావన తెస్తున్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు ముంబైని గుజరాత్ వాళ్లు అడిగారు. కోర్టుకు కూడా వెళ్లారు. కానీ విభజనపై సంపూర్ణ అధికారం కేంద్రానిదేనని కోర్టు స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు తెలంగాణను ఎవరూ ఆపలేరు. 23 తర్వాత పార్లమెంటుకు బిల్లు పంపించక తప్పదు. పార్లమెంటులో బిల్లు పాసయ్యాక సీఎం కిరణ్ పిల్లిమొగ్గలేస్తాడో, ఏడుస్తాడో, చంద్రబాబు ఏడుస్తాడో వారిష్టం'' అని అన్నారు.
కిరణ్.. ఏం చూస్తావ్!?: "సీఎం కిరణ్ ఈ విషయాలన్నీ చదువుకోడా? నా అంత సిపాయి లేడన్నట్లు మాట్లాడుతుండు. చిటికెన వేలు గోరంత కాడు కిరణ్. ఆయన ఎన్ని ప్లాన్లు వేసినా.. ఆయన అయ్య జుట్టులోకి వెళ్లేంత ప్లాన్ మాకుంది. కిరణ్ పని అయిపోయింది. జనవరి 23 వరకు ఆయన బ్రాకెట్‌లో ఉన్నాడు. ఏదో చూస్తానంటున్నాడు. క్యా దేక్తా, కిదర్ దేక్తా? నీతోని ఏం కాదు. తమిళనాడు నుంచి మీరు ఎలా కొట్లాడి బయటకు వచ్చారో ఒకసారి చరిత్ర చూడండి. అప్పుడు మీరు మైనారిటీలో ఉండి, తమిళనాడు వాళ్లు మెజారిటీలో ఉన్నారు. వాళ్ల ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. మీరు చెప్పే సూత్రం ప్రకారం తెలంగాణ ఇవ్వాలి కదా. కిరణ్‌కు ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఏం చదివాడు. బీకాం చదివాడా? ఆయన కుర్చీకైనా గౌరవమివ్వడం లేదు. చాలా దుర్మార్గుడు. ఆయనకు పరమ దుర్మార్గ కిరాతక బిరుదు ఇవ్వాలి. తెలంగాణ వచ్చాక కిరణ్, బాబు, జగన్లకు సత్కారం చేసి పంపాలి. అది మరిచిపోలేని విధంగా ఉండాలి'' అని కేసీఆర్ అన్నారు.
అప్రమత్తంగా ఉందాం
తెలంగాణ బిల్లులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, దానిలో సవరణల కోసం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. "జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లను విభజిస్తామంటున్నారు. దీనిని ఒప్పుకోవద్దు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేశాక కూడా లగడపాటి ఇంకా విభజనను ఆపుతామని చెప్పాడు. అలాంటి వారి ఆశలన్నీ పటాపంచలయ్యాయి. రాయలసీమ జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన వచ్చింది. కానీ విద్యార్థులు రోడ్లపైకి రావడంతో సోనియా గాంధీ ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టండని చెప్పారు'' అని వివరించారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని, అందరం కలిసి ఢిల్లీకి వెళదామని, బిల్లులో సవరణలు చేయించుకోవడానికి కేంద్ర పెద్దలను కలిసి వివరిద్దామని చెప్పారు. "శుక్రవారం జానారెడ్డి, ఈటెల ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో నిర్ణయిస్తారు. తెలంగాణ కోసం మళ్లీ లడాయి అవసరమైతే నేను చచ్చిపోయానా? యుద్ధం చేయాల్సి వస్తే అందరం ఒక్కటై చేద్దాం. జానారెడ్డి, నేను ఇప్పటికీ కలిసే ఉన్నాం'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ బిల్లులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, దానిలో సవరణల కోసం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. "జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లను విభజిస్తామంటున్నారు. దీనిని ఒప్పుకోవద్దు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేశాక కూడా లగడపాటి ఇంకా విభజనను ఆపుతామని చెప్పాడు. అలాంటి వారి ఆశలన్నీ పటాపంచలయ్యాయి. రాయలసీమ జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన వచ్చింది. కానీ విద్యార్థులు రోడ్లపైకి రావడంతో సోనియా గాంధీ ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టండని చెప్పారు'' అని వివరించారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని, అందరం కలిసి ఢిల్లీకి వెళదామని, బిల్లులో సవరణలు చేయించుకోవడానికి కేంద్ర పెద్దలను కలిసి వివరిద్దామని చెప్పారు. "శుక్రవారం జానారెడ్డి, ఈటెల ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో నిర్ణయిస్తారు. తెలంగాణ కోసం మళ్లీ లడాయి అవసరమైతే నేను చచ్చిపోయానా? యుద్ధం చేయాల్సి వస్తే అందరం ఒక్కటై చేద్దాం. జానారెడ్డి, నేను ఇప్పటికీ కలిసే ఉన్నాం'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అధికారపక్షం,ప్రతిపక్షం అనుకున్నాక
ఎవరూ ఆపలేరు
కిరణ్, బాబు మోకాళ్లపై అసెంబ్లీకి నడిచి వెళ్లినా ఆపలేరు
సీఎంకు పరమ దుర్మార్గ,కిరాతక బిరుదు
జనవరి 23 వరకూ బ్రాకెట్లో ఉన్నాడు
రాష్ట్రం వచ్చాక కిరణ్,బాబు,జగన్‌కు 'సత్కారం' చేద్దాం : కేసీఆర్
ఎవరూ ఆపలేరు
కిరణ్, బాబు మోకాళ్లపై అసెంబ్లీకి నడిచి వెళ్లినా ఆపలేరు
సీఎంకు పరమ దుర్మార్గ,కిరాతక బిరుదు
జనవరి 23 వరకూ బ్రాకెట్లో ఉన్నాడు
రాష్ట్రం వచ్చాక కిరణ్,బాబు,జగన్‌కు 'సత్కారం' చేద్దాం : కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 : త్వరలో ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై కేవలం రైతులకే కాకుండా, యువతకు, విద్యార్థులకు విశ్వాసం కలిగేలా చేస్తామని చెప్పారు. తెలంగాణలో సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, నాలుగు (ఎర్ర, నల్ల, తేలికపాటి, ఇసుక) రకాల నేలలు, సరిపడా వర్షపాతం ఉన్నందున.. విద్యార్థులు సైతం వ్యవసాయంలో అడుగుపెట్టేలా ఆ రంగానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వాలు గ్రీన్ హౌస్ సాగుకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదని కేసీఆర్ విమర్శించారు. తాము మాత్రం గ్రీన్ హౌస్ సాగును బాగా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణలోని 10 జిల్లాల్లో జిల్లాకు 20 చొప్పున 200 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా గ్రీన్‌హౌస్ సాగును అమలు చేయిస్తామని చెప్పారు. "ఇక్కడి వాతావరణ పరిస్థితులు విత్తన ఉత్పత్తికి అనుకూలం. రాష్ట్ర విభజన జరిగితే విత్తన ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ఈ విషయాన్ని వ్యవసాయ రంగ నిపుణులే చెబుతున్నారు'' అన్నారు. ఈ ఏర్పాట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రతి దళిత కుటుంబానికీ 3 ఎకరాల భూమి ఇస్తామని తాము ఉత్తగనే చెప్పలేదని, సాగునీరు సహా అన్ని వసతులను అందులో కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ చెప్పిన మిగిలిన అంశాలు ఆయన మాటల్లోనే..
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో మా అబ్బాయికి (సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్) 30 ఎకరాలు, నాకు 29-30 ఎకరాల భూమి ఉంది. చాలా ఏళ్ల క్రితం జహంగీర్ అనే నా క్లాస్‌మేట్ కొనమంటే ఇక్కడ భూమి కొన్నాను. తర్వాత రాము (కేటీఆర్) అమెరికా నుంచి వచ్చాక ఇక్కడే భూమి కొన్నాడు. మేం కొన్నప్పుడు ఎకరా ధర రూ.1లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఎకరా రూ.5 లక్షల ధర పలుకుతోంది. చాలా కాలం భూమిని ఖాళీగానే పెట్టాం. ఒకసారి ఇటువైపు వచ్చినప్పుడు నాతో ఉన్న పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి..'ఎందుకన్నా.. భూమి ఖాళీపెడ్తావ్.. పొతం చేసి ఏదన్న పంట వేయచ్చు కదా?' అని అన్నారు. దాంతో సిద్దిపేటకు చెందిన మా పిలగాడు పరమేశ్వర్.. భూమి పొతానికి ముందుకు వచ్చాడు. మూడేళ్ల కిందట మొదట ఆనపకాయ సాగు చేస్తే, దండిగా కాసింది. ఒక్క వరుసలో 2వేల కాయలు కాశాయి.
ఎకరాకు రూ.18-20 లక్షలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో ఆలుగడ్డలు సాగు చేస్తే రూ.6 లక్షల రాబడి వచ్చింది. మొక్కజొన్న సాగు చేస్తే వెయ్యి క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పది ఎకరాల్లో కాకరకాయ వేస్తే ఎకరాకు రూ.7-8 లక్షల లాభం వచ్చింది. కొంత విస్తీర్ణంలో పసుపు పంటను సాగు చేశాం. మొత్తంమ్మీద రూ.1.5-2 కోట్ల లాభాలు వచ్చాయి. ఇది తొలి ఏడాదిన్నర, రెండేళ్లలో జరిగిన ప్రక్రియ. దీంతో మొదట బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.43 లక్షల అప్పు తీరిపోయింది. మిగిలిన సొమ్ముతో..స్టాఫ్ క్వార్టర్లు కట్టించాం. పాడి గేదెలు కొనుగోలు చేశాం. మళ్లీ పంట పెట్టుబడిగా వినియోగించుకున్నాం. బ్యాంకు నుంచి తిరిగి రూ.3 కోట్ల రుణం తీసుకున్నాం. ఇప్పుడు రోడ్లు, గ్రీన్‌హౌస్ లేఅవుట్, ఇతర వసతుల ఏర్పాటుకు ఐదారు ఎకరాలు వదిలేశాం. నికరంగా 55 ఎకరాల్లో పంట సాగు చేపట్టాం. సాగునీటి కోసం ఎకరం విస్తీర్ణంలో 60 అడుగుల లోతుతో పెద్ద బావి తవ్వించాం. చుట్టుపక్కల నుంచి వర్షపు నీరంతా వృథా కాకుండా అందులోకి చేరుతుంది. బావిలోనే మూడు బోర్లు వేయించాం.
ఇప్పుడు బావిలో 45 అడుగుల మేర నీళ్లున్నాయి. దీంతో మా వ్యవసాయ క్షేత్రంతోపాటు, చుట్టుపక్కల కూడా భూగర్భ జలాలు పెరిగాయి. ఆరు బోర్లు కూడా వేయించాం. 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్ నిర్మించాం. ప్రస్తుతం 45 ఎకరాల విస్తీర్ణంలో ఆలుగడ్డ సాగు చేశాం. మరో 10 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసి నామ్‌దారి రకం కలర్ క్యాప్సికమ్ సాగు చేశాం. అందులో 60 శాతం రెడ్ క్యాప్సికమ్, 40 శాతం ఎల్లో క్యాప్సికమ్. కేవలం వర్షాధారంపై ఆధారపడితే ఇంత విస్తీర్ణంలో సమర్థంగా ఆలుగడ్డ, క్యాప్సికమ్ సాగు వీలయ్యేది కాదు. గట్ల వెంట 960 కొబ్బరి చెట్లు నాటాం. ఒక ఎకరం మామిడి తోట పెట్టాం. అంతర పంటగా కొత్తిమీర, పాలకూర, టమోటా, మిర్చి వేశాం. ప్రహరీ వెంట బీర, కాకర, ఆనపకాయ వేశాం. మొత్తం ఇక్కడ 22 కుటుంబాలు నిత్యం పనిచేస్తున్నాయి. మరో ఎనిమిది కుటుంబాలు రోజు బయటి నుంచి వచ్చి వెళ్తాయి. ఇక్కడ పండిన వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని పనిచేసే వారికి అందజేస్తున్నాం. ఇక్కడున్న వారికి ప్రతి రోజు అర లీటర్ పాలు ఇస్తున్నాం. ఆరోగ్య సమస్యలు వస్తే తీరుస్తున్నాం. వారి పిల్లలను స్కూల్‌కు పంపిస్తున్నాం.
విద్యాధికులూ సాగు చేయాలి
విద్యాధికులూ సాగు చేయాలి
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సమాజంలో చిన్నచూపు ఉంది. పట్టభద్రుల్లో చాలా మంది పొలానికి వెళ్లటానికి ఇష్టపడటంలేదు. ఉద్యోగమే కావాలి..వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి అవసరం అని ఆ రంగంపై దృష్టి సారించటంలేదు. కానీ ఆధునిక పద్ధతులు అనుసరిస్తూ..కన్సల్టెన్సీలను పెట్టుకొని వారిచ్చే సూచనలు పాటిస్తే వ్యవసాయం తప్పక లాభసాటే. ఈమధ్య బీహార్ రాష్ట్రం నలంద ప్రాంతానికి చెందిన రాకేష్ అనే రైతు ఎకరాకు 44.3 టన్నుల ఆలుగడ్డలు పండించి ప్రపంచ రికార్డు సాధించారు. సాగు పద్ధతులు మార్చుకోవటం వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు డ్రిప్ పద్ధతిలో వరి కూడా పండిస్తున్నారు. సాధారణంగా ఎకరాకు సరిపోయే వర్షాధార, వరద నీరును డ్రిప్ ద్వారా అయితే ఐదున్నర, ఆరు ఎకరాల వరిని సాగులోకి తీసుకురావచ్చు. వ్యక్తిగతంగా రైతులను ప్రోత్సహిస్తే సోలార్ సిస్టమ్ వల్ల కూడా లాభం ఉంటుంది. సాల్విన్ అనే కంపెనీ మా క్షేత్రంలో ప్రచారం కోసం ఉచితంగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఒక బోర్‌వెల్‌ను అనుసంధానం చేసింది. ఇది సక్సెస్ అయ్యింది. మార్కెటింగ్ సదుపాయాలు సరిగా లేకపోవటం కూడా రైతులను నిరుత్సాహపరుస్తోంది.
నీళ్లు ఇలా పెడితే మేలు!
ఇజ్రాయిల్‌కి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రూ.15 లక్షల 'నెటాజెట్' పరికరాలు ఆటోమేటిక్ డ్రిప్ ఇరిగేషన్‌ను నిర్వహిస్తాయి. కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామ్‌ను ఫిక్స్ చేస్తే..మొక్కలకు దశల వారీగా కావాల్సిన నీటిని, ఆ నీటిలో కరిగే ఎరువులు, ఇతర పోషకాలకు డ్రిప్ పద్ధతిలో అందిస్తుంది. దీంతో పంటలో మొదటి మొక్కకు ఎటువంటి పోషకాలు, నీరు అందుతాయో..చివరి మొక్కకు కూడా అంతే స్థాయిలో అందుతాయి. ఈ మధ్య ఇక్కడికి సాంగ్లీ నుంచి రైతులు వచ్చారు. ఒకేసారి ఎక్కువ నీళ్లు అందిస్తే, అందులో కలిసిన ఎరువులు పంటకు కాకుండా భూమిలోకి ఇంకిపోతాయని చెప్పారు. మొక్కలకు కావాల్సిన పోషకాలను ప్రతి రోజూ అందించాలని చెప్పారు. దాంతో నేను..'పంటకు ఒకేసారి ఎరువు వేస్తే సరిపోదా ?' అన్నాను. బదులుగా వారు..'ఆరు రోజులు తినే భోజనాన్ని ఒక్క రోజే తింటే ఎలా ఉంటుంది ?' అని ప్రశ్నించారు. అంటే సరైన పద్ధతులు పాటిస్తే వ్యవసాయమూ లాభసాటే!
నాయన వల్లే వ్యవసాయంపై ఆసక్తి
మా నాయన వ్యవసాయం చేసేవారు. ఆయన నుంచే నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు దానినే వృత్తిగా ఎంచుకున్నా. మా నాయన వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయ అధికారి సైకిల్‌పై తిరిగే వారు. మా ఇంటికి వచ్చి పంటలు ఎలా సాగు చేయాలో రెండు, మూడు రోజులు ఉండి మరి చెప్పి వెళ్లే వారు. మధ్యలో వచ్చి పంటల పరిస్థితి తెలుసుకొని, తగిన సూచనలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఏవోలు విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీకి పరిమితమవుతున్నారు. విస్తరణ కార్యక్రమాలు కరువయ్యాయి. భవిష్యత్తు అవసరాలరీత్యా ఆహార రంగానికి దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యమైన తరంవస్తుంది. ఇందుకోసం ప్రభుత్వమే విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించి, సేకరించి, దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాలి. నేను వ్యవసాయం చేస్తుండటం వల్ల చుట్టుపక్కల రైతులు స్ఫూర్తి పొందుతున్నారు.
No comments:
Post a Comment