Saturday, 14 May 2016

ప్రత్యేక హోదా కంటే పోలవరం మిన్న!

ప్రత్యేక హోదా కంటే పోలవరం మిన్న! 
వాస్తవం ప్రతినిధి: ప్రత్యేక హోదా కంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సమీపంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి వచ్చిన స్థానిక విలేకరులు ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ..
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఏపీకి ప్రత్యేక హోదా కంటే బహుళార్ధ ప్రాజెక్టు అయిన పోలవరం వీలైనంత త్వరగా పూర్తి చేస్తే ..రాష్ట్ర జీడీపీ, ఉత్పాదకత, ఉధ్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే ఐదు లేదా పదేళ్ళు ఇస్తారని, అదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్త్రానికి సంజీవినిలాంటిదని అశోక్ బాబు చెప్పారు.

No comments:

Post a Comment