Wednesday, 29 October 2014

భారీ ఔటర్‌!


AP Capital –    8 Lane ORR 
(180 Km X 180 feet )
Krishna District
1.   Patamata Lankapalli
2.   Bhatlapenumarru
3.   Pamarru
4.   Gudiwada
5.   Nandiwada
6.   Ramapuram
7.   Hanuman Junction
8.   Mirzapuram
9.   Gollapalli
10.   Nuzvidu
11.   Tolukodu
12.   Gangineni
13.   Kanchikacherla
14.   Moguluru
Guntur District
15.   Amaravati (Dharanikota)
16.   Tammavaram
17.   Pedakurapadu
18.   Lingamguntla
19.   Siripuram
20.   Precharla
21.   Nalla Cheruvu
22.   Vejndla
23.   Paliveru

24.   Jampani 


భారీ ఔటర్‌!
- 180 కిలోమీటర్లు.. రూ.19,700 కోట్లు
- బెజవాడ కేంద్రంగా రాజధాని రింగ్‌ రోడ్డు
- నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఎనిమిది లైన్ల విశాలమైన రహదారులు! దానికి అటూ ఇటూ రెండు లైన్ల సర్వీసు రోడ్లు! మొత్తంమీద 180 కిలోమీటర్ల వృత్తం! రూ.19,700 కోట్ల భారీ వ్యయం! దాని మధ్యలో రెండు నగరాలు.. ఒక రాజధాని నగరం! విజయవాడ కేంద్రంగా.. దాని చుట్టూ వృత్తాకారంగా నిర్మించనున్న భారీ ఔటర్‌ రింగు రోడ్డు విశేషాలివి! కేవలం విజయవాడకు మాత్రమే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఇది మణిహారంగా మారనుంది. విజయవాడను నడిబొడ్డుగా తీసుకుని.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రధాన పట్టణాలను కలుపుతూ.. 180 కిలోమీటర్ల వృత్తాకారంగా ఔటర్‌ రింగు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేసింది. నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 25వ తేదీన ప్రధాని మోదీ కార్యాలయానికి పంపారు. సుమారు రూ.19,700 కోట్లు ఖర్చయ్యే ఈ రహదారిని జాతీయ రహదారుల అభివృద్ధిశాఖ ద్వారా నిర్మింప చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో, ఎన్‌హెచ్‌డీపీ ఫేజ్‌-7లో దీనిని నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని అక్టోబర్‌ 20న ప్రధాని కార్యాలయం నుంచి సమాధానం వచ్చింది. అయితే, ఇందుకు అవసరమైన భూ సేకరణ వ్యయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే షరతు విధించారు. భూ సేకరణ చేసి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగ్‌ రోడ్డు) నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టేనని రాష్ట్ర మంత్రి ఒకరు వెల్లడించారు. ఇక, ఔటర్‌ వెళ్లే మార్గాన్ని సూచనప్రాయంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మ్యాప్‌ను కూడా తయారు చేసింది. దీని ప్రకారం.. 60 శాతం కృష్ణా జిల్లాలో, 40 శాతం గుంటూరు జిల్లా వైపు ఓఆర్‌ఆర్‌ నిర్మాణం ఉంటుంది. కృష్ణా జిల్లాలో పటమట లంకపల్లి, భట్లపెనమర్రు, పామర్రు, గుడివాడ, నందివాడ, రామాపురం, హనుమాన్‌ జంక్షన్‌, మీర్జాపురం, గొల్లపల్లి, నూజివీడు, తోలుకోడు, గంగినేని, కంచికచర్ల, మోగులూరుల మీదుగా కృష్ణా నదిని దాటి గుంటూరు జిల్లాతో అనుసంధానమవుతుంది. అటు గుంటూరు జిల్లా వైపు అమరావతి, తమ్మవరం, పెదకూరపాడు, లింగంగుంట్ల, సిరిపురం, పేరేచర్ల, నల్లచెరువు, వేజెండ్ల, పలివేరు, జంపని మీదుగా కృష్ణా నదిని దాటి కృష్ణా జిల్లా వైపు కలుస్తుంది. ఈ ఔటర్‌ మధ్యలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఉంటాయి. మొత్తం ఔటర్‌ రింగ్‌ రోడ్డును 8 లేన్లుగా నిర్మిస్తారు. దీనికి అనుబంధంగా రెండు వైపులా రెండు లైన్ల సర్వీసు రోడ్లు వేస్తారు. వీటితోపాటు కృష్ణా నదిపై రెండు వంతెనలను కూడా నిర్మిస్తారు. అయితే, ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. ఈలోగా ఔటర్‌ మార్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఔటర్‌ రింగ్‌ నిర్మాణానికి మొత్తంమీద నాలుగు వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా.

No comments:

Post a Comment