Sunday, 21 February 2016

చంద్రబాబు ఉంగరాలు వాచీలు


చంద్రబాబు ఉంగరాలు వాచీలు
Oct 2, 2015

2015 సెప్టెంబరు నెలలో నారా లోకేష్ తమ కుంటుంబ ఆస్తులు ప్రకటించారు. ఆ సందర్భంగా చంద్రబాబు తనకు ఉంగరాలు వాచీలు లేవనీ జేబులో డబ్బులు కూడా వుండవని అన్నారు. 

http://apdunia.com/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6/

చంద్రబాబు గడియారం ‘థీరి’ ఏమిటో

  • Array
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతోపాటు అధికార వర్గాల్లో కూడా  కలకలం రేపుతున్నాయి. శనివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా  సామాజిక మాధ్యమాల్లో అయితే జోకుల మీద జోకులు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అధికారికం’గా చూపించిన లెక్కల్లోనే ఆయన కుటుంబ ఆస్తి కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటిది చంద్రబాబు  ‘నేను గడియారం, ఉంగరం వంటివే ధరించను. అన్నిటికీ దూరంగా ఉండాల్సిన అవసరం నాకేంటి. ఎందుకీ త్యాగం చేస్తున్నాను. ఎందుకు ఇంత కష్టపడుతున్నాను. అధికారులను కోప్పడుతున్నాను. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నాను. ఇవన్నీ ఎందుకు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే తప్ప నా ఆస్తులు పెంచుకోవడానికి కాదు’ అని సీఎం వ్యాఖ్యానించటంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
గడియారం..వాచీలు పెట్టుకున్న వారికి  కోట్ల రూపాయలు ఉంటాయి..లేకపోతే ఏమీ లేనట్లా..ఈ లాజిక్ ఏమిటో అర్థం కావటంలేదని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి ఆరోపణల వివాదంలతోకి లోకేష్ ను లాగటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘ప్రతిపక్ష నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొందరు మనుషులను చంపడం కోసం గన్స్‌ ఉపయోగిస్తుంటే… తాను పంటలను కాపాడేందుకు రెయిన్‌ గన్స్‌ ను రైతులకు సరఫరా చేస్తున్నానని సీఎం తెలిపారు.


No comments:

Post a Comment