బుద్వేల్‌లో జర్నలిస్టులకు టవర్స్..
http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/journalists-towers-in-budvel-1-2-502419.html
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామ పరిధిలోని వంద ఎకరాల స్థలంలో నివాసగృహాల సముదాయం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నగరంలో పనిచేస్తున్న అన్ని రకాల జర్నలిస్టులకూ గృహాలు సమకూరేలా బహుళ అంతస్తుల టవర్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటి విడతలో ఇండ్లు కడతామని, ఇతర ప్రాంతాల్లోని జర్నలిస్టులకూ త్వరలోనే ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.
-వంద ఎకరాల్లో నివాసగృహాల సముదాయ నిర్మాణం
-జర్నలిస్టుల సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్
-బుద్వేల్ స్థలాన్ని ప్రభుత్వానికి బదలాయించాలని అధికారులకు ఆదేశాలు
-జిల్లా జర్నలిస్టుల విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు
-పార్ట్‌టైం రిపోర్టర్లందరికీ డబుల్‌బెడ్‌రూం పథకంలో గృహాలు
జిల్లా కేంద్రంలోనూ పాత్రికేయులకు ఇండ్లు కట్టించే విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్ట్‌టైమ్ రిపోర్టర్లందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో భాగంగా గృహాలు కట్టిస్తామని తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో జర్నలిస్టు సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సూచనల మేరకు నగరంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి వచ్చిన జర్నలిస్టు నాయకులు బుద్వేల్ ప్రాంతంలోని స్థలం ఇండ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనువుగా ఉందని నిర్ణయించారు. వారి అభీష్టం మేరకు బుద్వేల్‌లోనే ఇండ్ల నిర్మాణం చేపడతామని సీఎం ప్రకటించారు.
బుద్వేల్‌లోని స్థలం ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో ఉందని, దానిని తిరిగి ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎస్పీ సింగ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను సీఎం ఆదేశించారు. పాత్రికేయుల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు సూచించారు. జర్నలిస్టుల్లో ఎక్కువ మంది దిగువ, మధ్య తరగతికి చెందినవారేనని, వారికి సొంత ఇండ్లు కూడా లేవని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులందరికీ దశలవారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. మీడియాలో పనిచేసే అన్ని విభాగాల సిబ్బందికి ఇండ్లు ఇస్తామని, హౌసింగ్ టవర్లలో ఇతర పౌర సదుపాయాలు కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పాత్రికేయులంతా మెరుగైన జీవితం గడపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అమర్, పల్లె రవి, క్రాంతి, విరాహత్ ఆలీ, పీవీ శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, రమేశ్ హజారి, బుద్ధా మురళి, సతీశ్, శైలేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు
Sakshi | Updated: February 09, 2016 01:18 (IST)
No comments:
Post a Comment