Thursday 19 February 2015

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇప్పించాలి: స్వామిగౌడ్‌

ఖర్మ కాలి పెద్దమనిషినయ్యా.. కంట్రోల్‌లో ఉంటున్నా
  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇప్పించాలి: స్వామిగౌడ్‌
కరీంనగర్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘కర్మ కాలి నేను కూడా పెద్ద మనిషిని అయ్యాను.. నేను ఎట్ల పడితే అట్ల మాట్లాడడానికి అవకాశం లేదు.. కానీ కంట్రోల్‌లో ఉండి మాట్లాడాలి..’ అని శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క ఉద్యోగులు సమ్మె చేయడం వల్లనే రాలేదని, అన్ని వర్గాల వారు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని అన్నారు. ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా జర్నలిస్టులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు సైతం వార్తలు రాసి ఉద్యమానికి చేయూతనిచ్చారని గుర్తు చేశారు. చిన్నప్పుడు ఆడపిల్లలు సైకిల్‌ తొక్కినా, ఆడుకున్నా తల్లిదండ్రులు ఏమీ అనరని, పెద్ద మనిషి అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారని, సైకిల్‌ తొక్కనివ్వరని, ఆడుకోనివ్వరని అన్నారు. తాను కూడా కర్మ కాలి పెద్ద మనిషిని అయ్యానని, ఎట్ల పడితే అట్ల మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల పరిస్థితులు మారలేదని వారికి ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇప్పించాలని స్వామిగౌడ్‌ మంత్రులు హరీశ్‌, ఈటెల రాజేందర్‌ను కోరారు.

No comments:

Post a Comment