గో రక్షణ పట్టదా?- ఆకారపు కేశవరాజు |
జీవహింస మహాపాపం... నేరం... దుర్మార్గం... అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు సమాజంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ప్రజలను జాగృత పరుస్తున్నారు. జంతువులను కాపాడటానికి ఎవరికి వారు శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని... మాంసాహారం మంచిదికాదని హితబోధ చేస్తున్నారు. అంతెందుకు... చిన్న చీమైనా ప్రాణేకదా... దానిలో కూడా జీవం ఉంది కదా దాన్ని చంపేందుకూ ఎవరికీ హక్కులేదు అని వాదిస్తుంటారు. ఒక్క ప్రాణికి చిన్న గాయమైనా వారి గుండె కలుక్కుమంటుంది. రక్తం పంచుకు పుట్టిన వారు బాధపడినంతగా ఫీలైపోతుంటారు ... నిన్నమొన్నటిదాకైతే ప్రకృతి ప్రేమికులు నిద్రహారాలు మాని సమాజాన్ని ఉత్తేజపరిచారు. అందుకేనేమో అలసిపోయి కాస్త నిద్దుర పోతున్నట్టున్నారు. అసలు విషయమేమంటే నిన్నటి వరకు వినాయక పండుగ సందడిలో బాగా కష్టపడ్డారు కదా!
పెద్ద పెద్ద వినాయక ప్రతిమలను ప్రతిష్ఠిస్తే అది పర్యావరణానికి ప్రమాదకరమని... వాటి తయారీలో ప్లాస్టిక్ ఉపయోగిస్తారని... విషపూరితమైన రంగులు పూస్తారని... దానివల్ల కొంపలు మునిగిపోయి భూకంపం వచ్చిపడుతోందని గుబులు చెందారు. వాటిని చెరువులు... నదుల్లో నిమజ్జనం చేస్తే వాటి రసాయనాల వల్ల చేపలు... క్రిమికీటకాలు చనిపోతాయని... వాతావరణం కలుషితమై పోతుందని తెగ బాధపడే ప్రకృతి ప్రేమికులంతా ఓ విప్లవం తీసుకొచ్చారు. పెద్దపెద్ద గణేషులను నిషేధించాలని... భక్తి భావం ఉన్న వారు కేవలం మట్టితో తయారు చేసిన చిన్న చిన్న ప్రతిమలనే ప్రతిష్టించాలని ఉద్యమం చేపట్టారు మన ప్రకృతి ప్రేమికులంతా ఐక్యంగా. అంతెందుకు వినాయక మండపాల్లో నవరాత్రులు పూజల సందర్భంగా మైక్‌లు పెట్టినా ఆక్షేపించారు కొన్ని చోట్లా కొంతమంది వీర ప్రకృతి ప్రేమికులు. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ఏర్పడుతుందని.! అందులో భాగంగానే చాలా మందిని ఉత్తేజ పరిచారు... అవగాహన కల్పించారు... శభాష్..! మరి... భూమిపైన భగవత్‌స్వరూపమైన ఓ జంతువు అవపాతాన దశలో కొట్టుమిట్టాడుతోంది. ఔను ఇక్కడో విషయం... భగవత్ స్వరూపమంటే ఇదేదో తీవ్రవాద హిందూ పదం కదా ... ఆ పదాన్ని నిషేధిద్దాం ఇక్కడ!
ఈ సృష్టిలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి ఒకటుంది... అది నేడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కాటికి కాలుచాచి బతుకీడుస్తోంది. కానీ అది చస్తున్నా... మనుషులను మాత్రం బతికిస్తోంది... అది విసర్జించే మలమూత్రాలూ ఔషధం... కాదుకాదు... అమృతం.! బీపీ, షుగర్, టీబీ లాంటి రోగులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా నయం కాని రోగాలు ఆ జంతువు మలమూత్రాలతో నయమైపోతాయి. మరి అవి అమృతంకన్నా ఎక్కువే కదా. అది ఇచ్చే పాలు, పెరుగు, వెన్న ఔషధాలు... ఆరోగ్యకరమైన మందులు. అందుకేనేమో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం వారు ఆ జీవిపై కన్నేశారు. దానిపై పేటెంట్ తీసుకుని దాని ద్వారా అనేకానేక మందులు తయారీ చేసి సంపాదిద్దామనుకున్నారు.
కాసుల వర్షం కురిపించి... కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా గుర్తించారు. ఎలాగైనా సరే ఆ సంతతిని కాపాడుదామనుకుని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడి జంతు ప్రేమికులకు మాత్రం అది కనిపించదు. దాని గోడు వినిపించదు. మరి ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు నిద్దుర పోతుంటే... కనీసం సర్కారైనా స్పందించాలి కదా! పోనీ మీరు స్పందించరు.. స్పందించడానికి మనసొప్పదు... ధైర్యం సరిపోదు అనుకుందాం. ఆ జంతువును కాపాడుదామని తెగించి ముందుకొచ్చే వారిపై మీకెందుకు కసి? లేనిపోని ఆరోపణలు చేసి వారిపై నిందలు వేయడం ఎందుకు? ఎవరి మెప్పుకోసం? ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రకృతి, పర్యావరణ ప్రేమికులారా... నిర్భయంగా ముందుకు రండి. నిర్మలమైన మనస్సుతో వాస్తవాలు ఆలోచించండి. వినాయకుడి రసాయనాల వల్ల చనిపోయే చేపలతో పాటు సృష్టికి అన్నం పెడుతున్న ఆవులనూ కాపాడుదాం. గ్రామ దేవతలైన గోవులను రక్షిద్దాం.
విశ్వహిందూ పరిషత్
Do cows release oxygen when breathing?
Karin L.
Yes, but not as a waste gas during exhalation. Atmospheric air breathed in by the cow is ~21% oxygen. The cow can remove up to about 5% oxygen, so when exhaling the air from the lungs is about 16% oxygen.
Another opinion:
When exhaled, oxygen binds with carbon to form carbon dioxide, which is expelled as a "waste" gas. So in a way, yes cows do release oxygen when breathing, but not in the O2 form we are familiar with that is in the atmosphere and what plants expel during the process of photosynthesis.
Linda Ingham In a manner of speaking, yes. However the form that oxygen is in is not pure when exhaled: it is bonded with a carbon atom, making the molecule carbon dioxide, which is the product exhaled from the lungs during the process of respiration. How does the cows respiratory system work? Karin L. Answered Last A cow's respiratory system works just like that in a human's. A cow has the same anatomical and physiological features of the respiratory system as a human and thus functions the same way: Cow breathes in oxygen, the inhaled air travels down the trachea to the bronchial branches all the way to all the alveoli, alveoli contains capillaries that contain deoxygenated blood. Carbon dioxide is exchanged for oxygen, making the blood newly oxygenated, and the carbon dioxide is pushed from the alveoli to the bronchioles and bronchi, up through the trachea and exhaled outwards. The diaphragm helps with the actions of inhaling and exhaling as well. |
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Tuesday, 14 October 2014
గో రక్షణ పట్టదా?- ఆకారపు కేశవరాజు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment