చంద్రబాబుకు 'ఫ్లాష్ బ్యాక్' గుర్తు చేసిన సోము వీర్రాజు..
By: Mittapalli Srinivas Published: Thursday, May 12, 2016, 14:41 [IST] ప్రత్యేక హోదా చిచ్చు మిత్ర పక్షాలను రగిలిస్తోంది. ఈ విషయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండడం తప్పదు కాబట్టి, ఏపీలో టీడీపీ, బీజేపీలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ పై విమర్శలు గుప్పిస్తోన్న టీడీపీకి బ్రేక్ వేయకపోతే రాష్ట్రంలో బీజేపి పరిస్థితి దిగజారే అవకాశం ఉండడంతో, టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారు బీజేపీ నేతలు. అయితే.. రాష్ట్ర బీజేపీలోను చంద్రబాబు అనుకూల వర్గం ఉండడంతో, టీడీపీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో బీజేపీ వెనుకబడుతున్నట్టే కనిపిస్తోంది. కాగా.. చంద్రబాబు తీరుపై ముందునుండి నిర్ద్వందంగా వ్యవహరించే బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు టీడీపీని కడిగిపారేశారు. నిన్నటిదాకా ప్రత్యేక హెదాపై మౌనం వహించిన వీర్రాజు తాజాగా చంద్రబాబు వైఖరిపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదానే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. 'ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా..! హోదా వచ్చి కూడా వెనుకబడిన రాష్ట్రాలు ఎన్ని లేవు.. హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.' అని చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యలు మరిచిపోయారా..? అని ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేసే ప్రయత్నం చేశారు. ఇన్ని మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై మళ్లీ మాట మార్చడం, కేంద్రంపై నిందలు వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన సహాయం నిజమా కాదా అని నిలదీశారు సోము వీర్రాజు. దీంతో రెండు పార్టీల మధ్య వ్యవహారం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. తెగదెంపులకు పోతారా.. లేక కలిసే రాజకీయ ప్రయాణం సాగిస్తారా అన్నది వేచి చూడాలి.
Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/somu-veerraju-reminds-flash-back-to-chandrababu-177377.html

No comments:
Post a Comment