Tuesday 10 February 2015

వీడు సామాన్యుడు కాదు

వీడు సామాన్యుడు కాదు

నరేంద్రుడికి ఘోర పరాభవం
దుమ్ము దులిపేసిన కేజ్రీవాల్‌
ఢిల్లీలో చీపురు విప్లవం
67 సీట్లలో విజయం
ఇది జన విజయం
ఢిల్లీ ప్రజలకు నా సెల్యూట్‌
సత్యాన్ని నమ్మితే గెలుపు తథ్యం
అహంకారం వల్లే బీజేపీ ఓటమి
అది వీడకుంటే మనకూ అదే గతి
కేజ్రీవాల్‌ విజయ సందేశం


నచ్చలా.. ఢిల్లీవాలాకు నచ్చలా...
‘సామాన్యుడి’కి అస్సలు నచ్చలా!
‘మహారాజా’ వారి నాటకీయత...
‘మాంత్రికుడి’ మాయోపాయం...
కోటలు దాటే మాటలతోనే
పూట మీద పూట గడిపే విధానం..
‘అమిత’మైన ఆధిపత్యం....
చెప్పింది చేయాలన్న అహంకారం...
ఎదురు లేదనే గర్రు..
ఎదురే ఉండకూడదన్న బిర్రు...
ఎలాగైనా గెలవాలన్న పట్టు...
విలువలనైనా వదిలేసే బెట్టు..
నచ్చలా.. చాలా మందికి నచ్చలా...
సామాన్యుడికీ నచ్చలా..
 అందుకే.. 

అ‘సామాన్యుడు’

నమ్మిన సిద్ధాంతాల కోసం ముఖ్యమంత్రి పీఠాన్ని తృణప్రాయంగా వదిలేసిన కేజ్రీవాల్‌ జీవితం అనుక్షణం పోరాటాల మయం. ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ చేసిన ఆయన టాటా స్టీల్‌లో మూడేళ్లు ఉద్యోగం చేశారు. అక్కడ ఆయన మనసు నిలవలేదు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌ రాశారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా కొత్త జీవితం ప్రారంభించారు. 1999లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న రోజుల్లో, అట్టడుగు స్థాయి నుంచి అవినీతి ఎంతగా పెరిగిపోయిందో గమనించారు. ఈ అవినీతిని రూపుమాపితే తప్ప దేశం బాగుపడదని భావించారు. మనిష్‌ సిసోడియా తదితరులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన్‌’ సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. 2005లో వీరికి అన్నాహజారే వంటి నేతల మద్దతు లభించింది. 2006లో కేజ్రీవాల్‌ ఐఆర్‌ఎస్‌ ఉద్యోగాన్ని వదిలేసి జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నందుకు, ఆయనకు అదే సంవత్సరంలో ‘రామన్‌ మెగసెసే’ అవార్డు లభించింది.
2006 డిసెంబర్‌లో కేజ్రీవాల్‌ ‘పబ్లిక్‌ కాజ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రశాంత్‌ భూషణ్‌, కిరణ్‌ బేడీలు ఇందులో సభ్యులుగా చేరారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే తదితరులతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలు పెట్టారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ‘జనలోక్‌పాల్‌’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అన్నా హజారేతో కలిసి ఉద్యమం ప్రారంభించారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదట్లో జనలోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకించినా, ప్రజాసంఘాల నుంచి వస్తున్న ఒత్తిడితో బిల్లు రూపొందించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కేజ్రీవాల్‌ పౌరసంస్థల ప్రతినిధిగా ఉన్నారు. కమిటీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అన్నా హజారే నిరాహారదీక్షకు దిగారు. ఉద్యమం దేశమంతటా విస్తరించడంతో ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం తుంగలో తొక్కడంతో 2012 జనవరిలో కేజ్రీవాల్‌ బృందం మళ్లీ ఉద్యమించింది. రాజకీయ అధికారం లేకపోతే ప్రజాసంక్షేమానికి అవసరమైన చట్టాలు చేయలేమని గ్రహించిన కేజ్రీవాల్‌, 2012 నవంబర్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి శ్రీకారం చుట్టారు. 
2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ‘ఆప్‌’ సంచలనాలు సృష్టించింది. పార్టీ ఏర్పాటు చేసి ఏడాది తిరక్కుండానే ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 28 స్థానాలు గెలుచుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేసిన షీలా దీక్షిత్‌పై పోటీచేసి కేజ్రీవాల్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు. తగినంత మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో 2013 డిసెంబర్‌ 28న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎంగా కూడా ఆయన సంచలనాలు సృష్టించారు. సీఎంగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమించారు. జనలోక్‌పాల్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఆ బిల్లుకు అడ్డు పడడాన్ని నిరసిస్తూ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి గత ఏడాది ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. దాంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్‌ వ్యవహారశైలిని కూడా పలువురు విమర్శించారు. అంతర్మథనానికి లోనైన కేజ్రీవాల్‌ పోరాటాన్ని మధ్యలో వదిలేసి రాజీనామా చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నెల 7న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో, అన్ని సర్వేల అంచనాలను మించి కేజ్రీవాల్‌ చారిత్రక విజయం సొంతం చేసుకున్నారు.
 15మందికి 40 వేల ఓట్లకు పైగా మెజారిటీ
ఆప్‌ మెజారిటీ అదరహో
న్యూఢిల్లీ: చీపురు సునామీ ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేసేసింది. అత్యధిక మెజారిటీలతో ఘన విజయం సాధించిన ఆప్‌ చరిత్ర సృష్టించింది. గెలిచిన 67మందిలో 50 మంది 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వారిలో 15మంది 40 వేలకు పైగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. ఇంతటి భారీ మెజారిటీలు సాధించడం ఢిల్లీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా వికాస్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మహేందర్‌ యాదవ్‌ రికార్డు సృష్టించారు. ఆయన తన బీజేపీ ప్రత్యర్థిపై 77,665 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా ఓడిన మూడు సీట్లలోనూ ఆప్‌ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఒక చోట ఐదు వేలు, మరోచోట 10 వేల ఓట్ల వ్యత్యాసంతో ఆప్‌ అభ్యర్థులు ఓడిపోయారు. మరో స్థానంలో మాత్రం మూడో స్థానంలో నిలిచారు.
అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరాలు
పుట్టిన తేది : జననం: ఆగస్టు 16, 1968
స్వస్థలం : హర్యానాలోని హిస్సార్‌
విద్య : ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్‌

ఉద్యోగం: 1989-92 మధ్య టాటా స్టీల్‌లో ఇంజనీర్‌గా. 1995లో సివిల్‌ సర్వీసెస్‌ ఉత్తీర్ణత, ఇన్‌కమ్‌టాక్స్‌ జాయింట్‌ కమీషనర్‌గా పనిచేశారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా. అవినీతి వ్యతిరేక ఉద్యమం
అవార్డులు: రామన్‌ మెగసెసే అవార్డుతో పాలు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు
కుటుంబం: 1995లో సహోద్యోగి సునీతతో వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి.
అలవాట్లు: శాకాహారం, విపశన ధ్యానం.
40 వేలకు పైగా
మెజారిటీ సాధించిన వీరులు
అభ్యర్థి నియోజకవర్గం మెజారిటీ
మహేందర్‌ యాదవ్‌ వికా్‌సపురి 77,665
సంజీవ్‌ ఝా బురారి 67,950
అమంతుల్లా ఖాన్‌ ఓఖ్లా 64,532
సందీప్‌ కుమార్‌ సుల్తాన్‌పూర్‌ 64,439
ప్రకాశ్‌ దేవ్‌లీ 63,937
వేద్‌ప్రకాశ్‌ బవానా 50,023
రాజేంద్రపాల్‌ సీమాపురి 48,821
నారాయణ్‌దత్‌ శర్మ బదాపూర్‌ 47,583
గులాబ్‌ సింగ్‌ మటియాలా 47,007
రితురాజ్‌ గోవింద్‌ కిరారి 45,172
కపిల్‌ మిశ్రా కర్వాల్‌నగర్‌ 44,431
దినేశ్‌ మోహనియా సంగమ్‌ విహార్‌ 43,988
అజయ్‌దత్‌ అంబేద్కర్‌నగర్‌ 42,460
సుఖ్వీర్‌సింగ్‌ ముంద్కా 40,826
శరద్‌ కుమార్‌ నరేలా 40,291

ఆగింది గెలుపు పర్వం..
ముగిసింది విజయ గర్వం!
హర హర మోదీ కాస్త..
మోదీ హారా, హారాగా మారింది!!
నమో.. నీకో నమస్కారం
అని ఢిల్లీ ప్రజ తేల్చి చెప్పింది!!!
 ఆమ్‌ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయం
 54 శాతం ఓట్లతో తిరుగులేని ప్రజామోదం
 మోదీ నాయకత్వానికి తొలిసారిగా షాక్‌
 మూడు స్థానాలకే పరిమితమైన కమలం
 ఖాతా తెరవలేక చతికిలపడిన ‘హస్తం’
 ఆప్‌ శాసనసభాపక్ష నేతగా కేజ్రీ ఎన్నిక
 శనివారం రామ్‌లీలా మైదాన్‌లో ప్రమాణం
 రాజీనామా చేసిన ఏడాదికి విజయహాసం
గెలుపు, విజయం, అఖండ విజయం, అద్భుత
విజయం... ఇవేవీ సరిపోవు! ఢిల్లీలో ‘ఆప్‌’
సాధించిన ఫలితాన్ని విశ్లేషించేందుకు
‘అంతకుమించి’ ఇంకేదైనా పదాన్ని కనిపెట్టాలి!
హవా, ప్రభంజనం, తుఫాన్‌, సునామీ...
వీటన్నింటినీ వెనక్కి నెట్టేయండి! బ్యాలెట్‌ పెట్టెలో
చెలరేగిన అలజడికి ఇంకేదైనా పేరు పెట్టాలి!
ఎన్నికల విశ్లేషకులు ఊహించని, మహామహా
పండితులకు సైతం అంతుచిక్కని, స్వతంత్ర
భారతంలో ఇటీవలి కాలంలో ఎక్కడా జరగని...
అద్భుతం, మహాద్భుతం ఢిల్లీలో చోటు చేసుకుంది. 

‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ చరిత్ర సృష్టించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 67 స్థానాలను దక్కించుకుంది. ఢిల్లీలో గద్దెనెక్కి దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. ‘మిషన్‌ 44’ సంగతి పక్కనపెడితే... రెండంకెల సీట్లూ దక్కించుకోలేక... మూడంటే మూడు స్థానాలకు పరిమితమైంది. సాంకేతికంగా చూస్తే విపక్ష హోదాకూ అర్హతలేకుండా పోయింది. ఇక... గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మారు గెలిచి, 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు నిండా ‘సున్న’ం పడింది. ఒక్కటంటే ఒక్కసీటూ గెలవలేక... కాంగ్రెస్‌కు శూన్య‘హస్తం’ మిగిలింది. తగిన సత్తా ఉన్న నాయకుడు దొరికితే... ప్రత్యామ్నాయ పార్టీలకు, ప్రత్యామ్నాయ శక్తులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. అవును... ‘సామాన్యుడే’ గెలిచాడు. గల్లీగల్లీల్లో ఉన్న సామాన్య ప్రజలంతా ఏకమై ఢిల్లీ ఎన్నికల్లో తమను తాము గెలిపించుకున్నారు. విస్తృత ప్రచారాలను తిప్పికొట్టారు. బెదిరింపుల్ని ఎదిరించారు. అహంకార పూరిత ధోరణి రాజకీయాలను మట్టి కరిపించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించారు. ‘చీపురు’తో ఢిల్లీ ఎన్నికల బరిని ‘క్లీన్‌ స్వీప్‌’ చేసేశారు. ఏకంగా 95 శాతం సీట్లు సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలైంది. ఫలితాల సరళి ఆది నుంచీ ఆప్‌కు అనుకూలంగా వచ్చింది. చూస్తుండగానే ఆప్‌ విజయ పతాక అలా అలా ఎగిరింది. ఆధిక్యంలో ఉన్న స్థానాల సంఖ్య... 20, 30, 40, 50 వరకు దూసుకుపోయింది. అంతా ‘అయ్య బాబోయ్‌’ అనుకుంటుండగానే, ఆప్‌ నేతలే సంభ్రమాశ్చర్యాలకు గురవుతుండగానే... గెలుపు సూచీ 67 వద్ద ఆగింది. 1982లో ‘సిక్కిం సంగ్రామ్‌ పరిషత్‌’ సిక్కింలోని మొత్తం 32 స్థానాలను దక్కించుకుంది. ఇప్పటిదాకా ఇదే ‘చరిత్ర’! మళ్లీ ఇప్పుడు ఆప్‌ది అదేస్థాయి విజయం!
 54ు ఓట్లు, 95ు సీట్లు.. ఇలా ఎప్పుడైనా జరిగిందా?
 ఆప్‌ ఎలా గెలిచింది.. ఆ 2 పార్టీలు ఎందుకు ఓడాయి?
 ఒకే ఒక్కడు కేజ్రీవాల్‌.. ఎక్కడి వాడు? ఎలా ఎదిగారు?
 మోదీకిష్టం సోషల్‌ మీడియా.. ఈసారి ఏమంటోంది?
 కేజ్రీవాల్‌ పాంచ్‌సాల్‌.. వినిపించిన నినాదాలు ఏవి?
 భలే ఉంది బాసూ.. తెలుగు పార్టీల ఆనందం ఎందుకు?

No comments:

Post a Comment