Wednesday, 3 February 2016

తుని హింసాకాండ కేసులో ఏ1గా ముద్రగడ... ఓ మీడియా సంస్థ అధినేతపైనా కేసు...

తుని హింసాకాండ కేసులో ఏ1గా ముద్రగడ... ఓ మీడియా సంస్థ అధినేతపైనా కేసు...
03-02-2016 11:07:07

తుని హింసాకాండపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 57 కేసులు నమోదు చేశారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 7, రైల్వే కేసులు మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అన్ని కేసుల్లో ముద్రగడ పద్మనాభాన్ని ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
 
తుని ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ అధినేత సుధాకర్‌నాయుడు, గర్జన స్థల యజయాని రాజా చినబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పల్లంరాజు, వట్టి వసంతకుమార్‌, సి.రామచంద్రయ్య, బొత్స, జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, స్థానిక నేతలు ఆకుల రామకృష్ణ, కామన ప్రభాకర్‌రావు, నల్లా విష్ణు తదితర నేతలపై కేసు నమోదు చేశారు. తుని ఘటన కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనకు సంబంధించిన వివరాలను సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు ఆరా తీశారు.

No comments:

Post a Comment