‘అమరావతి’ రైలుకు నూతన ప్రతిపాదన
16-05-2016 06:47:02
ఆంధ్రజ్యోతి, గుంటూరు : అమరావతి రాజధానికి నూతన రైలుమార్గం నిర్మించేందుకు సర్వే మంజూరైన నేపథ్యంలో అలైనమెంట్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకు ప్రజల నుంచి పలు ప్రతిపాదనలు అందుతున్నాయి. గతంలో జిల్లా ఎంపీలు సత్తెనపల్లి, గుంటూరు నుంచి కనెక్టివిటీలను ప్రతిపాదించగా తాజాగా జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు నన్నపనేని నాగేశ్వరరావు అందజేసిన ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. కృష్ణాకెనాల్ - అమరావతి(వెలగపూడి) - రాయనపాడు - గన్నవరం ఎలైనమెంట్ వలన అమరావతి రాజధానికి దేశంలోని అన్ని ప్రాంతాల రైల్వేస్టేషన్లకు కనెక్టివిటీ ఏర్పడుతుందని ఆయన సూచిస్తున్నారు. పైగా ఖర్చు కూడా చాలా తక్కువతోనే పూర్తి అవుతుందని పేర్కొంటున్నారు.
2016-17 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్‌లో అమరావతికి రైలుమార్గం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వేని మంజూరు చేసింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే జోనకు ప్రజాప్రతినిధులతో పాటు జెడ్‌ఆర్‌యూసీసీ, డీఆర్‌యూసీసీ, రైల్వే యూనియన్ల నుంచి ప్రతిపాదనలు అందుతున్నాయి. రైల్వే అధికారుల మదిలో న్యూగుంటూరు రైల్వేస్టేషన నుంచి మంగళగిరిని కలుపుతూ అమరావతికి ఎలైనమెంట్ చేయాలన్న ఆలోచన ఉన్నది. అయితే దీని వలన పెద్దగా కనెక్టివిటీ రాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణా కెనాల్ జంక్షన విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ రైల్వేస్టేషన నుంచే ఇటు గుంటూరు వైపునకు, అటు చెన్నై వైపునకు రైలుమార్గాలు చీలిపోతాయి. ఇక్కడినుంచి అమరావతి రాజధానిలోని వెలగపూడి వరకు రైలుమార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. వెలగపూడిలో అమరావతి రైల్వే జంక్షనను నిర్మించి అక్కడి నుంచి విజయవాడకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్ ను కలపాలి. రాయనపాడు రైల్వేస్టేషన విజయవాడ - ఖాజీపేట మార్గంలో ఉంది. దీని వలన అటు హైదరాబాద్‌కు, ఇటు ఢిల్లీ వైపునకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. రాయనపాడును జంక్షనగా అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి గన్నవరాన్ని కలుపుతూ ఎలైనమెంట్‌ను ప్రతిపాదిస్తున్నారు. గన్నవరం రైల్వేస్టేషన హౌరా మార్గానికి కనెక్టు అయి ఉంది. ఈ స్టేషనకు సమీపంలోనే ఎయిర్‌పోర్టు అందుబాటులో ఉన్నది. ఈ ప్రతిపాదిత ఈ రైలుమార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. పెద్దగా ఫ్లైవోవర్, అండర్ బ్రిడ్జీల నిర్మాణాల అవసరం ఉండదని, పైగా రోడ్డు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఎగువున ఒక వంతెన నిర్మిస్తే ఈ రైలుమార్గం ఒక ఐకానిక్‌గా మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు
Really glad to read... this is very informative post. Keep on updating the post.Telugu gossips in Hyderabad
ReplyDelete