Saturday, 14 May 2016

ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీ

ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీ

Others | Updated: May 05, 2016 15:11 (IST)
ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావల్సిన ప్రతి పైసాను కేంద్రం ఇచ్చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 6,403 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఆర్థిక బిల్లుపై లోక్ సభలో మాట్లాడిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు  తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ. 2,800 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రాన్ని విభజించింది తాము కాదని, అయినా పోలవరం నిధులపై కూడా వెనుకంజ వేయడం లేదని చెప్పారు.
యూపీఏ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నాం.. ఏపీకి అండగా నిలిచామని జైట్లీ పేర్కొన్నారు. ఏపీకి రావలసిన ప్రతి పైసా ఇచ్చేశామని, పోలవరంపై కేంద్రం కమిట్‌మెంట్‌తో ఉందని వివరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు మాత్రమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చామన్నారు.

No comments:

Post a Comment