Monday, 1 September 2014

రాజధాని రాయలసీమ హక్కు

రాజధాని రాయలసీమ హక్కు: కన్సర్న్‌ సిటిజన్స్‌ ఫోరం
పంజాగుట్ట/హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని రాయలసీమలోనే ఏర్పా టు చేయాలని.. రాజధాని అనేది రాయలసీమ హక్కు అని కన్సర్న్‌ సిటిజన్స్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఫోరం ప్రతినిధులు ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి కె.జయభారత్‌రెడ్డి, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి, మాజీ డీజీపీ సి.ఆంజనేయరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి డి.సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. శివ రామకృష్ణన్‌ కమిటీ నివేదికను పట్టించుకోబోమని చెప్పడం మంచిది కాదని.. 1956కు ముందు ఆంధ్ర రాష్ర్టానికి కర్నూల్‌ రాజధానిగా ఉండేదన్నారు. తమకు సూపర్‌ రాజధాని అవసరం లేదని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్మిస్తే సరిపోతుందని చెప్పారు.
శివరామకృష్ణన్‌ కమిటీని వేసిందని ఇటీవల కమిటీ తమ నివేదికను హోం మంత్రిత్వశాఖకు అందజేసిందన్నారు. ప్రభుత్వం శివరామకృష్ణన్‌ నివేదికను పట్టించుకోబోమని చెప్పడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. విజయవాడ, గుంటూరు, ఏలూరుల్లో రాజధానిని నిర్మించాలని అనుకుంటే భవిష్యత్తులో బియ్యం, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రాయలసీమలోని ప్రజాప్రతి నిధులను, ప్రజా సంఘాలను సంప్రదించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని, అభివృది ్ధలో సమతుల్యతను పాటించాలని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment