Monday 2 May 2016

తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలి : చంద్రబాబు

తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలి : చంద్రబాబు 
03-05-2016 01:19:14

  • పరస్పర ఆమోదంతోనే చేపట్టాలి
  • కేంద్రానికి లేఖ రాస్తాం
  • ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
  • కేబినెట్‌లో ప్రత్యేక తీర్మానం
  • పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతలు, గోదావరిమీద బ్యారేజీలపై ఆందోళన

విజయవాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపువల్ల నవ్యాంధ్రకు నష్టం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులద్వారా తెలంగాణ 135 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశముందన్నా రు. దీనివల్ల ఏపీకి జరిగే నష్టాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రికీ లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పారు. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘కొత్తగా ఏర్పాటైన రెండు రాషా్ట్రల మధ్య కొత్త సమస్యలు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
 
ఉభయ రాషా్ట్రలకు ఆమోద యోగ్యంగానే ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంటుంది. అప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులపై ముందుకు సాగకుండా చూడాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. కృష్ణా జలాలపై ఏర్పాటైన ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ట్రిబ్యునళ్లు, కోర్టులు కూడా దిగువ రాషా్ట్రల హక్కులను కాపాడాలని విన్నవించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రైతులు కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఎగువ రాషా్ట్రలు నిర్మించే ప్రాజెక్టులతో ఎప్పుడూ దిగువ రాషా్ట్రలు బలవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
 
‘‘గతంలో కృష్ణా నదిపై ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక నిర్మించిన ప్రాజెక్టులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతే... ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో చివరన ఉన్న నవ్యాంధ్రకు అదనపు నష్టం జరగనుంది. ఈ ఏడాది కృష్ణా నదిలో కేవలం 66 టీఎంసీల నీరు వచ్చింది. ఇది తాగునీటి అవసరాలకు కూడా సరిపోవడం లేదు’’ అని తెలిపారు.

No comments:

Post a Comment