Wednesday 18 November 2015

అమరావతి కోసం ఎంత అప్పు అడిగారంటే...

అమరావతి కోసం ఎంత అప్పు అడిగారంటే...

November 18th, 2015, 03:00 PM IST
అమరావతి కోసం ఎంత అప్పు అడిగారంటే...
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు, ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రాజధానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అదే స్థాయిలో ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో వనరులు సమకూర్చుకునే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. 

రాజధాని నిర్మాణం నిధుల కోసం ప్రపంచబ్యాంకు రుణానికెళ్లాలని పభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.35 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇటీవల కార్యదర్శుల స్థాయి అధికారుల సమావేశంలో ఈ అంశం చర్చించారు. కొత్త రాజధాని పునరావాస ప్రక్రియగా సాగుతోందని, ఇది ఆర్థిక కేంద్రంగా మారనున్న నేపథ్యంలో తమకు కొంత రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును కోరేందుకు సిద్ధమయ్యారు. సంవత్సరాల వారీగా రాజధాని నిర్మాణ ప్రగతి ఎలా ఉంటుందనేది మేనెలలోనే కేంద్రానికి పంపారు. కేంద్రం అంత నిధులిచ్చే పరిస్థితి లేకపోవడంతో అదే నివేదికతో ప్రపంచ బ్యాంకుకు కెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కేంద్రం అనుమతి కోసం పట్టణాభి వృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామని ఆయన ఇచ్చిన హామీతో ప్రభుత్వం హడావుడిగా నివేదికలు తయారు చేస్తోంది.

35 ఏళ్ల కాలపరిమితితో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు తొలి 10 సంవత్సరాలకు సంబంధించిన నివేదిక ప్రకారం రూ.35,508 కోట్లు అంచనాలు గల ప్రతిపాదనలు తయారు చేశారు. తొలి ఐదేళ్లలో రూ.15,570 కోట్లు, ఆరో ఏట నుండి పదో ఏట వరకూ రూ.19,938 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఈ వివరాలను ప్రపంచ బ్యాంకుకు పంపి, అక్కడి నుంచి ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు ద్వారా రుణం తీసుకోనున్నారు. సింగపూర్‌ పర్యటన సమయంలోనే ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నేరుగా ఈ రుణం గురించి చర్చించినట్లు తెలిసింది. రాజధానిలో విదేశీ కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినా ఆర్థిక లావాదేవీలకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయమొచ్చే అవకాశం లేదు. అందువల్ల తొలి పదేళ్ల నిర్మాణ ఖర్చును కేంద్రం ఇవ్వటం లేదా రుణానికి వెళ్లడం అనివార్యమంటున్నారు.
- See more at: http://telugu.gulte.com/tnews/12174/CHandrbaabu-Seeks-Loan-Fro-mWorld-Bank-For-Amaravati#sthash.uiZFV3Nw.dpuf

No comments:

Post a Comment