తుని హింసాకాండలో నిందితులెవరో తెలిసిపోయింది... పక్కా స్కెచ్‌తో...
03-02-2016 09:03:07
తుని : తుని కాపు గర్జన తదనంతరం జరిగిన పరిణామాలు పక్కా స్కెచ్‌తో కొంతమంది కుట్రదారులు చేసినవేనని ఏబీఎన్ ముందు నుంచీ చెబుతూనే ఉంది. ఇప్పుడు ఈ హింసాకాండకు పాల్పడిన కొంతమంది ఆగంతకుల చిత్రాలు ఏబీఎన్ సంపాదించింది. తుని హింసాత్మక ఘటనపై ఏబీఎన్‌కు ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ లభించాయి. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని బోగీలపై దాడులు చేసినట్లు ఈ విజువల్స్ చూస్తే తెలుస్తోంది.
100 మంది ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చినట్లు సమాచారం. రైళ్లు, పోలీస్‌స్టేషన్, వాహనాలకు కర్చీఫ్ గ్యాంగే నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కర్చీఫ్ గ్యాంగ్‌ను రెండు వాహనాల్లో తరలించినట్లు సమాచారం. వాహనాల నంబర్లను పోలీసులు గుర్తించారు. వాహనాల నెంబర్ల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
No comments:
Post a Comment