Saturday, 14 May 2016

ఎమ్మెల్యేలను కాదు.. ప్రజలను ఆకర్షించండి

ఎమ్మెల్యేలను కాదు.. ప్రజలను ఆకర్షించండి

Sakshi | Updated: May 14, 2016 01:38 (IST)
ఎమ్మెల్యేలను కాదు.. ప్రజలను ఆకర్షించండి
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచన

 సాక్షి, విజయవాడ బ్యూరో: ఎమ్మెల్యేలను కాకుండా ప్రజలను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచించారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేరుగా టీడీపీ పేరు ఎత్తకుండా ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ధరల అదుపుపై పెడితే బాగుంటుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యల్లో ఉన్నారని, కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.

ప్రత్యేక హోదాపై స్పందిస్తూ.. తమది అవినీతి, మోసకారి పార్టీ కాదని, ఇచ్చిన మాటపై నిలబడి ఉంటామని చెప్పారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామన్నారు. ప్రత్యేక హోదా బెటరా లేక ప్యాకేజీ బెటరా అనే దానిపై చర్చ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఫిరాయింపులపై మొదటి నుంచి తాను విమర్శలు చేస్తున్నానని, ఏ పార్టీ అయినా ఫిరాయింపులను ప్రోత్సహించడం సరైన విధానం కాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

No comments:

Post a Comment