Saturday, 28 May 2016

ప్రతి గృహానికీ జియోట్యాగింగ్‌ .. 15నుంచి ఇంటింటి సర్వే

ప్రతి గృహానికీ జియోట్యాగింగ్‌ .. 15నుంచి ఇంటింటి సర్వే 
26-05-2016 01:18:34

కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటన
విజయవాడ, మే 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజలందరి వివరాలను ఒకేచోట నిక్షిప్తం చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇంటింటి సర్వేకి(పల్స్‌ సర్వే) సిద్ధమవుతోంది. వచ్చే నెల 15న ప్రారంభించి జులై నాటికి పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ఎలా సాగాలనేది కలెక్టర్ల సదస్సు వేదికగా నిర్దేశాలు అందించారు. ఈ సదస్సులో ‘జన సమాచార నిధి’ని ఎలా సమకూర్చుకోవాలో సూచనలు చేశారు. సర్వే విధానంపై ఐటీ సలహాదారు జే సత్యనారాయణ ప్రజెంటేషన ఇచ్చారు. సర్వేలో భాగంగా.. ప్రజల వివరాలను పూర్తిస్థాయిలో సమగ్రంగా సేకరించాలని సీఎం ఆదేశించారు. సర్వేకు సంబంధించిన యాప్‌ స్మార్ట్‌ఫోన, ట్యాబ్‌ ద్వారా ఎలా వినియోగించాలో కలెక్టర్లకు వివరించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, ప్రజలందరి వివరాలు సేకరించే ఒకేచోటికి తేవాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అన్ని సామాజిక వర్గాలపై అన్ని కోణాల్లో సర్వేచేసి వారి స్థితిగతులను తెలుసుకోనుంది. 

సర్వే ఇలా..
అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజల పూర్తి వివరాలను సేకరిస్తారు. ఆర్థిక, సామాజిక వివరాలతో పాటు ప్రతి ఇంటినీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జియో ట్యాగింగ్‌ చేస్తారు.

No comments:

Post a Comment