Thursday 19 February 2015

2029 నాటికి రాషా్ట్రన్ని నంబర్‌ 1 చేస్తా

కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకుంటా

ఆంధ్రాకు తీరని ద్రోహం చేసింది
2029 నాటికి రాషా్ట్రన్ని నంబర్‌ 1 చేస్తా
కరువును తరిమేస్తా: ఏపీ సీఎం బాబు
 చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు

చిత్తూరు/బి.కొత్తకోట, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో రూ. 27,200 కోట్లు వెచ్చించి నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేసి కరువును రూపుమాపుతానని సీఎం చంద్రబాబు అన్నారు. తద్వారా చరిత్రను తిరగరాస్తానని ప్రకటించారు. బాధ్యత లేని గత ప్రభుత్వాల పాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటానని.. 2029 కల్లా దేశంలో రాష్ట్రాన్ని నంబర్‌ 1గా తీర్చి దిద్దుతానని ప్రకటించారు. గురువారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం చెరువులో ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నది మిగులు నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళిస్తే, డెల్టాలో వినియోగమయ్యే కృష్ణ నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మళ్లించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీన పట్టిసీమ నుంచి గోదావరి నీటిని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లింపు పనులను ప్రారంభిస్తామన్నారు. తనకు వ్యక్తిగత స్వార్థమేమీ లేదని, రాషా్ట్రనికి కాంగ్రె్‌సపార్టీ చేసిన ద్రోహానికి ప్రతీకారంగా రాషా్ట్రన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నానని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలకు తమ ప్రభుత్వం మేలు చేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. 2022 నాటికి రాషా్ట్రన్ని దేశంలో మొదటి మూడు రాషా్ట్రల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని, అలాగే 2029 నాటికి నెంబర్‌వన్‌గా నిలుపుతామని ప్రతిన పూనారు. కాగా అంతకుమునుపు ముఖ్యమంత్రి గుమ్మసముద్రం చెరువులో నీరు-చెట్టు కార్యక్రమానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత స్వయంగా జేసీబీ నడిపి చెరువులో పూడిక తీత పనులను ప్రారంభించారు. కాగా తిరుపతిలో లక్షకు పైగా మెజారిటీ సాధించి పెట్టిన టీడీపీ శ్రేణుల రుణం తీర్చుకుంటానని చెప్పారు.
రండి.. పెట్టుబడులు పెట్టండి
హైదరాబాద్‌/బెంగళూరు: బెంగళూరులో గురువారం జరిగిన ఏరో ఇండియా-2015 ప్రదర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానయాన, రక్షణ విభాగాలకు చెందిన 11 ప్రముఖ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఇచ్చిన పిలుపునకు పలు కంపెనీల సీఈవోలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లను నెలకొల్పేందుకు తమ సంస్థల ద్వారా పెట్టుబడులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 

No comments:

Post a Comment