Thursday 12 November 2015

చైనా, ఇండియా మమ్మల్ని వాడేసుకుంటున్నాయ్.

చైనా, ఇండియా మమ్మల్ని వాడేసుకుంటున్నాయ్...
Updated :12-11-2015 08:36:40
వాషింగ్టన్: చైనా, భారత్ దేశాలు అమెరికా ఆర్థిక విధానాలను ఆసరాగా చేసుకుని తమను బాగా వాడుకుంటున్నాయని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ తరఫున జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధానంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కార్యకలాపాలతో చైనా వల్ల సమస్యలు పుట్టుకొస్తున్నాయన్నారు. వీటికి తోడు చైనా కరెన్సీ మేనిప్యులేషన్ వల్ల ఆర్థికంగాను తలనొప్పులు పుట్టుకొస్తున్నాయన్నారు డొనాల్డ్. చైనా వల్ల అమెరికాకు ఇప్పటివరకూ 500 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆయన చైనాతో పాటు భారత్ పేరు కూడా ప్రస్తావించినప్పటికీ, మన దేశం వల్ల వచ్చిన సమస్యలేమిటో చెప్పలేదు. అదే సమయంలో రష్యా అధినేత పుతిన్‌ను కూడా ఆయన వదల్లేదు. మధ్య ప్రాచ్య దేశాల్లో ప్రాపకం పెంచుకోవడానికి పుతిన్ వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. చైనా విషయంలో డొనాల్డ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు మద్దతు తెలిపినప్పటికీ, భారత్‌పై ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

No comments:

Post a Comment