Monday 9 November 2015

అమిత షాకు బి‘హారర్‌’!

అమిత షాకు బి‘హారర్‌’! 
Updated :10-11-2015 02:00:58
  • రెండోసారి పార్టీ పగ్గాలు దక్కేనా!
  • స్వరం పెంచుతున్న వైరి వర్గం
న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘గెలుపోటములు పార్టీ అధ్యక్షుడిని నిర్ణయి స్తే. అధ్యక్షుడిని ఎన్నుకోవడం అసాధ్యం’ బిహార్‌ ఫలితాలు వెలువడటానికి కొద్ది రోజుల ముందు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. బీజేపీ చీఫ్‌ అమిత షా సమాధా నం ఇది. షా వ్యాఖ్యలు ఎలా ఉన్నా ‘బిహార్‌ ఓటమి..షా పదవికి ఎసరు పెట్టనుందా?’ అన్న ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఈ ఏడాది చివరిలో కాని వచ్చే ఏడాది జనవరిలోకాని బీజేపీ అధ్యక్షస్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అమితషా మరోసారి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్‌, వెంకయ్య సైతం స్పష్టం చేశారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో షాకు సారథ్యంపై అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత కాలం ప్రధాని మోదీకి సన్నిహితుడిగా.. ఎన్నికల వ్యూహరచనలో అపర చాణక్యుడిగా బీజేపీ లో తిరుగులేని అధికారాన్ని చలా యిస్తున్న అమిత షాకు వ్యతిరేకంగా నోరువిప్పేం దుకు పార్టీలో ఆయన వ్యతిరేకులు ధైర్యం చేసేవారు కాదు. కానీ ఢిల్లీ, బిహార్‌ వరుస పరాజయాలు వారికి అసా్త్రలుగా మారాయి. దీంతో షాకు వ్యతిరేకంగా వారు తమ గళాన్ని వినిపించడం ప్రారంభించారు. పార్టీ ఎంపీలు శత్రుఘ్న సిన్హా, చందన మిత్ర.. బిహార్‌లో అమితషా అనుసరించిన ప్రచార వ్యూహాన్ని తప్పుబట్టారు.
 
మోదీ.. బచ్చోంకా షేర్‌!
‘మోదీ..బచ్చోంకా షేర్‌. బిహార్‌లో ఉద్దం డ పిండాలైన లాలూ, నితీశ్‌లను ఢీ కొట్టడానికి సరిపోరు. మోదీ, అమిత్‌షాల మితి మీరిన ఆత్మవిశ్వాసం, అహంభావమే బిహా ర్‌ ఘోర పరాజయానికి కారణం’.. ఇవీ బీజేపీ ఎంపీలు బిహార్‌ ఫలితాలపై అంతర ్గత చర్చల్లో చేస్తున్న వ్యాఖ్యలు. బీజేపీ సీనియర్ల మాటలూ ఇలాగే ఉంటున్నాయి.

No comments:

Post a Comment