స్నేహం చాటున ద్రోహం!
25-05-2016 23:57:03
- మిత్రుడి చేతిలో ఐటీ ఉద్యోగి హత్య.. డబ్బు కోసమే
గచ్చిబౌలి: స్నేహం ముసుగులో దారుణం.. మిత్రుడిగా నమ్మించి ఆపై అదును చూసి హత్య.. హైదరాబాద్ శివారు లింగపల్లిలో చోటుచేసుకున్న హత్య కేసును పోలీసులు 8గంటల్లోనే ఛేదించారు. మృతు డు హష్మి సీసీఎం నేత, మాజీ ఎంపీ మధుకు సమీ ప బంధువు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన వల్లిపల్లి హష్మి వారం క్రితమే టీసీఎ్‌సలో ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే ఇలా దారుణంగా హత్యకు గురవడం విషాదం! హష్మి బల్కంపేట ఎల్లమ్మగుడి సమీపంలో అద్దె గదిలో ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మరో గదిలో ఉంటున్న ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన నరేశ్‌రెడ్డితో హష్మికి స్నేహంకుదిరింది. సోమవారం సాయంత్రం హష్మి ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో నరేశ్ కలిశాడు. పనుందంటూ లింగంపల్లి రైల్వేస్టేషన్ అండర్‌పాస్ బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లాడు. అక్కడ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం, పెనుగులాట జరిగింది. నరేశ్‌రెడ్డి బండరాయి తీసుకుని తలపై కొట్టడంతో హష్మి అక్కడిక్కడే మరణించాడు. హష్మి మెడలోని బంగారు గొలుసు, బైక్, సెల్‌ఫోన్, పర్సు, ఎటీఎం కార్డు తీసుకుని నిందితుడు పారిపోయాడు. హష్మి కనిపించడం లేదంటూ ఉమామహేశ్వరరావు మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటీ కారిడార్ సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడంతో హష్మి మోటార్‌సైకిల్‌పై నరేశ్ కనిపించాడు. అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.
No comments:
Post a Comment