విభజన చట్టాన్ని అమలు చేయాల్పిందే: చంద్రబాబు
02-05-2016 21:09:29
విజయవాడ: ప్రతిపక్ష నేత జగన్ కేసుల మాఫీకోసమే ఢిల్లీ వెళ్తున్నారని.. రాష్ట్రం కోసం కాదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకి నిధులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. విభజన చట్టాన్ని అమలుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ప్రత్యేకహోదాపై కేంద్రానికి నీతిఅయోగ్ నివేదిక ఇచ్చిందని, అయితే నీతిఅయోగ్ ఎలాంటి నివేదిక ఇచ్చిందో తెలియదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. మీకు అవకాశాలు ఉన్నాయి.. బాగుపడాలని అంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నా, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
No comments:
Post a Comment