Saturday 14 May 2016

హోదా సంజీవని కాదని బాబే అన్నారు కదా!

హోదా సంజీవని కాదని బాబే అన్నారు కదా!

Sakshi | Updated: May 13, 2016 04:19 (IST)
హోదా సంజీవని కాదని   బాబే అన్నారు కదా!
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సీఎం చంద్రబాబే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారని.. ఆయనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనే సంకేతాలు కేంద్రానికి ఇచ్చి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇక్కడికి వచ్చినపుడు కూడా ప్రత్యేక హోదా గురించి బాబు అడగలేదని గుర్తుచేశారు. ఒకవైపు రాష్ట్రంలో ‘లోటు’లో ఉందంటూ మరోవైపు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ నిధులకు రాష్ట్రాభివృద్ధికి వెచ్చిస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.

ఈ దుబారా ఖర్చులను కేంద్రం నిధులు భరించదన్నారు. గురువారం బీజేపీ నగర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నేరుగా మాట్లాడకుండా లీకులిస్తూ టీడీపీ చోటా నాయకులతో బీజేపీని, ప్రధాని మోదీని తిట్టిస్తూ నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రజల గొంతు వినిపించాల్సిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేస్తూ ఆ పార్టీని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి అధికార దాహంతో వెళ్లడం నీచమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. వ్యవసాయ రుణమాఫీ, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్‌షాపుల రద్దు, మహిళలకు భద్రత, నిరుద్యోగభృతి వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసీ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో లేక్‌వ్యూగెస్ట్‌హౌస్, సెక్రటేరియట్, ఇక్కడ క్యాంపు కార్యాలయాల మరమత్తులకు రూ.కోట్లు దుబారా చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.1,41,800 కోట్లు ఇచ్చిందంటూ ఆ వివరాలు పత్రికలకు విడుదల చేశారు.

No comments:

Post a Comment