Wednesday 25 May 2016

హోదాకు మించి ఏపీకి సాయం

హోదాకు మించి ఏపీకి సాయం 
26-05-2016 00:03:34


  • కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటోంది: హరిబాబు
  • నేటి నుంచి జూన్‌ 15 వరకు ద్వితీయ వార్షికోత్సవాలు
విజయవాడ, హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): బీజేపీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, హోదా కంటే కూడా అన్ని విషయాలలో ఆదుకుని తీరుతామని, ఇప్పటికే అన్ని అంశాల్లో తమవంతుగా సహాయ సహకారాలను అందించామని రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికిగాను ఈ నెల 26 నుంచి వచ్చేనెల 15 వరకు ద్వితీయ వార్షికోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో స్టేట్‌ ఆఫీస్‌ బేరర్స్‌తో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం, నెల్లూరుల్లో సభలు నిర్వహిస్తామని, దీనిలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న వాటిని, పేర్కొనని వాటిని కూడా నెరవేరుస్తున్నామని తెలిపారు. విద్యుత మిగులు రాష్ట్రంగా ఏపీ ఉండడానికి కేంద్రం తీసుకున్న చొరవే కారణమని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని.. అంతకంటే ఎక్కువగా నిధులు ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సూచించిందని పురందేశ్వరి తెలిపారు. 
హోదాపై ప్రజలకు ఏం చెప్పాలి?
ప్రత్యేక హోదా ఇవ్వకుండా జనాల్లోకి వెళ్తే పరిస్థితి ఏమిటని ఈ సమావేశంలో పార్టీ నాయకులు చర్చించారు. ప్రస్తుతం హోదా సెంటిమెంట్‌గా మారిందని, దీనిపై ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలని నాయకులు తర్జన భర్జన పడ్డారు. ఈ విషయాన్ని త్వరలో పార్టీ అధిష్ఠానం దృష్టికి, ఆతర్వాత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి, ప్రధానితో చర్చించాకే ప్రజల్లోకి వెళ్లాలని అనుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో సోము వీర్రాజు, పురందేశ్వరి, గోకరాజు గంగరాజు, విష్ణుకుమార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

హోదా సమస్యను పరిష్కరిస్తాం 

ఏపీ అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం తీసుకోలేదు: అమిత్‌షా 
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితషా ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఏపిలో జరుగుతున్న ఆందోళనలు తన దృష్టికి వచ్చాయని, ఈ అంశాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబును మార్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఏకాభిప్రాయంతోనే నిర్ణయం ఉంటుందని విలేకరులకు తెలిపారు.


హోదాపై ఏపీకి కేంద్రం అన్యాయం చేయలేదు : పురందేశ్వరీ 
25-05-2016 17:53:42

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేయలేదని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీఅన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతు ఇక మున్ముందు ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు 11 రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఉందో.. ఆ రాష్ర్టాలకు 2017 మార్చి వరకే హోదా ఉంటుందని..ఆ తర్వాత వాటిని పొడిగించేది లేదని ఆమె అన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆ స్థాయి వరకు అన్ని విధాలా సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరీ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment