Wednesday, 3 February 2016

ప్రేమ జంటలు కనిపిస్తే చాలు... వారికి అదేపని...

ప్రేమ జంటలు కనిపిస్తే చాలు... వారికి అదేపని...
03-02-2016 00:59:09


http://www.andhrajyothy.com/Artical?SID=202624



  • కాపుకాసి ప్రేమ పక్షుల వేట
  • 4 నెలల్లో 20 మందిపై అత్యాచారం
  • విజయవాడ- గుంటూరు మధ్య యథేచ్ఛగా అరాచకాలు
  • నలుగురు సభ్యుల ముఠా అరెస్టు
గుంటూరు: ప్రేమ కబుర్లు చెప్పుకోవడానికి వచ్చే జంటలను టార్గెట్‌ చేస్తారు. వాళ్లు కబుర్లతో లోకం మరిచిన స్థితిలో.. కర్కశంగా కత్తి దూస్తారు. నిశ్చేష్టులై నిలబడిపోయిన వారిని నిలువు దోపిడీ చేసేస్తారు. అక్కడితో ఆగకుండా.. యువతులపై అమానుషంగా దాడిచేసి దారుణంగా చిదిమేస్తారు!.. నలుగురు సభ్యుల ఈ ముఠా.. నాలుగు నెలల్లో దాదాపు 20 మందిపై అత్యాచారం చేసినట్లు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు వెల్లడించారు. తాడేపల్లిలో ఒక ఇంట్లో చోరీ చేసి, యువతిపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో 
భాగంగా.. వినోద్‌కుమార్‌, నాగరాజు దుర్గాప్రసాద్‌ మనోజ్‌ అనే నలుగురిని పోలీసులు ఇంటరాగేట్‌ చేశారు. వారు చెప్పిన విషయాలు పోలీసులనే నిశ్చేష్టులను చేస్తున్నాయి.
 
ఆదమరిస్తే.. అంతే 
విజయవాడ పరిధిలో నున్న-పాయకాపురం మధ్య 200 ఎకరాల్లో వేసిన వెంచర్‌లో చాలానే ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ప్రేమ జంటలు, వివాహేతర సంబంధంలో ఉన్నవారు తరచూ విజయవాడ నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఇదే అదనుగా తాడేపల్లికి చెందిన దేవర వినోద్‌కుమార్‌, మేడా నాగరాజు, ఎర్రబడి దుర్గా ప్రసాద్‌, కొండ్రెడ్డి మనోజ్‌ విరుచుకుపడేవారు. కత్తులతో బెదిరించి.. జంటను లొంగదీసుకొంటారు. వారిని దూరంగా తీసుకెళ్లి.. తీవ్ర వేధింపులకు గురిచేస్తారు. వారి వద్ద ఉన్న వస్తువులను తీసేసుకొంటారు. ఆ జంటలోని యువతిపై సామూహిక అత్యాచారం జరుపుతారు. ఇలా 2014 డిసెంబర్‌ నుంచి గత మార్చి వరకు సుమారు 20 మందిపై అత్యాచారం జరిపారు. అయితే, పరువు సమస్యతో బాధితులు బయటకు రాలేదు. వీరి చేతుల్లో బలయిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు రంగంలోకి దిగేటప్పటికే ముఠా బిచాణా ఎత్తేసింది. అప్పటినుంచి విజయవాడ, గుంటూరులకు చెందిన ప్రత్యేక బలగాలు ఈ ముఠా కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ ముఠాను దుర్గాప్రసాద్‌ నడుపుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
 
ఇంటిపై దాడి చేస్తూ.. 
తాడేపల్లిలోని సీతానగర్‌లో గత నెల 22న అర్ధరాత్రి ఓ ఇంటిని ఈ ముఠా దోచుకొంది. ఇంటి యజమాని కుమార్తెపై అత్యాచార యత్నం చేసింది. ఆమె ప్రతిఘటించి కేకలు పెట్టటంతో వారు పరారయ్యారు. ఈ కేసులో గుంటూరు అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి ఆదేశాల మేరకు సీసీఎస్‌ అదనపు ఎస్పీ తిరుపాల్‌, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, నార్త్‌ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా సీతానగర్‌ దోపిడీ..వారి పనేనని తేలింది. నిందితుల్లో.. వినోద్‌కుమార్‌, నాగరాజు 10వ తరగతి చదివారు. దుర్గాప్రసాద్‌ ఇంటర్‌, మనోజ్‌ డిప్లమో చేశారు. నలుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరిలో దుర్గా ప్రసాద్‌ పందుల పెంపకం వృత్తిలో ఉండగా, వినోద్‌, నాగరాజు, మనోజ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌.

No comments:

Post a Comment