Thursday 4 September 2014

చిచ్చుపెట్టలేక స్వాగతిస్తున్నా: జగన్‌

చిచ్చుపెట్టలేక స్వాగతిస్తున్నా: జగన్‌


ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేక విజయవాడను రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని ఎంపికకు సంబంధించి గురువారం అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన తర్వాత జగన్‌ మాట్లాడారు. తాము ఏదయితే భయపడ్డామో అదే జరిగిందని అన్నారు. దీంతో, అధికార పక్షం సభ్యులు నినాదాలు చేశారు. ‘‘బెజవాడను రాజధానిని చేసినందుకు భయపడలేదు. మేం చెప్పినట్లు చర్చ చేపట్టకుండా దానికి ముందే ప్రకటన చేసినందుకు! ఇప్పటికే రాష్ట్రం 13 జిల్లాలతో చిన్నదైంది. ఇంకా చిన్నదవడం ఇష్టంలేక ప్రజల కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’’ అన్నారు. కనీసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నచోట రాజధానిని ఏర్పాటు చేయాలని మొత్తుకొని చెప్పినా పట్టించుకోలేదని జగన్‌ వాపోయారు. ప్రస్తుత పరిణామాలతో విజయవాడ పరిసరాల్లో సామాన్యుడు ఫ్లాట్‌ కట్టుకోలేరని, కనీసం ఇంటి రెంట్‌ కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ పద్ధతి ప్రకారం భూములను సేకరిస్తామని చెబుతున్న ప్రభుత్వం నయా జమిందార్లను తయారు చేస్తోందని తప్పుబట్టారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. సెజ్‌ల పేరిట భూముల్ని లాక్కొని జమిందార్లను తయారు చేసింది ఎవరో ప్రతిపక్ష నేత తెలుసుకోవాలని సూచించారు. కాగా, అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన తర్వాత జగన్‌ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎంపికపై సభలో పాలక పక్షానికి గడ్డి పెట్టామని వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment