డానీ నోట్స్
7 జనవరి 2014
చర్చ రచ్చ
మనోళ్ళు చాలా తెలివైనవాళ్ళు. అసెంబ్లీ హాలులో స్పీకర్ పోడియం ముందు రచ్చ చేస్తారు. బయట మీడియా పాయింటు దగ్గర కొచ్చి చర్చ చేస్తారు. దీనికో పరిష్కారం వుంది. మీడియా పాయింటును అసెంబ్లీ హాలుగా మార్చాలి. అసెంబ్లీ హాలును మీడియా పాయింటుగా మార్చాలి.
డానీ నోట్స్
7 జనవరి 2014
పార్టీలన్నీ దుకాణాలే
దుకాణం తెరిచే వుంచుకోవాలని సిపిఐ నారాయణ ఆనాడే చిరంజీవికి చెప్పారట. దుకాణం అంటే పీఆర్పీ ఒక్కటే అకోవాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలన్నీ దుకాణాలే! చిరంజీవిది కాస్త బార్లాతెరిచిన దుకాణం. మిగిలిన వాళ్ళది కొంచెం చాటుగా నడిపే దుకాణాలు. అదొక్కటే తేడా. మిగిలిందంతా సేమ్ టూ సేమ్. చిరంజీవి రాజకీయాలకు కొత్తగనుక ఔట్ రైట్ గా అమ్మేసి చేతులు దులుపుకున్నారు. మిగిలినోళ్ళు సీజన్డ్ పొలిటీషియన్స్ కనుక సీజన్ కు ఒకరికి లీజుకు ఇచ్చుకుని లాభాలు పండించుకుంటున్నారు.
డానీ నోట్స్
7 జనవరి 2014
విజయవాడ ప్రయాణం
రాత్రికి విజయవాడ వెళుతున్నా. బుధ, గురువారాలు అక్కడే వుంటా. బుధవారం కుటుంబపనులు చూసుకోవాలి. గురువారం సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ లో చోరగుడి జాన్సన్ రచన ’స్వంత సంతకం’ పుస్తకావిష్కరణ సభకు వెళ్ళాలి.
డానీ నోట్స్
7 జనవరి 2014
విరసం సభలు
విరసం మహాసభలు జనవరి 11, 12 తేదీల్లో వరంగల్లులో జరుగుతున్నాయి.
నేను విరసంతో వున్నాను. 12 ఆదివారం వరంగల్ వెళ్ళాలనేది ఆలోచన.
డానీ నోట్స్
7 జనవరి 2014
ఆత్మహత్యలు
ఆత్మహత్యలకు సారాంశంలో సామాజిక కారణాలు మాత్రమే వుంటాయి.
ఆర్ధిక, మానసిక, జీవధర్మ కారణాలన్ని పైకి కనిపించేవి మాత్రమే!
సమాజంలో సంఘీభావం తగ్గినపుడు ఆత్మహత్యలు పెరుగుతాయి.
ఏ సమాజంలో అయినా సంఘీభావాన్ని కొలవడానికి ఆత్మహత్యలు ఒక కొలమానం.
డానీ నోట్స్
10 జనవరి 2014
విజయవాడ ప్రయాణం
తాత్విక ధోరణిలో సాగింది విజయవాడ ప్రయాణం. కొన్ని ఆనందాలు. కొన్ని ఇబ్బందులు.
చోరగుడి జాన్సన్ పుస్తక ’సొంత సంతకం’ ఆవిష్కరణ, సి. రాఘవాచారిగారి ఉపన్యాసం. బుక్ ఎగ్జిబిషన్ లో శ్రీశ్రీ విశ్వేశ్వరరావు, సయ్యద్ రఫిలని కలవడం ఈ ట్రిప్ లో ఆనందాలు. బ్యాంకు పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందుల పరిష్కారం కోసం సమయం సరిపోలేదు. ఇతర మిత్రుల్ని కలవలేకపోయాను. కనీసం మా చెల్లెల్ని కూడా చూడలేకపోయాను. రెండు రాత్రుళ్ళూ ఖాదర్ తోనే సాగిపోవడం అదో నష్టపరిహారం!
డానీ నోట్స్
10 జనవరి 2014
జాన్సన్ ’సొంత సంతకం’
ఎడిట్ పేజీ రచయితల్లో విభిన్న వ్యక్తిత్వం చోరగుడి జాన్సన్.
తెలుగు సమాజంలో, రాజకీయరంగంలో వామపక్షవాదులదే ఆధిపత్యం అంటే అతిశయోక్తి కావచ్చుగానీ, తెలుగు ఆలోచనాపరుల్లో వామపక్షవాదానిదే ఆధిపత్యం అంటే అతిశయోక్తి ఏమీలేదు. మరీముఖ్యంగా తెలుగు పత్రికల ఎడిట్ పేజీ వరకైతే ఇది మరీ నిజం.
జాన్సన్ వామపక్షం కాదు. జహ్నవీలా కుడిపక్షం అస్సలు కాదు. వారిది ఉపయోగితావాదం. అందులోకూడా వారు జెరిమీ బెంథామ్. జాన్ స్టూవర్ట్ మిల్ లా సాంప్రదాయిక ఉపయోగితావాది కూడా కాదు. ఆధునిక ఉపయోగితావాది. సూటిగా చెప్పాలంటే దళిత ఉపయోగితావాది. మత అల్పసంఖ్యాకవర్గాల ( క్ర్తైస్తవ ) ఉపయోగితావాది. ఆ విధంగా వారి గమ్యంతో నాకు అనుబంధంవుంది; గమనంతో భిన్నాభిప్రాయాలున్నప్పట్టికీ.
వామపక్షాలు సూత్రప్రాయంగా ఎల్.పి.జి. ( లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) ని వ్యతిరేకిస్తాయి. జాన్సన్ దాన్నీ దళితాభ్యుదయానికి ఏమేరకు ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తారు.
2001లో పీవీ నరసింహారావు - మన్మోహన్ సింగ్ - ప్రణబ్ ముఖర్జీ త్రయం
(చాలా మంది ప్రణబ్ ముఖర్జీని మరిచిపోతుంటారు. మరకేష్ వెళ్ళి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావానికి సమ్మతంగా గ్యాట్ మీద సంతకం పెట్టి వచ్చింది ఆయనే)
మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుంది : చంద్రబాబు నాయుడు
డానీ నోట్స్
15 జనవరి 2014
చిత్తూరు, జనవరి 14 : భారతీయులకు పూర్వవైభవం వచ్చేటట్లుగా ప్రపంచమొత్తం గుర్తింపేకాదు, రెండు, మూడు దేశాల్లో భారతదేశం విడిదిచేయడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా ఉంటుందని, మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుందని, పూర్వవైభవం వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇలా ఒక పత్రికలో అచ్చయింది. ఏమిటీ దీని అర్ధం మిత్రులారా?
డానీ నోట్స్
16 జనవరి 2014
చంద్రబాబును చూసేశాం.
జగన్, కిరణ్ ను కూడా చూసేశాం.
ఏదైనా కొత్తది వస్తే బాగుంటుంది.
డానీ నోట్స్
16 జనవరి 2014
ఇంకో ఐదు రోజులే!
ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ బిల్లు - 2013 పై చర్చించడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే వ్యవధుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చివరి క్షణాల్లో అయినా జ్ఞానాన్ని ప్రదర్శిస్తారా? లేక సీమాంధ్ర ప్రజలకు శాశ్వీత అన్యాయం చేస్తారా?
డానీ నోట్స్
16 జనవరి 2014
రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు జరుగుతున్న అన్యా యానికి జగన్, కిరణ్ , చంద్రబాబు ముగ్గురూ బాధ్యలే. ముగ్గుర్నీ ఏ-వన్ గా ప్రకటించాలి!
డానీ నోట్స్
16 జనవరి 2014
ఇచ్చిన గడువులో చర్చే మొదలెట్టకుండా, మరో పది రోజులు గడువు కోరడం దేనికీ. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ బిల్లు - 2013 పై చర్చను ఇప్పటికీ కేవలం సాంకేతిక అంశంగా చూస్తున్నారు.
డానీ నోట్స్
16 జనవరి 2014
భారతీయులకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టే పనిని కాస్సేపు పక్కన పెట్టి, తెలుగువాళ్ళకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టే పనిని చంద్రబాబు చేపడితే బాగుంటుంది.

No comments:
Post a Comment