Tuesday 3 November 2015

ప్రమాదపుటంచున ఉండవల్లి గుహలు

ప్రమాదపుటంచున ఉండవల్లి గుహలు
Updated :03-11-2015 07:25:17
ఆంధ్రజ్యోతి, విజయవాడ : చారిత్రక నేప థ్యం ఉన్న ఉండవల్లి గుహలు ప్రస్తుతం ప్రమాదంలో పడే అవకాశాలు పెరుగుతున్నాయి. ప్ర భుత్వం, అధికారులు కలిసి శంకుస్థాపన పను ల్లో భాగంగా ఉండవల్లి గుహలు వెలిసిన వెను క కొండ నుంచి మట్టిని తవ్వేశారు. రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యే ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్డు తదితరాలు వేయాలనుకోవడ మే. కారణం ఏదైనా మాత్రం ప్రస్తుతం అక్కడ అధిక సంఖ్యలో లారీల ద్వారా మట్టిని తరలించేశారు. అధికారులు ఆ ప్రాంతం నుంచి మట్టిని తరలించడానికి పూనుకున్న రెండు మూడు రోజులకే స్థానికులు నిరసన తెలిపారు. ఆ ప్రాం తంలో నిరసనలు అధిక మవడంతో గుంటూరు ఆర్డీవో స్థానికులకు సర్దిచెప్పారు. మట్టి తీయడంతో ఏర్పడిన గోతులను పూడుస్తామని అధికారులు చెప్పారని స్థానికులు తెలిపారు. సమస్య అప్పటికి సద్దుమణిగింది. శంకుస్థాపన అనంతరం కూడా ఇక్కడి నుంచి వివిధ అవసరాలకు మట్టిని తరలిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఉండవల్లి గుహల గురించి భవిష్యత్తు తరం పుస్తకాల్లో కాకుండా వాస్తవంగా అపరూ ప నిర్మాణాలను చూసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి సారించి వీటిని పర్యాటక పరంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి మట్టి తీయించిన గోతులను పూడ్చి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి

No comments:

Post a Comment