చిరుత కలకలం.. 134 స్కూళ్లకు సెలవు
Others | Updated: February 11, 2016 11:20 (IST)
బెంగళూరు: బెంగళూరులో చిరుతపులులు సంచరిస్తుండటంతో నగరంలోని 134 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బుధవారం నాడు 60 స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ గురువారం వాటి సంఖ్యను రెట్టింపు చేసింది. వారం రోజుల కిందట స్కూల్లోకి ఓ చిరుత వచ్చి నానా హడావుడి చేసి చివరకు తోక ముడిచి వెళ్లిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది కదూ. మరోసారి కూడా సరిగ్గా మళ్లీ అదే స్కూల్లోకి మరో చిరుత మంగళవారం ప్రవేశించింది. స్థానికులు మాత్రం తాము రెండు చిరుతలను చూసినట్లు చెబుతున్నారని అటవీ శాఖాధికారి ఒకరు వెల్లడించారు.
వర్తూర్, మరాఠా హల్లి, దొడ్డనకనెల్లి, ఇమ్మాడిహల్లి, తూర్పు బెంగళూరు ఏరియాల్లోని అన్ని పాఠశాలలను మూసివేశారు. మంగళవారం చిరుతలు సంచరిస్తున్నాయన్న వార్తలతో బుధవారం నాడు కొన్ని ఏరియాల్లో స్కూళ్లకు ప్రకటించిన విషయం తెలిసిందే. పులులు ఉన్నాయని చెప్పడానికి తమ వద్ద రుజువులు లేనవి ప్రిన్సిపాల్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్ రవి రాల్ఫ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని, చిరుతల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే పట్టుకుని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విబ్జ్‌యార్ స్కూల్లోకి ఈనెల 7వ తేదీన ఒక చిరుత ప్రవేశించి, అటవీ శాఖాధికారులను గాయపరిచిన విషయం తెలిసిందే. మొత్తానికి బెంగళూరు వాసులు చిరుత సంచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

No comments:
Post a Comment