Thursday, 15 August 2013

PM Speech 15 August 2013

ఉందిలే మంచికాలం..

August 16, 2013
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతమున్న మందగమనం ఎంతో కాలం కొనసాగదని, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినివ్వడం వల్ల ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం కనిపిస్తోందన్నారు. త్వరలోనే ఆర్థిక రంగం కుదుటపడి వృద్ధి 6 శాతానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించారు.

2014 ఆరంభంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యూపీఏ-2 ప్రభుత్వం లో మన్మోహన్ తన చివరి, వరుసగా పదో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన తొలగించేందుకు ప్రయత్నించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక పెరగడం వల్ల వచ్చే కొద్ది నెలల్లో పలు రంగాల్లో వృద్ధి సాధిస్తామని చెప్పారు. కరెంట్ ఖాతా లోటును పూడ్చేందుకు, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు దేశవ్యాప్తంగా పలు కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

రెండు పో ర్టులు, 8 విమానాశ్రయాలు, కొత్త పారిశ్రామిక కారిడార్లు, రైలు ప్రాజెక్టులు వంటివి చేపట్టి మౌలిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఉందని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. 1991లో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు దేశాన్ని విజయవంతంగా గట్టెక్కించారని, అనేక సంస్కరణలకు తెరదీశారని గుర్తు చేశారు. గత 9 ఏళ్లలో భారత్ సాధించిన వృద్ధి రేటు సంతృప్తికరంగానే ఉందని అభిప్రాయపడ్డారు.

పిరికిపందల చర్యలిక సాగవు
భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ మానుకోవాలని ప్రధా ని హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంబడి ఆ దేశం పాల్పడుతున్న పిరికి చర్యలను అడ్డుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. "పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపడాలం టే ముందుగా ఆ దేశం భారత వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు. పొరుగు దేశాలతో స్నేహానికే భారత్ ప్రాధాన్యతనిస్తుంది. అయి తే ఇటీవల సరిహద్దుల్లో చోటుచేసుకున్న జవాన్ల ఊచకోత వంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటా''మని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

ఇక దేశంలో మావోయిస్టుల హింస తగ్గుముఖం పట్టినప్పటికీ, వారి దాడులను నిరోధించడంలో మనం విజయం సాధించలేదని అన్నారు. బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సారథి, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్న నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించకుండానే ప్రధాని విమర్శలు గుప్పించారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న లౌకిక దేశం లో సంకుచిత భావజాలం, మతతత్వానికి చోటు లేదన్నారు.

చేయాల్సింది ఎంతో ఉంది
దశాబ్ద కాలంగా చాలా దూరం ప్రయాణించామని, తమ ప్ర భుత్వం ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని ప్రధాని వ్యాఖ్యానించారు. వెనుకబడిన రాష్ట్రాలు కూడా ప్రగతి సాధిస్తున్నాయని, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో తలసరి వినియోగం నాలుగు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పేదరికంపై ప్రణాళిక సంఘం ఇచ్చిన నిర్వచనం ఇటీవల వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "పేదరికంపై విస్తృత అభిప్రాయాలు ఉంటాయి. దాన్ని లెక్కించ డం చాలా కష్టం. మనం ఏ నిర్వచనాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 2004 తర్వాత దేశంలో పేదరికం వేగంగా తగ్గిపోతున్న విషయం కాదనలేనిది'' అని వ్యాఖ్యానించారు.

త్వరలోనే ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీని అమలు వల్ల దేశంలోని 81 కోట్ల మందికి తక్కువ ధరకే ఆహార ధాన్యాలు అందుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్‌పాల్ బిల్లు, రహదారుల అభివృద్ధి తదితర అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మంత్రులు, ఉభయసభల్లో విపక్ష నేతలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
వరుసగా పదేళ్లు..
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ గురువారం ఓ అరుదైన ఘనత సాధించారు. గాంధీ-నెహ్రూ కుటుంబం తర్వాత ఎర్రకోటపై పదిసార్లు మువ్వన్నెల జెండాను ఎగరేసిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. అది కూడా.. వరుసగా పదేళ్లు ఆయన జెండా ఎగరేయడం విశేషం. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ వరుసగా 17 సార్లు జెండా ఎగరేస్తే.. ఆయన కుమార్తె ఇందిర మొత్తం 16 సార్లు.. వరుస సంవత్సరాల్లో 11 సార్లు జెండా ఎగరేశారు. ఎన్టీయే హయాంలో వాజపేయి వరుసగా ఆరుసార్లు మువ్వన్నెల జెండాను ఎగరేశారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
పీవీని స్మరించుకున్న ప్రధాని
న్యూఢిల్లీ, ఆగస్టు 15: పదేళ్లుగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఎర్రకోట పై నుంచి ప్రసంగిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎన్నడూ లేనిది తొలిసారి గురువారం నాటి ప్రసంగంలో తన రాజకీయ గురువైన పీవీ నరసింహారావును తలచుకున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రధానంగా సాగిన తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రధానులైన నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లను కీర్తించిన మన్మోహన్.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన సంస్కరణలతో గట్టెక్కించారంటూ పీవీని కొనియాడారు. 1991లో.. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని పీవీ నాయకత్వంలో ఎదుర్కొని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నామని గుర్తుచేశారు.


ONE I-DAY,TWO IDEAS OF INDIA 

PM defends UPA record,attacks sectarianism 

TIMES NEWS NETWORK 

New Delhi:In possibly his last Independence Day speech,Prime Minister Manmohan Singh defended his record in office,expressed optimism about growth reviving and warned of the danger of sectarian ideologies.

We should prevent them (divisive ideologies ) from growing.We need to strengthen those traditions of our country which teach us to promote tolerance and respect for thought processes different from ours, the PM said.

The denunciation of narrow and sectarian ideologies that the PM said have no place in a modern India and his appeal to strengthen inclusive traditions was interpreted as a dig at the BJP.It came against the backdrop of Gujarat CM Narendra Modis declaration the evening before that the PMs speech would be compared with his.

Official sources,however,said the reference was not specific and pointed to the PM asking all parties,all sections of society and public to contain divisive forces and promote tolerance for contending beliefs.

Although it has been framed as a duel of sorts,the two Independence Day addresses could not have contrasted more.The PM was constrained to stick to the written word in taking on the man seen as BJPs prime ministerial bet in the 2014 Lok Sabha election in an out-and-out political punch.

Though never a great practitioner of rhetoric,the formal nature of the speech appeared to box him in even more in the face of Modis unorthodox challenge.

As anticipated,the PM took stock of the two UPA governments since 2004,arguing there was a discernible change for the better in terms of general well-being while programmes like food security and RTI had empowered the common man.

Singh made a brief reference to the August 6 deaths of five Indian soldiers in an ambush by Pakistani troops,saying all steps would be taken to prevent such a dastardly attack in the future.

Modi targets PM,talks of taking along all Indians 

Harit Mehta TNN 

Bhuj (Gujarat): Even as BJP dithers on when to declare him as its prime ministerial candidate,Gujarat CM Narendra Modi on Thursday staked claim to the top job by delivering an Independence Day speech aimed at rivalling incumbent Manmohan Singhs address from Delhis Red Fort and softening a hardline saffron image.

Breaking the restraint that political opponents have traditionally shown exercised in critiquing the PMs August 15 address,Modi turned the grounds of Lalan College here into a parallel pulpit as he attacked Singhs speech and dared him to a debate on development.

Modis speech marked an ambitious attempt to de-sectarianize himself.Governments should have one religion,of putting India first.They should follow the Constitution as their only scripture,and treat the entire population of 1.25 billion as their strength.Sarkar ki ek hi pooja hain,sabka saath or sabka vishwas (taking all Indians along and earning everybodys trust should be the governments only article of faith ). 

The speech delivered by the Gujarat CM on Thursday,populist as well as partisan,reflected the Modi camps desire to turn the 2014 Lok Sabha elections into a presidential race,with the Gujarat CM fully harnessing his oratorial skills.The Gujarat CM looked to exploit the UPAs weaknesses inflation,corruption,gloom over the economy as well as an alleged weak stance towards Pakistan and China.He used his advantage of rhetoric also to play to his strengths: perception of having delivered on development front,as a decisive leader being tough on national security,and the fact that he has not been tested on the national arena.

The chief minister was careful to avoid any references such as burqa of secularism that had given his critics an opportunity to reiterate their misgivings over him being a divisive 

No comments:

Post a Comment